News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Pawan Kalyan: 470 కేజీల వెండితో చిత్రరూపం, పవన్ కల్యాణ్ కు అభిమాని అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమాని అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. 470 కేజీల వెండితో ఆయన చిత్రరూపాన్ని తయారు చేశారు. ఈ వీడియోను తాజాగా జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.

FOLLOW US: 
Share:

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలనే కాదు, రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఆయన బర్త్ డే వచ్చిందంటే అభిమానులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఓ పండగలా జరుపుకుంటారు. సేవా కార్యక్రమాల నుంచి సెలబ్రేషన్స్ వరకు దుమ్మురేపుతారు.

470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపం

ఇక పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడంతో అభిమానులు పార్టీ కార్యకర్తల్లా మారిపోయారు. పవన్ ఫ్యాన్స్ అంతా జన సైనికులుగా మారిపోయారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డే జరగనుంది. ఈ నేపథ్యంలో బర్త్ డే వేడుకలను పెద్ద ఎత్తున జరిపేందుకు రెడీ అవుతున్నారు. ఏపీతో పాటు తెలంగాణలో పవన్ బర్త్ డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించబోతున్నారు ఆయన అభిమానులు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ కు అదిరిపోయే గిఫ్ట్ అందించారు ఆయన అభిమానులు కొందరు. ఏకంగా ఏకంగా 470 కేజీల వెండి గొలుసులతో పవన్‌ కల్యాణ్ చిత్ర పటాన్ని రూపొందించారు. ఈ వీడియోను తాజాగా జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, పార్టీ నేతలు శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు, శ్రీ సుందర రామిరెడ్డి పాల్గొన్నారు.

జనసేన పార్టీ నెల్లూరు టౌన్‌ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌ బాబు ఆధ్వర్యంలో ఈ అద్భుత చిత్ర పటాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన తయారీ వీడియోను జనసేన పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ రిలీజ్‌ చేశారు. 15 గంటలు కష్టపడి తొలుత పవన్‌ కళ్యాణ్ చిత్రాన్ని గీశారు. ఆ లైన్స్‌ ను వెండి గొలుసులతో నింపారు. ఈ ఫొటోను గొలుసులతో ముస్తాబు చేసేందుకు 470 కేజీల వెండిని వాడినట్టు జనసైనికులు వెల్లడించారు.  ఈ వీడియోను చూసి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

బర్త్ డే సందర్భంగా కీలక అప్ డేట్స్

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఆయన ఒప్పుకున్న సినిమాలను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడంతో,  నిర్మాతలు ఆయన సినిమాలకు సంబంధించి కీలక అప్ డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. సుజిత్ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’ సినిమా నుంచి టీజర్‌తో పాటు పోస్టర్‌ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ‘హరిహర వీరమల్లు’ నుంచి పోస్టర్, ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ నుంచి గ్లింప్స్ విడుదలకానున్నట్లు తెలుస్తోంది.   

Read Also: ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె హీరోగా 'మ్యాడ్', టీజర్ చూశారా? ట్యూబ్ లైట్ అక్కడ పెట్టేసుకోవాలట!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 31 Aug 2023 04:12 PM (IST) Tags: Pawan Kalyan Pawan Kalyan Birthday Pawan Kalyan Picture Pawan Kalyan Silver Picture

ఇవి కూడా చూడండి

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ

త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ

Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం

Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'