![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sidhu jonnalagadda: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డీజే టిల్లు కొత్త మూవీ షురూ, హీరోయిన్ ఆమేనా?
సిద్దు జొన్నలగడ్డ హీరోగా కొత్త మూవీ ప్రారంభం అయ్యింది.SVCC బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.
![Sidhu jonnalagadda: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డీజే టిల్లు కొత్త మూవీ షురూ, హీరోయిన్ ఆమేనా? Sidhu jonnalagadda new movie launch SVCC37 Officially pooja ceremony today Sidhu jonnalagadda: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో డీజే టిల్లు కొత్త మూవీ షురూ, హీరోయిన్ ఆమేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/10/398a2ea0173085e2386ebab9b7e2ae731691659506254544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
‘డీజే టిల్లు‘ మూవీతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. 2022లో ఓ చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘డీజే టిల్లు‘ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సిద్దు సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకోవడమే కాదు, సిద్ధుకి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈసారి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ తో డబుల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయింది. ఈ మూవీని సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘డీజే టిల్లు’ మూవీని విమల్ కృష్ణ డైరెక్ట్ చేస్తే, సీక్వెల్ ని మాత్రం మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు కొత్త సినిమా ప్రారంభం
ప్రస్తుతం సిద్ధు హీరోగా మరో సినిమా లాంచ్ అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది. SVCC బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, దర్శకుడు కార్తీక్ దండు ఈ మూవీ ఓపెనింగ్ కు హాజరయ్యారు. ప్రొడ్యూసర్ దిల్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. లవ్ స్టోరీలను అద్భుతంగా తెరకెక్కించడంలో బొమ్మరిల్లు భాస్కర్ తనకు తానేసాటి. రీసెంట్ గా అఖిల్ అక్కినేని తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా తీసి ప్రేక్షకులను అలరించారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్ధు కెరీర్ కు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించే ఈ సినిమా బాగా ఉపయోగపడుతుందని అందరూ భావిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల ను హీరోయిన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
వరుస సినిమాలో సిద్ధు ఫుల్ బిజీ
ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది. ఇప్పటికే టిల్లు చేతిలో రెండు సినిమాలు ఉండగా, ప్రముఖ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. ఇందులో సిద్ధు హీరోగా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది.
View this post on Instagram
Read Also: సరిహద్దుల్లేని అభిమానం - ‘జైలర్’ కోసం చెన్నైకి వచ్చిన జపాన్ దంపతులు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)