అన్వేషించండి

Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు

BGT News: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)ని దక్కించుకోవాలంటే సిడ్నీలో జరిగే ఐదో టెస్టులో భారత్ గెలవడం తప్పనిసరి. ఇందుకోసం టీమ్ మేనేజ్మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

Aus Vs Ind 5th Test News: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం టీమిండియా 1-2తో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో ఈ టెస్టులో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అంచనాలకు తగినట్లుగా రాణించకపోవడంతో అతనిపై వేటు వేయాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి గత పర్యటనలో అతను కీలక ఇన్నింగ్స్ ఆడి భారత జట్టు రెండోసారి సిరీస్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈసారి మాత్రం అతను తేలిపోయాడు. అలాగే పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేయలేక, వికెట్లు పారేసుకుంటుండటంపైనా మేనేజ్మెంట్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అంతంతమాత్రంగానే..
భారీ అంచనాలతో ఈ సిరీస్ లోకి అడుగు పెట్టిన రిషబ్.. అంచనాలు ఏమాత్రం అందుకోలేదు. ఇప్పటివరకు 4 టెస్టులాడిన అతను 7 ఇన్నింగ్స్ లో కలిపి 165 పరగులే చేశాడు. అతని సగటు కేవలం 22 ఉండగా, అత్యధిక స్కోరు 37 పరుగులే కావడం గమనార్హం. తొలి టెస్టు నుంచి వరుసగా 37,1,21,28, 9, 28, 30 పరుగుల స్కోర్లు నమోదు చేశాడు. ఇక, మెల్ బోర్న్ టెస్టులో కీలక సమయంలో చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకుని, జట్టు ఓటమికి కారణమయ్యాడని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో ధ్రువ్ జురెల్ ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తను సమయోచితంగా ఆడుతాడని, ఇప్పటికే ఇంగ్లాండ్ సిరీస్ తో పాటు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటించిన ఇండియా ఏ తరపున సత్తా చాటాడు. అయితే తొలి టెస్టులో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో  కలిపి 12 పరుగులే చేసి జట్టులో చోటు కోల్పోయాడు. అయితే ఇతడిని పంత్ కు ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తే ఎలా ఉంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఎందుకంటే ఇండియా-ఏ తరపున రెండు ఇన్నింగ్స్ ల్లోనూ అర్థ సెంచరీలు బాది, సత్తా చాటాడు. ఏదేమైనా టాస్ ముందు వరకు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. 

గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి..
మరోవైపు భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ పనితీరును బీసీసీఐ సమీక్షిస్తోందన్న కథనాలు సంచలనం రేపాయ. ఈ టెస్టు సిరీస్ తర్వాత మరో మేజర్ టోర్నీ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వరకు జట్టు ప్రదర్శనలో మార్పు రాకపోతే గంభీర్ ను కూడా సాగనంపే అవకాశముందని తెలుస్తోంది. అలాగే కోచింగ్ స్టాఫ్ పైనా, సెలెక్షన్ కమిటీని కూడా రద్దు చేసే అవకాశమున్నట్లు సమాచారం. నిజానికి విదేశీ మాజీలు భారత ఫుట్ టైమ్ కోచ్ గా ఉండటానికి ఆసక్తి చూపకపోవడంతో, రాజీ పడి గంభీర్ ను కోచ్ గా బోర్డు ఎంపిక చేసిందని తెలుస్తోంది. తను ఫస్ట్ చాయిస్ కోచ్ కాదని, వేరే మాజీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో తనను ఎంపిక చేసినట్లు బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక గంభీర్ హయాంలో భారత్ ఘోర పరాజయాలు చవిచూస్తోంది. శ్రీలంకతో దశబ్ధాల తర్వాత వన్డే సిరీస్ ఓడిపోయింది. అలాగే సొంతగడ్డపై దశబ్ధాలుగా కనీసం టెస్టు మ్యాచ్ గెలవని, న్యూజిలాండ్ కు ఏకంగా టెస్టు సిరీస్ ను 0-3తో వైట్ వాస్ తో సమర్పించుకుంది. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన నాలుగు టెస్టుల్లో రెండింటిలో ఓడి, ఒకటి డ్రా చేసుకోగా, ఒకదాంట్లో గెలుపొందింది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఏదేమైనా మరో రెండు నెలల్లో గంభీర్ భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశముంది. 

Also Read: Bumrah Record: 'బుమ్రా'స్త్రం.. అత్యధిక ఐసీసీ పాయింట్లను సాధించిన బౌలర్ గా రికార్డు.. కపిల్, కుంబ్లే, బేడీల వల్ల కాని రికార్డును కొల్లగొట్టిన స్పీడ్ స్టర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
The RajaSaab - King Size Interview: ప్రభాస్ & 'ది రాజా సాబ్' హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ... ప్రోమో వచ్చేసింది
ప్రభాస్ & 'ది రాజా సాబ్' హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ... ప్రోమో వచ్చేసింది
Embed widget