అన్వేషించండి

Unstoppable With NBK : మరోసారి బాలయ్య షోకి గెస్ట్‌గా మహేష్ బాబు - ఈసారి త్రివిక్రమ్ తో కలిసి సందడి!

Unstoppable Show : మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి బాలయ్య అన్ స్టాపబుల్ షో కి హాజరు కానున్నట్లు సమాచారం.

Unstoppable With NBK : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న'అన్ స్టాపబుల్ షో' కి సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి గెస్ట్ గా రాబోతున్నట్లు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో తెగ ప్రచారం జరుగుతోంది. మహేష్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ షోలో సందడి చేయబోతున్నట్లు చెబుతున్నారు. డీటెయిల్స్ కి వెళ్తే.. బాలయ్య హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం మూడవ సీజన్ కొనసాగిస్తోంది. అయితే ఈ మూడో సీజన్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే సీజన్ 3లో ‘భగవంత్ కేసరి’ మూవీ టీం, ‘యానిమల్’ మూవీ టీం సందడి చేసిన విషయం తెలిసిందే.

ఇక త్వరలోనే 'గుంటూరు కారం' మూవీ టీం నుంచి మహేష్ బాబు, త్రివిక్రమ్ 'అన్ స్టాపబుల్ సీజన్ 3'కి గెస్ట్లుగా రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఈ షో కి గెస్ట్ గా రావడం ఇది రెండోసారి. సీజన్ వన్ ఫైనల్ ఎపిసోడ్‌కు మహేష్ గెస్ట్ గా వచ్చాడు. ఆ సమయంలో త్రివిక్రమ్‌ను కూడా ఈ షోకి తీసుకొస్తానని బాలయ్యకు మహేష్ మాట కూడా ఇచ్చారు. అలా బాలయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈసారి త్రివిక్రమ్‌తో కలిసి అన్ స్టాపబుల్ షోకి మహేష్ అటెండ్ అవ్వబోతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు మహేష్, త్రివిక్రమ్ అన్‌‌స్టాప్‌బుల్ ఎపిసోడ్ ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్‌కు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

అందుకే మహేష్ రెండవసారి ఈ షోకు వెళ్లేందుకు అంగీకరించాడని అంటున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ఉండబోతుందట. జనవరి మొదటి వారంలో ఈ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవలే గుంటూరు కారం మ్యూజికల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. అందులో భాగంగా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా సాంగ్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సెకండ్ సింగిల్ 'ఓ మై బేబీ' ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఫుల్ లిరికల్ వీడియోని డిసెంబర్ 13 సాయంత్రం విడుదల చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో ఈ సాంగ్ పై అంచనాలను మరింత పెంచేసింది. కాగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ని ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేష్ - త్రివిక్రక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్ పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా.. PS వినోద్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

Also Read : 'బింబిసార 2'పై కళ్యాణ్ రామ్ అదిరిపోయే అప్డేట్ - షూటింగ్ అప్పుడేనట!

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Embed widget