Nidhhi Agerwal: ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్: ఆ ఫోటో షేర్ చేసి పవన్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన నిధి అగర్వాల్!
పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది నటి నిధి అగర్వాల్. తాజాగా ఈ బ్యూటీ మూవీకు సంబంధించిన షూటింగ్ ఫోటోను షేర్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.
Nidhhi Agerwal: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియడాకిల్ యాక్షన్ డ్రామా మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతోంది. గతంలో పవన్ కల్యాణ్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ చిన్న విడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మొదటి పీరియాడికల్ మూవీ కాబట్టి పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్ ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. మూవీలో షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తో తీసిన ఫస్ట్ షాట్ ఫోటోను షేర్ చేసింది. అంతేకాదు మూవీ టీమ్ కు థ్యాంక్స్ చెబుతూ ఒక నోట్ కూడా రాసుకొచ్చిందీ బ్యూటీ. దీంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మీరు త్వరలో మ్యాజిక్ చూస్తారు: నిధి అగర్వాల్
టాలీవుడ్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది నిధి అగర్వాల్. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసినప్పటికీ పవన్ స్టార్ పక్కన నటించే చాన్స్ కొట్టేసిందీ బ్యూటీ. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కెతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో లీడ్ రోల్ లో నటించే అవకాశం దక్కించుకుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా ఈ మూవీకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోతో పాటు ఒక నోట్ కూడా రాసుకొచ్చింది నిధి. ఈ సినిమాతో తన కల నిజమైందని పేర్కొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి, ఏ.ఎం రత్నం కాంబినేషన్ లో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. అలాంటి గొప్ప టీమ్ తో పనిచేయడం నిజంగా ఆశీర్వాదమేనని చెప్పింది. త్వరలో మీరు మేజిక్ ను చూస్తారని చెప్పింది. అంతేకాక ఆ ఫోటో సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కు తనకు మధ్య తీసిన ఫస్ట్ షాట్ అంటూ చెప్పుకొచ్చింది నిధి.
వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు ‘హరిహర వీరమల్లు’..
‘హరిహర వీరమల్లు’ సినిమాను ప్రారంభించి చాలా రోజులు అవుతోంది.ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలు మాత్రం వరుస షూటింగ్ లు పూర్తి చేసుకుంటుంటే ఈ మూవీ మాత్రం ఏదొక కారణంతో ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయానికి తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయానికి సినిమా పూర్తవుతుందా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మూవీ టీమ్ మాత్రం వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే ఏడాదే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ మూవీను నిర్మిస్తోంది.
View this post on Instagram
Also Read: మళ్లీనా మహేష్ బాబు? ఇలాగైతే ‘గుంటూరు కారం’ ఎప్పటికి పూర్తవుతుందో!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial