అన్వేషించండి

MAD Official Teaser: ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె హీరోగా 'మ్యాడ్', టీజర్ చూశారా? ట్యూబ్ లైట్ అక్కడ పెట్టేసుకోవాలట!

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యాడ్’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ టీజర్ ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.

తెలుగు సినిమా పరిశ్రమలో యూత్ ను ఆకట్టుకునే చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పటి వరకు కాలేజీ బ్యాగ్రాఫ్ లో వచ్చిన సినిమాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. యూత్ లో ఓ రేంజ్ క్రేజ్ దక్కించుకున్నాయి. కాస్త ఆకట్టుకునే కంటెంట్ ఉన్న సినిమాలు ఓ రేంజిలో వసూళ్లు సాధించాయి. ఇప్పటికే యూత్ ఫుల్ స్టోరీతో వచ్చిన ‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారు లోకం’, ‘సై’ సహా పలు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ మధ్య కాలంలో యూత్ ను బాగా ఆకట్టుకునే సినిమాలు పెద్దగా రాలేదనే చెప్పుకోవచ్చు. తాజాగా కాలేజీ కథాంశంతో ఓ సినిమా రూపొందుతోంది. అదే ‘మ్యాడ్’ మూవీ. 

ఫుల్ ఫన్ తో ఆకట్టుకుంటున్న ‘మ్యాడ్’ టీజ‌ర్

కళ్యాణ్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నార్నె నితిన్, రామ్‌ నితిన్‌, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్‌ శోభన్‌, గౌరీ ప్రియా రెడ్డి  ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సితారా, ఫ్యార్చూన్‌ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది. ఈ కథ మొత్తం  కాలేజ్‌ చుట్టూనే తిరుగుతుంది. కాలేజీలో గ్యాంగులు, సీనియర్ల ర్యాగింగ్, ప్రేమలు, కొట్లాటలు అన్నింటినీ ఇందులో చూపించారు. సుమారు నిమిషమున్నర ఉన్న ఈ మూవీ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ తో నిండిపోయింది. ఇందులో యువకులు చేసే అల్లరి మామూలుగా లేదు. ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో ముగ్గురు యువకుల కథను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ టీజర్ కుర్రాళ్ల కొట్లాటతో మొదలవుతుంది. మా కాలేజీలో స్పోర్ట్స్ క్ల‌బ్‌, డ్రామా క్ల‌బ్‌, ఎన్‌సీసీ అన్నీ ఉన్నాయి. లేనిది ర్యాంగింగ్ మాత్ర‌మే అనే వాయిస్ వినిపించిన వెంటనే సీనియ‌ర్స్‌, జూనియ‌ర్స్‌ ను ర్యాగింగ్ చేస్తూ కనిపిస్తారు. లవ్, రొమాన్స్, ఎంటర్ టైన్మెంట్ కలిసిన ఈ టీజ‌ర్ సినిమాపై అంచనాలను పెంచింది. చాలా రోజుల తర్వాత కాలేజీ బ్యాగ్రాఫ్ లో సినిమా అలరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్యూబ్‌లైట్‌తో ర్యాంగింగ్ సీన్ తప్పకుండా యూత్‌కు కనెక్ట్ అవుతుంది.

స్పెషల్ రోల్ చేయబోతున్న ‘జాతిరత్నాలు’ అనుదీప్!  

ఇక ఈ మూవీ టీజర్ అప్పుడే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డైలాగులతో రీల్స్ మొదలయ్యాయి. ఇక ఈ టీజర్ లో ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఉండటం విశేషం. ఈ టీజర్ లో ‘జాతిరత్నాలు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ కేవీ అనుదీప్ కూడా కనిపిస్తారు. అనుదీప్ కామెడీ టైమింగ్ ఓ రేంజిలో అలరిస్తుంది. ఇక ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్ ఉందంటే, నవ్వుల పువ్వులు పూయాల్సిందే. మొత్తంగా ఈ సినిమా యూత్ ను ఓ రేంజిలో ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది.  మరోసారి వెండితెరపై కాలేజీ బ్యాగ్రాఫ్ సినిమా దుమ్మురేపుతుందంటున్నారు నెటిజన్లు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ వెల్లడించనున్నారు.   

