Jawan Trailer : ఆలియా భట్ కావాలి, పాట పాడాలి - యాక్షన్ & కామెడీతో ఇరగదీసిన షారుఖ్ ఖాన్ 'జవాన్' ట్రైలర్
Jawan Trailer Review Telugu : షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన 'జవాన్' ట్రైలర్ విడుదలైంది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కథానాయకుడిగా నటించిన చిత్రం 'జవాన్' (Jawan Movie). సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు.
ఆర్య హీరోగా 'రాజా రాణి', తమిళ స్టార్ విజయ్ హీరోగా 'పోలీస్' (తమిళంలో 'తెరి'), 'విజిల్' (తమిళంలో 'బిగిల్'), 'అదిరింది' (తమిళంలో 'మెర్సల్')... అట్లీ తీసిన సినిమాలు కమర్షియల్ విజయాలు సాధించాయి. దాంతో 'జవాన్' మీద హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు 'జవాన్' ట్రైలర్ విడుదల చేశారు.
'జవాన్' ట్రైలర్ ఎలా ఉందంటే?
Jawan trailer review Telugu : కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీస్ తీస్తారని దర్శకుడు అట్లీకి పేరు ఉంది. ఇప్పుడీ 'జవాన్' ట్రైలర్ చూస్తుంటే... మరోసారి అటువంటి సినిమా తీసినట్లు అర్థం అవుతోంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ... షారుఖ్ ఖాన్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలు అన్నీ 'జవాన్'లో ఉన్నట్లు అనిపిస్తోంది.
'నీకు ఎవరు కావాలి' అని ప్రభుత్వ అధికారుల నుంచి ప్రశ్న ఎదురైతే... 'ఆలియా భట్ కావాలి' అని షారుఖ్ ఖాన్ సమాధానం ఇవ్వడంలో సెటైర్ ఉంది. కామెడీ కూడా! ట్రైలర్ చివర్లో నయనతార 'ఇంకేం కావాలి?' అని అడిగితే... 'ఓ పాట పాడు' అని షారుఖ్ అడగటం సరదాగా ఉంది.
క్లారిటీగా కథ చెప్పిన 'జవాన్' ట్రైలర్!
'జవాన్' ట్రైలర్ ద్వారా కథ ఏమిటి? అనేది దర్శకుడు అట్లీ క్లారిటీగా చెప్పేశారు. ఆ విషయంలో ఎటువంటి దాపరికాలు లేవు. షారుఖ్ ఖాన్ టైటిల్ రోల్ చేస్తున్నారని ఎప్పుడో అర్థమైంది. ఓ జవాన్ ఎందుకు ట్రైన్ హైజాక్ చేశారు? ట్రైన్ హైజాక్ తర్వాత ఏమైంది? అనేది వెండితెరపై చూడాలి.
విజయ్ సేతుపతి ఆర్మ్ డీలర్ (ఆయుధాలు సరఫరా చేసే వ్యక్తి)గా నటించారు. తన స్వార్థం కోసం సంఘ విద్రోహ శక్తులకు, దేశ ప్రత్యర్థులకు ఆయన ఆయుధాలు విక్రయించడం వల్ల ఎటువంటి నష్టం సంభవించింది? అతడిని పట్టుకోవడం కోసం షారుఖ్ ఏం చేశారు? అనేది కథ అనేది అర్థం అవుతోంది. నయనతార పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. దీపికా పదుకోన్ పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందేమో చూడాలి.
డ్యూయల్ రోల్ చేస్తున్న షారుఖ్!
'నా కొడుకు మీద చెయ్యి వేసే ముందు... వాడి బాబు మీద చెయ్యి వేయాలి' - ఇదీ 'జవాన్' ట్రైలర్ చివరలో షారుఖ్ ఖాన్ చెప్పే డైలాగ్! ఈ ఒక్క మాటతో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారని క్లారిటీ వచ్చింది. తండ్రీ కుమారులుగా షారుఖ్ చేసే యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో ట్రైలర్ చూస్తే ఓ అంచనాకు రావచ్చు. లుక్స్ పరంగా షారుఖ్ వేరియేషన్ చూపించారు. తండ్రి పాత్ర కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ మైంటైన్ చేశారు. జవాన్ లుక్, గుండు లుక్... డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించారు. విజయ్ సేతుపతి సైతం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో సందడి చేశారు.
Also Read : 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా
'జవాన్'తో నయనతార హిందీ ఎంట్రీ!
సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 'జవాన్' సినిమా విడుదల కానుంది. దీని స్పెషాలిటీ ఏమిటంటే.... సౌత్ క్వీన్ నయనతారకు ఇది తొలి హిందీ సినిమా. నయన్ కాకుండా ఈ సినిమాలో ప్రియమణి కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాను షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ పతాకంపై ఆయన సతీమణి గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : నితిన్ జోడీగా 'కాంతార' కథానాయిక సప్తమి, కీలక పాత్రలో లయ కూడా - ఏ సినిమాలోనో తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial