By: ABP Desam | Updated at : 16 Jul 2023 09:54 PM (IST)
'భోళా శంకర్' సినిమాలో చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులు సినిమా ఇండస్ట్రీలోనూ ఉన్నారు. హీరోల్లోనూ ఉన్నారు. తమ సినిమాల్లో చిరంజీవిని ఇమిటేట్ చేసిన వారు కూడా ఉన్నారు. చిరు పాటలకు స్టెప్పులు వేయడమో లేదంటే చిరు డైలాగులు చెప్పడమో చేసిన హీరోలను స్క్రీన్ మీద తెలుగు ప్రేక్షకులు చూశారు. అందులో చిరు తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.
చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేయడం కాదు... ఫర్ ఏ ఛేంజ్, పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని చిరంజీవి ఇమిటేట్ చేస్తే? పవన్ కళ్యాణ్ పాటలకు చిరంజీవి స్టెప్పేస్తే? స్క్రీన్ మీద ఎలా ఉంటుంది? ఆ దృశ్యాలను 'భోళా శంకర్'లో ప్రేక్షకులు చూడొచ్చు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా లీక్ చేసేశారు.
మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు - చిరంజీవి
''భోళా శంకర్' సినిమా నుంచి ఒక చిన్న విషయాన్ని మీ కోసం లీక్ చేయబోతున్నా. ఈ విషయం తెలిస్తే మెహర్ రమేష్ గొడవ చేసేస్తారు. అయినా ఏం పర్వాలేదు. మా కళ్యాణ్ బాబు (పవన్ కళ్యాణ్) అప్పుడప్పుడు నా ప్రస్తావన తీసుకు రావడం, నా పాటలకు డ్యాన్స్ చేయడం, నా డైలాగులు చెప్పడం చేశాడు. మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశాడు. అదే విధంగా నేను ఈ సినిమాలో తనను ఇమిటేట్ చేస్తూ... తన మేనరిజమ్స్ కానివ్వండి, తన పాట కానివ్వడం చేయడం జరిగింది. జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని! మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను'' అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Bholaa Shankar As PK : పవన్ కళ్యాణ్ మేనరిజం ఇమిటేట్ చేయడమే కాదు... 'ఖుషి'లో 'ఏ మే రాజః ఏ మేరీ ఘర్ మేరా ఆషియా' పాటకు ఆయన హావభావాలు ఇచ్చారు. ఆ తర్వాత పక్కన ఉన్న రష్మీతో 'తమ్ముని పాట. మస్త్ ఉందిలే' అంటూ డైలాగ్ చెప్పారు. ఈ లీక్స్ మెగా అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాయి. 'ఖుషి' సినిమాలో ఫేమస్ నడుము సన్నివేశాన్ని కూడా 'భోళా శంకర్'లో చిరంజీవి, శ్రీముఖి మీద చిత్రీకరించినట్లు సమాచారం. అయితే... ఆ విషయాన్ని మెగాస్టార్ చెప్పలేదు. తర్వాత లీక్ చేస్తారేమో!?
Also Read : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'బ్రో' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడంటే?
#ChiruLeaks #BholaaShankar #BholaaShankarAsPK#BholaaShankarOnAug11 pic.twitter.com/E7FmyeFulw
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2023
స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న 'భోళా శంకర్'ను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించారు. కీర్తీ సురేష్ ప్రేమికుడిగా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటించారు.
Also Read : ఆలీకి పవన్ కళ్యాణ్ ఝలక్ - స్నేహానికి పూర్తిగా తెగతెంపులు?
చిరంజీవితో పాటు కీర్తీ సురేష్, తమన్నా, సుశాంత్ డ్యాన్స్ చేసిన 'జామ్ జామ్ జజ్జనక' పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. అంతకు ముందు 'భోళా మేనియా' పాటను విడుదల చేశారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
/body>