Read Also: షారుఖ్‌తో ప్రేమలో ఉన్న అమ్మాయిపై పగ తీర్చుకున్నా- విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Ghanta Mounica: గోదావరి సీరియల్ అలకనంద.. సోషల్ మీడియా టు సీరియల్స్..
గోదావరి సీరియల్ అలకనంద.. సోషల్ మీడియా టు సీరియల్స్..
Gundenininda Gudigantalu Serial Today June 04: రోహిణి గురించి బాలుకి నిజం చెప్పేసిన విద్య, పార్లలమ్మను పచ్చడి చేసిన మీనా - గుండెనిండా గుడిగంటలు జూన్ 04 ఎపిసోడ్
రోహిణి గురించి బాలుకి నిజం చెప్పేసిన విద్య, పార్లలమ్మను పచ్చడి చేసిన మీనా - గుండెనిండా గుడిగంటలు జూన్ 04 ఎపిసోడ్
Peddi Review - పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?
పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?
Lakshimi Raave Maa Intiki Serial Today June3rd: సింధూను కాపాడేందుకు తాను నపుంసకుడినని అందరికీ చెప్పిన గోపీ..ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన సింధూజాక్షి
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: సింధూను కాపాడేందుకు తాను నపుంసకుడినని అందరికీ చెప్పిన గోపీ..ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన సింధూజాక్షి

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
Suryakumar Yadav News: సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట.. 
సూర్యకుమార్  కెప్టెన్సీపై బీసీసీఐ వేటు?: వరల్డ్ కప్ గెలిపించినా తప్పని తిప్పలు.. కొత్త లీడర్ కోసం వెతుకులాట..
Peddi Review - పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?
పెద్ది రివ్యూ: రామ్ చరణ్ సినిమా హిట్టా? ఫట్టా? క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఏమిటంటే?
CSK Auction Strategy And Decisions: ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
ఆ ఇద్దరి వల్లే సీఎస్కే కొంప మునిగిందా?: ధోనీ లేని లోటు స్పష్టంగా తెలిసింది.తప్పులను ఎండగట్టిన మాజీ ప్లేయర్
30 సెకెన్ల వీడియో 24 గంటల స్టేటస్..భార్య భర్త బంధం ఇంతేనా? అర్థనారీశ్వర తత్వం ఇదేనా నేర్పించింది!
30 సెకెన్ల వీడియో 24 గంటల స్టేటస్..భార్య భర్త బంధం ఇంతేనా? అర్థనారీశ్వర తత్వం ఇదేనా నేర్పించింది!
First Flex Fuel Motorcycles: హీరో నుంచి మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు లాంచ్: స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ వెర్షన్లు రెడీ.. గడ్కరీ చేతుల మీదుగా ఆవిష్కరణ
హీరో నుంచి మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు లాంచ్: స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ వెర్షన్లు రెడీ.. గడ్కరీ చేతుల మీదుగా ఆవిష్కరణ
Ghanta Mounica: గోదావరి సీరియల్ అలకనంద.. సోషల్ మీడియా టు సీరియల్స్..
గోదావరి సీరియల్ అలకనంద.. సోషల్ మీడియా టు సీరియల్స్..
Brazil Nuts for Thyroid Health : థైరాయిడ్ ఉన్నవాళ్లు బ్రెజిల్ నట్స్ ఎందుకు తినాలి? రోజుకి ఎంత తింటే మంచిది?
థైరాయిడ్ ఉన్నవాళ్లు బ్రెజిల్ నట్స్ ఎందుకు తినాలి? రోజుకి ఎంత తింటే మంచిది?
Embed widget