అన్వేషించండి

ఇన్‌స్టాగ్రామ్‌లోకి నయనతార ఎంట్రీ, ‘జవాన్’ ట్రైలర్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

ఆలియా భట్ కావాలి, పాట పాడాలి - యాక్షన్ & కామెడీతో ఇరగదీసిన షారుఖ్ ఖాన్ 'జవాన్' ట్రైలర్ 
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'జవాన్'. సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. ఆర్య హీరోగా 'రాజా రాణి', తమిళ స్టార్ విజయ్ హీరోగా 'పోలీస్' (తమిళంలో 'తెరి'), 'విజిల్' (తమిళంలో 'బిగిల్'), 'అదిరింది' (తమిళంలో 'మెర్సల్')... అట్లీ తీసిన సినిమాలు కమర్షియల్ విజయాలు సాధించాయి. దాంతో 'జవాన్' మీద హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు 'జవాన్' ట్రైలర్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె హీరోగా 'మ్యాడ్', టీజర్ చూశారా? ట్యూబ్ లైట్ అక్కడ పెట్టేసుకోవాలట!
తెలుగు సినిమా పరిశ్రమలో యూత్ ను ఆకట్టుకునే చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పటి వరకు కాలేజీ బ్యాగ్రాఫ్ లో వచ్చిన సినిమాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. యూత్ లో ఓ రేంజ్ క్రేజ్ దక్కించుకున్నాయి. కాస్త ఆకట్టుకునే కంటెంట్ ఉన్న సినిమాలు ఓ రేంజిలో వసూళ్లు సాధించాయి. ఇప్పటికే యూత్ ఫుల్ స్టోరీతో వచ్చిన ‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారు లోకం’, ‘సై’ సహా పలు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ మధ్య కాలంలో యూత్ ను బాగా ఆకట్టుకునే సినిమాలు పెద్దగా రాలేదనే చెప్పుకోవచ్చు. తాజాగా కాలేజీ కథాంశంతో ఓ సినిమా రూపొందుతోంది. అదే ‘మ్యాడ్’ మూవీ. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇన్‌స్టాగ్రామ్‌లోకి లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ, కొడుకులతో కలిసి స్టైలిష్ వీడియో - ఫస్ట్ పోస్ట్ అదుర్స్!
నయనతార గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. భిన్నమైన సినిమాల్లో నటిస్తూ.. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘జవాన్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టింది. తన ఇద్దరు కొడుకులతో కలిసి ఉన్న స్టైలిష్ వీడియోను ఆమె షేర్ చేసింది. హీరోయిన్ గా లక్షలాది మంది అభిమానులు ఉన్నా, ఆమె ఇప్పటి వరకు ఇన్ స్టాలో అకౌంట్ ఓపెన్ చేయలేదు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నిభర్త విఘ్నేష్ శివన్ ఇన్ స్టా అకౌంట్ ద్వారానే షేర్ చేస్తుంది. అయితే, తాజాగా ఆమె ఇన్ స్టాలో అకౌంట్ ఓపెన్ చేసి, తొలి వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'స్కంద' రిలీజ్‌కు ముందు సెంచరీ కొట్టిన రామ్ - రేర్ రికార్డ్ బాసూ!
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా కమర్షియల్ హంగులు, కుటుంబ అనుబంధాలు మేళవించి సినిమాలు తీసే దర్శకుడు బోయపాటి శ్రీను తీసిన సినిమా 'స్కంద'. విడుదలకు ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది. అయితే, అప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిర్మాతకు దాదాపుగా వంద కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 'స్కంద' బడ్జెట్ ఎంత? ప్రస్తుతానికి నిర్మాత శ్రీనివాసా చిట్టూరి బయటకు ఏమీ చెప్పలేదు. అయితే, వంద కోట్లకు అటు ఇటుగా ఉండవచ్చని అంచనా. ట్రైలర్ చూస్తే ఖర్చు గట్టిగా చేశారని అర్థం అవుతోంది. అందుకు తగ్గట్టుగా రాబడి కూడా ఉంటోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 98 కోట్లు వచ్చాయని తెలిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

470 కేజీల వెండితో చిత్రరూపం, పవన్ కల్యాణ్ కు అభిమాని అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలనే కాదు, రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఆయన బర్త్ డే వచ్చిందంటే అభిమానులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఓ పండగలా జరుపుకుంటారు. సేవా కార్యక్రమాల నుంచి సెలబ్రేషన్స్ వరకు దుమ్మురేపుతారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Diesel Vehicle Ban News:హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం
హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం 
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Mokshagna Debut Movie: మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
Blood Pressure by Age : వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Diesel Vehicle Ban News:హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం
హైదరాబాద్‌లో డీజిల్‌ వాహనాలు బంద్‌- సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ప్రభుత్వం - ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పథకం 
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Mokshagna Debut Movie: మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
మోక్షజ్ఞ మొదటి సినిమా ఓపెనింగ్ ఎందుకు ఆగిందో చెప్పిన బాలకృష్ణ
Blood Pressure by Age : వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్‌కు బెయిల్- ట్యాంక్‌బండ్‌ ధర్నాకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు
పోలీసులను దూషించిన కేసులో కౌశిక్‌కు బెయిల్- ట్యాంక్‌బండ్‌ ధర్నాకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు
Puspha Collections: పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
Harish Rao: ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
Embed widget