అన్వేషించండి

‘అన్‌స్టాపబుల్’కు మహేష్, త్రివిక్రమ్, ‘బింబిసార 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

మరోసారి బాలయ్య షోకి గెస్ట్‌గా మహేష్ బాబు - ఈసారి త్రివిక్రమ్ తో కలిసి సందడి!
నందమూరి బాలకృష్ణ హౌస్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ షో' కి సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి గెస్ట్ గా రాబోతున్నట్లు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో తెగ ప్రచారం జరుగుతోంది. మహేష్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ షోలో సందడి చేయబోతున్నట్లు చెబుతున్నారు. డీటెయిల్స్ కి వెళ్తే.. బాలయ్య హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం మూడవ సీజన్ కొనసాగిస్తోంది. అయితే ఈ మూడో సీజన్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే సీజన్ 3లో ‘భగవంత్ కేసరి’ మూవీ టీం, ‘యానిమల్’ మూవీ టీం సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే 'గుంటూరు కారం' మూవీ టీం నుంచి మహేష్ బాబు, త్రివిక్రమ్ 'అన్ స్టాపబుల్ సీజన్ 3'కి గెస్ట్లుగా రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఈ షో కి గెస్ట్ గా రావడం ఇది రెండోసారి. సీజన్ వన్ ఫైనల్ ఎపిసోడ్ కి మహేష్ గెస్ట్ గా వచ్చాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

లోకేష్ కనగరాజ్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ - క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ విషయమై స్వయంగా లోకేష్ కనగరాజ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. వివరాల్లోకి వెళ్తే.. లోకేష్ కనగరాజ్ కి సౌత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖైదీ మూవీతో ఓ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యాడు. ఇక రీసెంట్‌గా 'లియో'తో మరో సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకున్నాడు. తలపతి విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది కోలీవుడ్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 'రానా నాయుడు' - ఏకైక ఇండియన్ సిరీస్‌గా ఆ ఘనత!
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలు పోషించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. నెట్ ఫ్లిక్స్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన ఏకైక ఇండియన్ సిరీస్‌గా 'రానా నాయుడు' నిలిచింది. గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 18,000 టైటిల్స్‌తో కూడిన టాప్ షోల లిస్ట్ ని విడుదల చేశారు. వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిన సిరీస్‌లో ‘రానా నాయుడు’ కూడా ఉంది. ఈ జాబితాలో ఏకైక భారతీయ సిరీస్ ఇదే కావడం విశేషం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బింబిసార 2'పై కళ్యాణ్ రామ్ అదిరిపోయే అప్డేట్ - షూటింగ్ అప్పుడేనట!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైం ట్రావెల్ పీరియాడికల్ డ్రామా 'బింబిసార'(Bimbisara) ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. వశిష్ఠ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. కళ్యాణ్ రామ్(Kalyan Ram) కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. అప్పటివరకు ఎన్నో సంవత్సరాలుగా వరుస అపజయాలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్ కి ‘బింబిసార’ భారీ కం బ్యాక్ ఇచ్చింది. సినిమాలో కళ్యాణ్ రామ్ తన నటనతో అదరగొట్టాడు. 2022లో అత్యధిక కలెక్షన్స్ అందుకోవడంతో పాటూ కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది, మనసులో మాట చెప్పేసిన ‘యానిమల్‘ బ్యూటీ
‘యానిమల్’ సినిమా రిలీజ్ తర్వాత బాలీవుడ్ లో నటి త్రిప్తి దిమ్రి పేరు మార్మోగిపోతోంది. సందీప్‌ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన ఆమె, తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో త్రిప్తి నటన, ఇంటిమేట్ సీన్స్ అందరినీ అలరించాయి. ఈ మూవీతో ఫుల్ క్రేజ్ లభించింది. ప్రస్తుతం త్రిప్తికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తన మనసులో మాట చెప్పేసింది. సౌత్ లో ఏ స్టార్ హీరోతో నటించాలని ఉందని యాంకర్ అడిగిన ప్రశ్నకు, ఏమాత్రం తడబాటు లేకుండా జూనియర్ ఎన్టీఆర్ అని టక్కున చెప్పింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget