అన్వేషించండి

Naa Saami Ranga: నా సామిరంగ - నాగార్జున మాస్ జాతర, శాంపిల్ వచ్చేసిందండోయ్!

Naa Saami Ranga Teaser: కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'నా సామి రంగ' టీజర్ ఈ రోజు విడుదల చేశారు.

Naa Saami Ranga is going to be Akkineni Nagarjuna mass jathara: వెండితెరపై మాసీగా కనిపించడంలో, మాస్ సినిమాలు చేయడంలో కింగ్ అక్కినేని నాగార్జున స్టైల్ సపరేట్. 'మాస్', 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలు ఈ జనరేషన్ కూడా చూశారుగా! ఇప్పుడు మరోసారి మాంచి రూరల్ మాస్ సినిమాతో సంక్రాంతికి థియేటర్లలో ఆయన సందడి చేయబోతున్నారు.

Naa Saami Ranga Teaser Released, Watch Here: అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతోన్న మాస్ ఎంటర్‌టైనర్ 'నా సామి రంగ'. ఈ సినిమాతో ప్రముఖ నృత్య దర్శకుడు విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ చిత్ర సమర్పకులు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు. టీజర్‌ చూస్తే... నాగార్జున మాస్‌ జాతర మామూలుగా ఉండదని అర్థం అవుతోంది.  

టీజర్ ప్రారంభంలో మామిడి తోటలో నాగార్జున మాస్ ఫైట్ చూపించారు. టీజర్ చివరలో కత్తి నోటిలో పెట్టుకుని నాగార్జున చేసిన మాస్ ఫైట్ కూడా మామూలుగా లేదు. ఫైట్స్ మాత్రమే కాదు... సినిమాలో రొమాంటిక్ & లవ్లీ సీన్లు కూడా ఉన్నాయి. అయితే... హీరో హీరోయిన్లు ఎందుకు మాట్లాడుకోవడం లేదనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎనిమిదేళ్ల క్రితం వాళ్ళ మధ్య ఏం జరిగింది? అనేది కొన్ని సీన్లలో చూపించారు. అయితే... గొడవ ఏమిటో చెప్పలేదు. 

Also Readపది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!

ఈ సినిమాలో కన్నడ భామ ఆషికా రంగనాథ్ కథానాయిక. తెలుగు ఆమెకు రెండో చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ఆమె తొలి తెలుగు సినిమా. కొన్ని రోజుల క్రితం నాగార్జున, ఆషికాపై తీసిన 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది' పాటను విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది. ఆ పాటకు ఆస్కార్ అవార్డు విజేతలు ఎంఎం కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించారు. రామ్ మిరియాల ఆలపించారు. విజయ్ బిన్నీతో పాటు మ్యాగీ కొరియోగ్రఫీ అందించారు. తాజాగా అంజి పాత్రలో నటిస్తున్న 'అల్లరి' నరేష్ ఫస్ట్ లుక్, ఆయన క్యారెక్టర్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.

Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!  

Naa Saami Ranga release on Sankranti 2024: ప్రస్తుతం హైదరాబాద్‌లో 'నా సామి రంగ' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరో వైపు ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.

నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో యువ హీరోలు 'అల్లరి' నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'పలాస' దర్శకుడు కరుణ కుమార్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సాహిత్యం: చంద్రబోస్, సంగీతం: ఎంఎం కీరవాణి, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి. నిర్మాణ సంస్థ: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, దర్శకత్వం: విజయ్ బిన్నీ.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Andhra Pradesh Weather Update: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన- ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన- ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
Embed widget