Vijay Sethupathi in Jawan: అందుకే ‘జవాన్’లో నటిస్తున్నా, డబ్బులు ఇవ్వకపోయినా చేసేవాడిని: విజయ్ సేతుపతి
‘జవాన్’ సినిమాలో నటించేందకు ఓ ప్రత్యేకమైన కారణం ఉందని చెప్పాడు నటుడు విజయ్ సేతుపతి. అవసరం అయితే, ఈ సినిమాను ఫ్రీగా కూడా చేసే వాడినని చెప్పుకొచ్చారు.
![Vijay Sethupathi in Jawan: అందుకే ‘జవాన్’లో నటిస్తున్నా, డబ్బులు ఇవ్వకపోయినా చేసేవాడిని: విజయ్ సేతుపతి Vijay Sethupathi in Jawan reveals he did Shah Rukh Khan starrer for this reason Details Inside Vijay Sethupathi in Jawan: అందుకే ‘జవాన్’లో నటిస్తున్నా, డబ్బులు ఇవ్వకపోయినా చేసేవాడిని: విజయ్ సేతుపతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/17/59516d67c3d908381f80ef26b6ea5a431689582227900544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జవాన్’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అభిమానులను అలరించాయి. ఇక భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆరంభం నుంచే ఓ రేంజిలో బజ్ క్రియేట్ అయ్యింది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అట్టహాసంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘జవాన్’ సినిమా గురించి విజయ్ సేతుపతి కీలక విషయాలు వెల్లడించారు. అసలు తను ఈ సినిమాలో ఎందుకు నటించాల్సి వచ్చిందో వివరించారు. ఈ చిత్రం ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఓ స్పెషల్ రీజన్ తోనే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలిపారు. నిజానికి ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా నటించే వాడినని చెప్పారు.
ఆయన కోసమే జవాన్ చేశా!
‘జవాన్’ సినిమా చేయడానికి కారణం షారుఖ్ ఖాన్ అని చెప్పారు విజయ్ సేతుపతి చెప్పారు. ఆయనతో కలిసి పని చేసే అవకాశం వస్తే మిస్ చేసుకోలేనన్నారు. “’జవాన్’ సినిమాను కేవలం షారుఖ్ ఖాన్ కోసమే చేస్తున్నాను. రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా ఈ సినిమాలో నటించే వాడిని. ఆయనతో నటించే అవకాశం వస్తే వదులుకోకూడదని భావించాను. అనుకున్నట్లుగానే ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. ఎలా వదులుకుంటాను?” అని విజయ్ సేతుపతి ప్రశ్నించారు.
2019లో షారుఖ్ ఖాన్ నటించిన ‘సూపర్ డీలక్స్’లో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. అప్పట్లో విజయ్ నటన పట్ల షారుఖ్ ప్రశంసలు కురిపించారు. త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ ట్రాన్స్ జెండర్ గా కనిపించాడు. కొన్నాళ్ల తర్వాత తన భార్య, పిల్లలతో సహా తన కుటుంబాన్ని కలవడానికి తిరిగి వచ్చే ట్రాన్స్ పాత్రను పోషించాడు. తాజాగా మరోసారి షారుఖ్ తో కలిసి నటిస్తున్నారు.
సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ‘జవాన్‘ విడుదల
‘జవాన్‘ సినిమాలో షారుఖ్ ఖాన్ కు జోడీగా నయనతార నటిస్తుంది. విజయ్ సేతుపతి విలన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియమణి, సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, రిధి డోగ్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘జవాన్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. SRK నటించిన ఈ చిత్రం 2023లో విడుదలైన అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా పేరు తెచ్చుకోనుందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా ఈ ఏడాది జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళు చేసింది. ఈ చిత్రం దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.
Read Also: ఆంధ్రోడా, అంటూ చిల్లర కామెంట్స్ చేశారు - ఆ వివాదంపై స్పందించిన నటుడు బ్రహ్మాజీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)