అన్వేషించండి

ఆఫీసులకు ‘జైలర్’ హాలిడే, కళ్యాణ్‌రామ్ ‘డెవిల్’ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

కార్పొరేట్ ఆఫీసులకు పాకిన ‘జైలర్’ ఫీవర్ - ఆగస్టు 10న మూకుమ్మడి సెలవులు!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. 2021లో వచ్చిన ‘అన్నాత్తే (తెలుగులో పెద్దన్న)’ తర్వాత రజనీ నటిస్తున్న సినిమా ఇదే. ‘వరుణ్ డాక్టర్’, ‘బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో వచ్చిన ‘కబాలి’ తర్వాత రజనీ సినిమాపై ఇంత హైప్ రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమా విడుదల సందర్భంగా కంపెనీలు సెలవు ప్రకటించడం కూడా ప్రారంభించాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

థియేటర్లలోకి వచ్చేస్తున్న క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’ - విడుదల ఎప్పుడంటే?
ఈమధ్య కాలంలో ప్రేక్షకులు ఎక్కువగా వైవిధ్య‌మైన సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే కొందరు హీరోలు కూడా అలాంటి కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందులో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒకరు. డిఫరెంట్ జోనర్లలో సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయన హీరోగా నటిస్తోన్న అప్‌కమింగ్ చిత్రం ‘డెవిల్’. ఇది ఒక పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కింది. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తోంది. రీసెంట్‌గా విడుద‌లైన ‘డెవిల్’ గ్లింప్స్‌లో కథ గురించి ఏ మాత్రం రివీల్ చేయకుండా హీరోనే మేజర్‌గా చూపించారు. ఈ గ్లింప్స్‌లో హీరో లుక్స్ బాగున్నాయంటూ, ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయంటూ ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో మేకర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

కోలీవుడ్‌లో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మృణాల్ - ఆ స్టార్ హీరో‌తో రొమాన్స్‌కు రెడీ!
తెలుగులో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్న మృణాల్‌కు కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. తమిళ హీరో శివకార్తికేయన్ తరువాతి చిత్రంలో మృణాలే హీరోయిన్ అని తెలుస్తోంది. ఇప్పటికే శివకార్తికేయన్ చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉండగా.. ఇవన్నీ పూర్తయిన తర్వాత స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌తో ఈ హీరో చేతులు కలపనున్నాడు. ఇందులో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేయడానికి మృణాల్‌ను ఎంపిక చేశారు మేకర్స్. ఇప్పటికే దానికి కావాల్సిన లుక్ టెస్ట్ కూడా పూర్తయ్యిందట. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఖరారు అయ్యాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం కాబట్టి.. కచ్చితంగా ఈ మూవీ భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి శివకార్తికేయన్ లాంటి హీరో, మురుగదాస్ లాంటి దర్శకుడితో కలిసి నటించే అవకాశాన్ని మృణాల్ తన మొదటి చిత్రంతోనే కొట్టేసిందని ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా - అబ్బాయి పేరేంటో తెలుసా? ఫోటో చూశారా?
గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్ తల్లి అయ్యారు. ఆమె గర్భవతి అనే సంగతి ప్రేక్షకులు అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా గర్భం (బేబీ బంప్) ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాను ప్రెగ్నెంట్ అని ఆవిడ సగర్వంగా ఎప్పుడో ప్రకటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆవిడ తల్లి అయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

చిరంజీవిని కొట్టడానికి వెళ్లిన తమన్నా - మ్యాటర్ లీక్ చేసిన ప్రొడ్యూసర్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని కొట్టడానికి తమన్నా భాటియా (Tamannaah Bhatia) వెళ్లారు. అదీ ఆవేశంగా, చిత్రీకరణలో అందరూ ఉండగా! చిరంజీవి అంటే అందరికీ గౌరవం. తమన్నాకు కూడా! ఆ విషయాన్ని రెండు మూడు సందర్భాల్లో చెప్పారు కూడా! సెట్‌లో చిరు ఎంటర్ అయితే అందరూ సైలెంట్ అవుతారు. మరి, చిరును తమన్నా కొట్టడం ఏంటి? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget