News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mahesh Babu: మళ్లీనా మహేష్ బాబు? ఇలాగైతే ‘గుంటూరు కారం’ ఎప్పటికి పూర్తవుతుందో!

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. దీంతో ఆయన నటిస్తోన్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వనున్నారు.

FOLLOW US: 
Share:

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన రీసెంట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ అనే సినిమాను చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూలన్ ను ప్రారంభించారు. అయితే మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి మాత్రం ఎక్కువగానే టైమ్ కేటాయిస్తూ ఉంటారు. షూటింగ్ కు గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో విహార యాత్రలకు వెళ్తుంటారు. ఒక్కోసారి సినిమా షూటింగ్ లకు గ్యాప్ ఇచ్చి మరీ ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటారు మహేష్. మహేష్ ఇప్పుడు మరో టూర్ కు వెళ్లనున్నారట. అందుకోసం మూవీ షూటింగ్ కు కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వనున్నారని టాక్. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

విదేశాలకు మహేష్ - షూటింగ్ కు బ్రేక్..

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో విదేశాలకు వెళ్లనున్నారు. అందుకే ‘గుంటూరు కారం’ కొత్త షూటింగ్ షెడ్యూల్ ను ఈ నెల 19 తో ముగించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మహేష్ కొడుకు గౌతమ్ లండన్ లో చదువుతున్న కారణంగా గౌతమ్ కలసి లండన్ వెళ్లనున్నారట మహేష్. అందుకే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మళ్లీ ఒక వారంలో మహేష్ హైదరాబాద్‌కు తిరిగి వస్తారని, తర్వాత మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని టాక్. ఈలోపు దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ లేని కొన్ని పోర్షన్స్ ను కంప్లీట్ చేయనున్నారని సమాచారం. 

20 ఏళ్ల కుర్రాడిగా మహేష్..

మహేష్ బాబు కటౌట్ కు తగ్గట్టు ‘గుంటూరు కారం’ కథను రాసుకున్నారట త్రివిక్రమ్. ఇక మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే ఫైట్స్, యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీలో ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బాక్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించనున్నారని టాక్. విఎఫ్ఎక్స్ సహాయంతో మహేష్ యంగ్ లుక్ లో చూపించబోతున్నారట. గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో నడవనున్న ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు సమాచారం. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హైలెట్ గా నిలుస్తుందని టాక్. మొత్తంగా మహేష్ ఇమేజ్, బాడీ లాంగ్వెేజ్ కు తగ్గట్టు మరోసారి సరికొత్త కథను సిద్దం చేశాడట త్రివిక్రమ్. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారట. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి లో ఈ మూవీను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. మరి ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Also Read: పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేసిన చిరంజీవి - ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 17 Jul 2023 11:29 AM (IST) Tags: Mahesh Babu Meenakshi Chaudhary Trivikram Srinivas Sreeleela Supet Star Mahesh Babu

ఇవి కూడా చూడండి

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Naga Panchami December 7th Episode మోక్షతో పంచమి చివరి మాటలు.. మృత్యుంజయ యాగం జరిపించనున్న సప్తరుషులు!

Naga Panchami December 7th Episode మోక్షతో పంచమి చివరి మాటలు.. మృత్యుంజయ యాగం జరిపించనున్న సప్తరుషులు!

Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ

Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ

Jagadhatri December 7th Episode: సక్సెస్ ఫుల్ గా ప్లాన్ అమలు చేసిన ధాత్రి.. తెలివిగా బూచిని ఇరికించేసిన కేదార్, ధాత్రి!

Jagadhatri December 7th Episode: సక్సెస్ ఫుల్ గా ప్లాన్ అమలు చేసిన ధాత్రి.. తెలివిగా బూచిని ఇరికించేసిన కేదార్, ధాత్రి!

‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!