అన్వేషించండి

‘నాసామిరంగ’ టీజర్ రిలీజ్, రవితేజ సినిమా టైటిల్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

అతడితో శివాని రాజశేఖర్ షవర్ బాత్‌లు, ముద్దులు - స్టార్ కిడ్ గ్లామరస్ రోల్
కథానాయికలుగా తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టిన స్టార్ కిడ్స్ గ్లామరస్ రోల్స్ చేయడానికి 'యస్' అంటారా? 'నో' అంటారా? అని దర్శక నిర్మాతలలోనూ, ప్రేక్షకులలోనూ చిన్నపాటి సందేహాలు ఉండటం సహజం. అయితే... క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని 'విద్యా వాసుల అహం'తో చెప్పారని అనుకోవచ్చు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రానా కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ - 'రాక్షస రాజా' బ్యాక్ డ్రాప్ అదేనా?
టాలీవుడ్ మ్యాచో స్టార్ దగ్గుబాటి రానా కెరియర్ లో వచ్చిన బెస్ట్ మూవీస్ లో 'నేనే రాజు నేనే మంత్రి' ఒకటి. తేజ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో రానా నటనకు ప్రశంసలు దక్కాయి. 2017లో వచ్చిన ఈ మూవీతో తేజ మళ్ళీ దర్శకుడిగా భారీ కం బ్యాక్ అందుకుని తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాక్షస రాజా'. ఇటీవల రానా బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. దానికి భారీ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై ఒక్కసారిగా అంచనాల పెరిగాయి. 'రాక్షస రాజా' స్టోరీకి సంబంధించి ఫిలిం సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. అదేంటంటే... 1930 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుందట. ఆ టైంలో ఉండే ఒక గ్యాంగ్ స్టార్ స్టోరీగా ఈ సినిమాని డైరెక్టర్ తేజ వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రజనీకాంత్ సినిమాలో ఆఫర్ - రిజెక్ట్ చేసిన షారుక్ ఖాన్, కారణం అదేనా?
'లియో' మూవీతో పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అంత కంటే ముందు 'విక్రమ్'తో ఇండస్ట్రీ హిట్ అందుకొని అగ్ర దర్శకుల సరసన చేరాడు. రీసెంట్ గా వచ్చిన లియో ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నా... కలెక్షన్స్ మాత్రం అదరగొట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్ల గ్రాస్ అందుకుని ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తమిళ చిత్రంగా నిలిచింది. 'ఖైదీ' మూవీతో ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్... ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే... ఈ సినిమాలో ఓ ప్రత్యేక అతిథి పాత్ర కోసం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను లోకేష్ సంప్రదించారట. అయితే బాలీవుడ్ హీరో ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నా సామిరంగ - నాగార్జున మాస్ జాతర, శాంపిల్ వచ్చేసిందండోయ్!
వెండితెరపై మాసీగా కనిపించడంలో, మాస్ సినిమాలు చేయడంలో కింగ్ అక్కినేని నాగార్జున స్టైల్ సపరేట్. 'మాస్', 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలు ఈ జనరేషన్ కూడా చూశారుగా! ఇప్పుడు మరోసారి మాంచి రూరల్ మాస్ సినిమాతో సంక్రాంతికి థియేటర్లలో ఆయన సందడి చేయబోతున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతోన్న మాస్ ఎంటర్‌టైనర్ 'నా సామి రంగ'. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. టీజర్‌ చూస్తే... నాగార్జున మాస్‌ జాతర మామూలుగా ఉండదని అర్థం అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అమితాబ్ ఇంటి పేరే రవితేజ సినిమా టైటిల్ - లుక్ చూస్తే బిగ్ బి...
మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఈ రోజు పూజతో మొదలైంది. ఆయన కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి 'షాక్'... మరొకటి 'మిరపకాయ్'. సుమారు పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. రవితేజ, హరీష్ శంకర్ కలయికలో మూడో సినిమా ఈ రోజు హైదరాబాద్ సిటీలోని ఓ ప్రయివేట్ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'మిస్టర్ బచ్చన్' టైటిల్ ఖరారు చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Tirumala Kalyana Ratham:   తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు  శ్రీవారి కళ్యాణ రథం!
తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Tirumala Kalyana Ratham:   తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు  శ్రీవారి కళ్యాణ రథం!
తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం!
Harish Rao Tweet: కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
Pradeep Machiraju: బుల్లితెరపై ప్రదీప్ రీ ఎంట్రీ... వెంకీ మామతో 'బ్రహ్మముడి' కావ్య కామెడీ... సంక్రాంతి వేడుక కోసం
బుల్లితెరపై ప్రదీప్ రీ ఎంట్రీ... వెంకీ మామతో 'బ్రహ్మముడి' కావ్య కామెడీ... సంక్రాంతి వేడుక కోసం
Parents Property Rights: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
Renu Desai: రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
Embed widget