Nithin Sapthami Gowda : నితిన్ జోడీగా 'కాంతార' కథానాయిక సప్తమి, కీలక పాత్రలో లయ కూడా - ఏ సినిమాలోనో తెలుసా?
Nithin Thammudu Heroine : పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన 'తమ్ముడు' టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో కన్నడ కథానాయికను ఫైనలైజ్ చేశారని సమాచారం.
Sapthami Gowda Telugu Debut : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమానులలో యువ హీరో నితిన్ (Nithin) ఒకరు. గతంలో 'తొలి ప్రేమ'లో 'ఏమైందో ఈ వేళ' పాటను రీమిక్స్ చేశారు. ఇప్పుడు పవన్ హిట్ సినిమాల్లో ఒకటైన 'తమ్ముడు' టైటిల్ (Thammudu New Movie)తో నితిన్ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఆ సినిమా మొదలైంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆ సినిమాలో కథానాయికగా కన్నడ భామను ఖరారు చేశారట!
నితిన్ జోడీగా 'కాంతార' సప్తమి గౌడ!
Sapthami Gowda to pair up with Nithin In Thammudu Movie : 'తమ్ముడు'లో నితిన్ సరసన సప్తమి గౌడ నటించనున్నారని తెలిసింది. 'కాంతార'తో ఆమె పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత హిందీ సినిమా 'వ్యాక్సిన్ వార్' చేశారు. తెలుగు తెరకు నితిన్ 'తమ్ముడు'తో పరిచయం కానున్నారు.
ఇటీవల లుక్ టెస్ట్ జరిగిందని, ఆ తర్వాత సప్తమిని ఫైనలైజ్ చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. ఒకప్పటి కథానాయిక లయ కూడా 'తమ్ముడు'లో కీలక పాత్రలో కనిపించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అప్పటికీ, ఇప్పటికీ అందం పరంగా లయలో ఎటువంటి మార్పు లేదు. యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఆవిడ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. శ్రీరామ్ వేణు సినిమాల్లో హీరోయిన్లకు, సీనియర్ హీరోయిన్లకు కీలక పాత్రలు ఉంటాయి. 'తమ్ముడు'లో కూడా సప్తమి గౌడ, లయ పాత్రలు కీలకంగా ఉంటాయని తెలిసింది.
Also Read : 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా - మైత్రిలో పక్కా!
'తమ్ముడు' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ''కొన్ని టైటిళ్లతో పాటు చాలా బాధ్యతను మోసుకుని వస్తాయి'' అని సినిమా ప్రారంభోత్సవం రోజున నితిన్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ టైటిల్ తన సినిమాకు పెట్టుకోవడం చాలా బాధ్యతతో కూడిన విషయమని ఆయన మాటల్లో వ్యక్తం అయ్యింది. ప్రేక్షకుల అంచనాలను మించి తాము సినిమా తీస్తామని ఆయన వెల్లడించారు.
Also Read : 'ఖుషి' ప్రీ రిలీజ్ డీటెయిల్స్ - విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఎంత?
'వకీల్ సాబ్' తర్వాత ఆ దర్శకుడి నుంచి...
'తమ్ముడు' టైటిల్ మాత్రమే కాదు, ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ వేణు కూడా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నితిన్ చెంతకు వచ్చారు. ఆయన కూడా పవర్ స్టార్ అభిమానే. 'వకీల్ సాబ్' తర్వాత వేణు శ్రీరామ్ చేస్తున్న చిత్రమిది.
దర్శకుడిగా పరిచయమైన 'ఓ మై ఫ్రెండ్', ఆ తర్వాత 'మిడిల్ క్లాస్ అబ్బాయి', 'వకీల్ సాబ్'... 'దిల్' రాజు నిర్మాణ సంస్థలోనే శ్రీరామ్ వేణు సినిమాలు చేశారు. ఇప్పుడీ 'తమ్ముడు'ను కూడా ఆ సంస్థలో చేస్తున్నారు. 'దిల్', 'శ్రీనివాస కళ్యాణం' తర్వాత 'దిల్' రాజు నిర్మాణ సంస్థలో నితిన్ చేస్తున్న మూడో చిత్రమిది. ''రక్త సంబంధం కంటే అనుబంధం బలమైనది. కొత్త తమ్ముడు వస్తున్నాడు'' అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పేర్కొంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial