అన్వేషించండి

GPS Tho Bholaa Shankar: ‘జీపీఎస్‌తో భోళా శంకర్’ - సరికొత్త కార్యక్రమానికి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ శ్రీకారం!

భోళా శంకర్ విడుదల సందర్భంగా ‘జీపీఎస్‌తో భోళా శంకర్’ అనే కార్యక్రమానికి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ శ్రీకారం చుట్టింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ ఆగస్టు 11వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సినిమా నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘జీపీఎస్‌తో భోళాశంకర్’. ఈ కార్యక్రమం కింద హైదరాబాద్ సిటీలో 600 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహిస్తున్నారు.

జీపీఎస్ కనెక్షన్ ద్వారా ఈ ర్యాలీ నడుస్తుంది. అంటే ఈ ర్యాలీ జరిగినంత సేపు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా చూస్తే చిరంజీవి ఫొటో తరహాలో కనిపిస్తుందన్న మాట. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి ఈ ర్యాలీ ప్రారంభం అయింది. ఇప్పటి దాకా మెగాస్టార్ చిరంజీవితో పని చేసిన నటులు, టెక్నీషియన్లు తమ అనుభవాలను వీడియోల ద్వారా పంచుకోవాలని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కోరింది. 

'భోళా శంకర్'లో చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా  నటించారు. చిరంజీవి, తమన్నాల మీద తెరకెక్కించిన 'మిల్కీ బ్యూటీ...' పాటకు మంచి స్పందన వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో మహానటి కీర్తి సురేష్ కనిపించనున్నారు. కీర్తి సురేష్‌కు జంటగా సుశాంత్ నటిస్తున్నారు.

'భోళా శంకర్' ట్రైలర్ కూడా ఇటీవలే విడుదల అయింది. కోల్‌కతాలో చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఆ అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఎవరున్నారు? అనేది మిస్టరీగా మారింది. సాధారణంగా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి పోలీసులు దగ్గరకు వెళ్లడం ఆనవాయితీ. అదే పోలీసులు తమకు సమస్య వస్తే భోళా శంకర్ దగ్గరకు వెళతారు. మరి ఆ సమయంలో భోళా శంకర్ ఏం చేశాడు? అనేది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిది క్యాబ్ డ్రైవర్ రోల్ అని ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇందులో తెలంగాణ యాస మాట్లాడుతూ చిరంజీవి సందడి చేయనున్నారు. 'ఎట్లా ఇచ్చినా?' అని చిరంజీవి అడిగితే... 'అన్నా! మస్త్ ఇచ్చినవ్ అన్నా' అని గెటప్ శ్రీను ఇచ్చిన రెస్పాన్స్ వింటుంటే అభిమానులకు 'శంకర్ దాదా ఎంబిబిఎస్' గుర్తుకు వచ్చింది. 

'భోళా శంకర్'లో హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ ఎదురు చూసే సీన్స్ కూడా కొన్ని ఉన్నాయి. 'ఖుషి' సినిమాలో బాగా ఫేమస్ అయిన 'ఏ మే రాజహా... ఏ మేరీ దునియా' పాటకు చిరంజీవి స్టెప్స్ వేశారు. పవర్ స్టార్ మేనరిజం ఇమిటేట్ చేశారు. ఆ తర్వాత రష్మితో 'తమ్ముడి పాట మస్త్ ఉందిలే' అనడం హైలైట్‌గా నిలిచింది. అలాగే శ్రీముఖితో కలిసి 'ఖుషి'లో నడుము సీన్‌కు సంబంధించిన స్పూఫ్ కూడా చేశారట.

'భోళా శంకర్' సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.  సినిమాలోని నాలుగు పాటలని విడుదల చేశారు. లేటెస్ట్‌గా విడుదల అయిన 'ది రేజ్ ఆఫ్ భోళా' మెగా ర్యాప్ యాంథమ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. 'ది రేజ్ ఆఫ్ భోళా'కు నవాబ్ గ్యాంగ్ ఫేమ్ ఫిరోజ్ ఇజ్రాయెల్‌తో కలిసి సినీ దర్శకుడు మెహర్ రమేష్ సాహిత్యం అందించారు. 'ది రేజ్ ఆఫ్ భోళా' పాటను 'నవాబ్ గ్యాంగ్' ఫేమ్స్ అసుర, ఫిరోజ్ ఇజ్రాయెల్ ఆలపించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget