Vijay Devarakonda : 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా - మైత్రిలో పక్కా!
విజయ్ దేవరకొండతో మైత్రి మూవీ మేకర్స్ రెండు సినిమాలు నిర్మించింది. ఇప్పుడు మూడో సినిమాను, అదీ 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో చేయడానికి ప్లాన్ చేస్తోంది.
'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను స్టార్ చేసిన సినిమా 'అర్జున్ రెడ్డి' (Arjun Reddy). దాని కంటే ముందు 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా ఆయన హిట్ అందుకున్నారు. అంతకు ముందు 'ఎవడే సుబ్రమణ్యం'తో నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే... 'అర్జున్ రెడ్డి' మాత్రం వేరే లెవల్. ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ ఎక్కడికో వెళ్లిపోయారు. సౌత్ మాత్రమే కాదు... నార్త్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
'అర్జున్ రెడ్డి' చిత్రానికి సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా కూడా అదే. మరోసారి ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేయడానికి సన్నాహాలు బలంగా జరుగుతున్నాయి.
'అర్జున్ రెడ్డి' కాంబోలో మైత్రి సినిమా!
'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తోంది. ఆ విషయాన్ని మైత్రి అధినేతలలో ఒకరైన రవిశంకర్ యలమంచిలి తెలిపారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ 'డియర్ కామ్రేడ్' నిర్మించింది. సెప్టెంబర్ 1న విడుదల కానున్న 'ఖుషి' చిత్రాన్ని సైతం ఆ సంస్థే నిర్మించింది. మరో సినిమా నిర్మించడానికి కూడా రెడీ అవుతోంది.
'డియర్ కామ్రేడ్', 'ఖుషి'... రెండూ ప్రేమకథలు, ఫ్యామిలీ జానర్ సినిమాలు అని, మూడో సినిమా చేయాలంటే ఎటువంటి సినిమా చేస్తారు? అని రవిశంకర్ యలమంచిలిని ప్రశ్నించగా... ''తప్పకుండా అది షాకింగ్ సినిమా కావాలి. సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కాంబోలో సినిమా చేయాలని మేం సిన్సియర్ గా ట్రై చేస్తున్నాం. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో తెలుసుగా! వీళ్ళిద్దరూ కలిస్తే సాఫ్ట్ జానర్ చేయరు కదా! వాళ్ళ జానర్ సినిమా చూడాలని ఉంది'' అని చెప్పారు. అదీ సంగతి!
Also Read : 'ఖుషి' ప్రీ రిలీజ్ డీటెయిల్స్ - విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఎంత?
ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా 'యానిమల్' సినిమా చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమా తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా పాన్ ఇండియా సినిమా 'స్పిరిట్' చేయడానికి అంగీకరించారు. ఆ రెండు సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ సినిమా ఉంటుంది... అన్నీ కుదిరితే!
'అర్జున్ రెడ్డి'ని హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా... అక్కడ కూడా భారీ విజయం సొంతం చేసుకున్నారు. తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండకు నార్త్ ఇండియా ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ కలిస్తే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంటుంది. అందులో మరో సందేహం అవసరం లేదు.
'ఖుషి' తర్వాత విజయ్ దేవరకొండ రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. 'మళ్ళీ రావా', 'జెర్సీ' సినిమాల ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ చేస్తున్నారు. 'గీత గోవిందం' తర్వాత పరశురామ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఆ రెండిటి తర్వాత సందీప్ రెడ్డి వంగా సినిమా ఉంటుందా? వెయిట్ అండ్ సి.
Also Read : బాలయ్య వస్తే తీన్మార్ కాదు, సౌమార్ కొట్టాల్సిందే - 'భగవంత్ కేసరి' ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial