News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bhagavanth Kesari Song : బాలయ్య వస్తే తీన్మార్ కాదు, సౌమార్ కొట్టాల్సిందే - 'భగవంత్ కేసరి' ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?

Ganesh Anthem Promo : నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'భగవంత్ కేసరి'లో మొదటి పాట 'గణేష్ యాంథమ్' ప్రోమోను విడుదల చేయనున్నారు.

FOLLOW US: 
Share:

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న విడుదల అవుతోంది. ఈ సినిమాలో మొదటి పాట 'గణేష్ యాంథమ్' ప్రోమోను ఈ రోజు విడుదల చేశారు. 

తీన్మార్ కాదు... సౌమార్ కొట్టు!
వినాయక చవితి పండగ నేపథ్యంలో 'భగవంత్ కేసరి'లో మొదటి పాట 'గణేష్ యాంథమ్'ను తెరకెక్కించారు. ఆల్రెడీ విడుదలైన సినిమా ప్రచార చిత్రాలు చూస్తే... బాలకృష్ణ తెలంగాణ యాస మాట్లాడుతూ కనిపించారు. ఇప్పుడీ పాటను కూడా తెలంగాణ నేపథ్యంలో జరిగే గణేష్ ఉత్సవాల తరహాలో తెరకెక్కించారు. 

'జై బోలో గణేష్ మహారాజ్ కి' అంటూ సాంగ్ మొదలైంది. ఆ తర్వాత పిల్లల మధ్యలో స్టెప్పులు వేస్తున్న శ్రీ లీలను చూపించారు.  తర్వాత బాలకృష్ణను చూపించారు. పసుపు రంగు షర్టు, కళ్ళజోడుతో ఆయన ఎంట్రీ అదిరింది. 

తీన్మార్ కొడుతుంటే 'బిడ్డా! ఆనతలేదు. సప్పుడు జర గట్టిగా చేయమను' అని బాలకృష్ణ అడగడం... అప్పుడు శ్రీ లీల 'అరే తీసి పక్కన పెట్టండ్రా మీ తీన్మార్! మా చిచ్చా వచ్చిండు! ఎట్లా ఉండాలే! కొట్టరా కొట్టు... సౌమార్' అనడం బావుంది. పాట మీద అంచనాలు మరింత పెంచింది.  లిరికల్ వీడియో శుక్రవారం (అనగా... సెప్టెంబర్ 1న) ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

Also Read : 'ఖుషి' ప్రీ రిలీజ్ డీటెయిల్స్ - విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఎంత?

వినాయక చవితి సందర్భంగా అన్ని మండపాలలో 'భగవంత్ కేసరి' సినిమాలో గణేష్ యాంథమ్ వినబడుతుందని, అంత మంచి బాణీ తమన్ అందించారని చిత్ర బృందం పేర్కొంది.   
 
'భగవంత్ కేసరి' చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ సందడి చేయనున్నారు. యువ కథానాయిక శ్రీ లీల ప్రధాన పాత్రధారి. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు ఆయనది సోదరుడి పాత్ర అని టాక్. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ చేశారు.

Also Read టార్గెట్ పాన్ ఇండియా - సెప్టెంబర్‌ బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమాలే టాప్!

'భగవంత్ కేసరి' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే? 
Bhagavanth Kesari Andhra Pradesh Telangana Rights : 'భగవంత్ కేసరి' నైజాం థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను 14 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సీడెడ్ (రాయలసీమ) హక్కులు రూ. 12 కోట్లు పలకగా... ఆంధ్ర ఏరియా హక్కులను సుమారు 34 కోట్ల రూపాయలకు ఇచ్చారట.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్టాల హక్కులను రూ. 60 కోట్లకు అమ్మేశారు. 'వీర సింహా రెడ్డి'తో సంక్రాంతికి బాలకృష్ణ భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 63 కోట్లు. దాంతో పోలిస్తే... 'భగవంత్ కేసరి'కి జస్ట్ మూడు కోట్లు మాత్రమే తక్కువ. ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ కూడా కలిపితే 70 కోట్లు దాటుతుంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 30 Aug 2023 05:15 PM (IST) Tags: Balakrishna Sreeleela Bhagavanth Kesari Movie Ganesh Anthem Promo Balakrishna Sreeleela Dance Bhagavanth Kesari First Song

ఇవి కూడా చూడండి

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Antony: మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

Vijay Antony:  మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

టాప్ స్టోరీస్

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?