Tripti Dimri: ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది, మనసులో మాట చెప్పేసిన ‘యానిమల్‘ బ్యూటీ
Tripti Dimri: ‘యానిమల్‘ నటి త్రిప్తి దిమ్రి ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సౌత్ హీరోలలో యంగ్ టైగర్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పింది. ఆయనతో కలిసి మూవీ చేయాలనుందని వెల్లడించింది.
![Tripti Dimri: ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది, మనసులో మాట చెప్పేసిన ‘యానిమల్‘ బ్యూటీ I Like To Work With Jr NTR In South Says Actress Tripti Dimri Tripti Dimri: ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది, మనసులో మాట చెప్పేసిన ‘యానిమల్‘ బ్యూటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/13/a8df730fca4b515b9a176fb0221fad651702443463238544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tripti Dimri About Jr NTR: ‘యానిమల్’ సినిమా రిలీజ్ తర్వాత బాలీవుడ్ లో నటి త్రిప్తి దిమ్రి పేరు మార్మోగిపోతోంది. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన ఆమె, తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో త్రిప్తి నటన, ఇంటిమేట్ సీన్స్ అందరినీ అలరించాయి. ఈ మూవీతో ఫుల్ క్రేజ్ లభించింది. ప్రస్తుతం త్రిప్తికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తన మనసులో మాట చెప్పేసింది.
ఎన్టీఆర్ తో కలిసి నటించాలనుంది- త్రిప్తి
‘యానిమల్‘ సినిమా తర్వాత త్రిప్తి దిమ్రి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ ఆమెకు ఓ రేంజిలో ఫాలోయింగ్ పెరుగుతోంది. ఈ సినిమా విడుదలకు ముందుకు 6 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 3.6 మిలియన్లకు చేరింది. ఇక 'RRR' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి త్రిప్తి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సౌత్ లో ఏ స్టార్ హీరోతో నటించాలని ఉందని యాంకర్ అడిగిన ప్రశ్నకు, ఏమాత్రం తడబాటు లేకుండా జూనియర్ ఎన్టీఆర్ అని టక్కున చెప్పింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ‘యానిమల్‘ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్రేజీ ప్రాజెక్టులతో ఎన్టీఆర్ బిజీ
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ కూడా అతిధి పాత్రలో నటిస్తున్నారు. 'RRR' లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నది. ఈసారి వీరిద్దరి కాంబోలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా 'దేవర' రాబోతోంది. సినిమాలో యాక్షన్ పార్ట్ ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కి ఆడియెన్స్ ముందుకు రానుంది. అటు బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న‘వార్ 2’ లోనూ ఎన్టీఆర్ నటిస్తున్నారు. YRF స్పై యూనివర్స్ లో 6వ చిత్రంగా ఈ మూవీ రాబోతోంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ కలిసి నటించిన ‘వార్’కు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఇండిపెండెన్స్ డే కానుకగా 2025 ఆగష్టు 14న ఈ మూవీ విడుదల కానుంది.
View this post on Instagram
Read Also: హ్యాపీ బర్త్ డే వెంకటేష్ - వెంకీమామ మన అందరివాడు, ఈ ప్రత్యేకతలు ఆయనకే సొంతం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)