‘జైలర్’ రివ్యూ, ‘ఓజీ’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
అగ్గి తుఫాన్ వచ్చేస్తోంది, మీరు సిద్ధమేనా? ‘ఓజీ’ నుంచి అదిరిపోయే అప్‌డేట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉన్నా తన స్క్రీన్ ప్రెసెన్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో మెసేజ్‌ను కలిపి ప్రేక్షకులను మెప్పించడం ప్రతీసారి పవన్ కళ్యాణ్‌కే సాధ్యం. ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న సినిమాలు అన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేని జోనర్లలోనే ఉన్నాయి. కానీ వాటిలో అన్నింటికంటే ఎక్కువగా ఫ్యాన్స్ ఎదురుచూస్తుంది మాత్రం ‘OG’ కోసమే. పవన్ గ్యాంగ్‌స్టర్‌గా చాలా స్టైలిష్‌గా ఉంటాడు. కానీ తన కెరీర్‌లో గ్యాంగ్‌స్టర్ పాత్రలు చేసిన సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ‘OG’ వచ్చి చేరనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ఓజీ’ నుంచి పవన్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే అప్డేట్ వచ్చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘కింగ్ ఆఫ్ కోథా’ ట్రైలర్: యజమానిని చూసి తోక ఊపే కుక్కలాంటిది ఈ కోథా - అదరగొట్టేసిన దుల్కర్!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘కింగ్ ఆఫ్ కోథ’. అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఓనమ్ కానుకగా విడుదల చేయనున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అదిరిపోయింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'జైలర్' సినిమా రివ్యూ : రజనీకాంత్ సినిమా హిట్టా? ఫట్టా?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'జైలర్'. తమన్నా పాట 'నువ్ కావాలయ్యా'తో సినిమాకు క్రేజ్ వచ్చింది. ట్రైలర్ కూడా అంచనాలు పెంచింది. మరి, సినిమా ఎలా ఉంది? విజయ్ 'బీస్ట్'తో అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్... ఈ సినిమాను ఎలా తీశారు? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డీజే టిల్లు కొత్త మూవీ షురూ, హీరోయిన్ ఆమేనా?
‘డీజే టిల్లు‘ మూవీతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. 2022లో ఓ చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘డీజే టిల్లు‘ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సిద్దు సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకోవడమే కాదు, సిద్ధుకి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈసారి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ తో డబుల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయింది. ఈ మూవీని సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘డీజే టిల్లు’ మూవీని విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తే, సీక్వెల్ ని మాత్రం మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సిద్ధు హీరోగా మరో సినిమా లాంచ్ అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘జీపీఎస్‌తో భోళా శంకర్’ - సరికొత్త కార్యక్రమానికి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ శ్రీకారం!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఆగస్టు 11వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సినిమా నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘జీపీఎస్‌తో భోళాశంకర్’. ఈ కార్యక్రమం కింద హైదరాబాద్ సిటీలో 600 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)