అన్వేషించండి

Devil Movie: థియేటర్లలోకి వచ్చేస్తున్న క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’ - విడుదల ఎప్పుడంటే?

క‌ళ్యాణ్ రామ్‌ హీరోగా నటిస్తోన్న అప్‌కమింగ్ చిత్రం ‘డెవిల్’. ఇది ఒక పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కింది. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తోంది.

ఈమధ్య కాలంలో ప్రేక్షకులు ఎక్కువగా వైవిధ్య‌మైన సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే కొందరు హీరోలు కూడా అలాంటి కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అందులో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒకరు. డిఫరెంట్ జోనర్లలో సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయన హీరోగా నటిస్తోన్న అప్‌కమింగ్ చిత్రం ‘డెవిల్’. ఇది ఒక పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కింది. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తోంది. రీసెంట్‌గా విడుద‌లైన ‘డెవిల్’ గ్లింప్స్‌లో కథ గురించి ఏ మాత్రం రివీల్ చేయకుండా హీరోనే మేజర్‌గా చూపించారు. ఈ గ్లింప్స్‌లో హీరో లుక్స్ బాగున్నాయంటూ, ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయంటూ ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో మేకర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

అంచనాలు పెంచేసిన గ్లింప్స్..
‘డెవిల్’ గ్లింప్స్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని అప్పుడే ఎదురుచూపులు మొదలయ్యాయి. దీంతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడం కోసం మూవీ టీమ్.. రిలీజ్ డేట్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. న‌వంబ‌ర్ 24న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కనిపించనున్నారు.

‘డెవిల్’ కేవలం తెలుగులో మాత్రమే కాదు.. మరెన్నో ఇతర భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. అందులో హిందీ కూడా ఒకటి. ఇటీవల ఈ మూవీ హిందీ వెర్ష‌న్‌ గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. దీనిని మెచ్చిన బాలీవుడ్ ప్రేక్షకులు సోషల్ మీడియాలో గ్లింప్స్‌ను వైరల్ చేస్తున్నారు. ‘డెవిల్’లో కళ్యాణ్ రామ్‌కు జంటగా సంయుక్తా మీన‌న్ నటించింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బింబిసార’ వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇక ‘డెవిల్’ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. 

‘డెవిల్’ క్యాస్ట్ అండ్ క్రూ ఎవరంటే..
అభిషేక్ పిక్చ‌ర్స్‌ బ్యానర్‌పై ‘డెవిల్’ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. దేవాన్ష్ నామా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నిర్మాణంతో పాటు దర్శకత్వం పర్యవేక్షణ బాధ్యతను కూడా అభిషేక్ పిక్చర్సే తీసుకుంది. నవీన్ మేడారం.. ‘డెవిల్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. సౌందర్ రాజన్ ఎస్.. కెమెరా పనులను హ్యండిల్ చేయనున్నారు. క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌ల బాధ్యతను  శ్రీకాంత్ విస్సా తీసుకున్నారు. ఇక ‘డెవిల్’ చిత్రానికి ఎడిటర్ తమ్మిరాజు కాగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్‌ను అందించాడు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘బింబిసార’. ఆ సినిమా లాగానే ‘డెవిల్’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘అమిగోస్’ కూడా పర్వాలేదనిపించినా.. కళ్యాణ్ రామ్‌కు ‘బింబిసార’ ఇచ్చిన హిట్ మాత్రం ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. ఆ లిస్ట్‌లోకి ‘డెవిల్’ కూడా చేరాలని అనుకుంటున్నారు.

Also Read: ఇంత ప్రేమ? తెలుగు ప్రేక్షకుల వీరాభిమానంపై స్పందించిన సూర్య

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
Jailer 2 Live Updates: 'జైలర్ 2' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ఫస్ట్ షో షురూ... రజనీకాంత్ సినిమాలో సీన్ టు సీన్ తెలుసుకోండి
'జైలర్ 2' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ఫస్ట్ షో షురూ... రజనీకాంత్ సినిమాలో సీన్ టు సీన్ తెలుసుకోండి
The Odyssey OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ - 15 వేల కోట్ల మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ - 15 వేల కోట్ల మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Jailer 2 OTT : ఆ ఓటీటీలోకి జైలర్ 2 - రజనీ కాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి జైలర్ 2 - రజనీ కాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
Andhra Style Tomato Pappu : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Embed widget