‘మన్మథుడు’ 4కే ప్రోమో, ‘బ్రో’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
అమ్మాయిలంటేనే అసహ్యించుకునే 'మన్మథుడు' మళ్లీ వచ్చేస్తున్నాడు - 4K ప్రోమో ఇదిగో!
ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమాల కంటే ఎక్కువగా రీరిలీజ్ సినిమాలే థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. దీంతో చాలా మంది దర్శక నిర్మాతలు ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీస్ ను మళ్లీ రిలీజ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరోసారి కలెక్షన్లను సొంతం చేసుకుంటారు. ఇటీవలే మహేశ్ బాబు 'బిజినెస్ మేన్', ధనుష్ 'రఘువరన్ బి.టెక్' లు రిలీజై మరోసారి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు 'మన్మథుడు' సినిమాతో నాగార్జున మరోసారి కామెడీని పండించబోతున్నాడు. 2002లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు వెండి తెరపై మరోసారి కనువిందు చేయనున్న తరుణంలో.. మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఓ కామెడీ ప్రోమోను వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ముద్దు ఎవరికి పెట్టారు అంటూ జర్నలిస్ట్ ప్రశ్న - యాంకర్ రష్మీ షాకింగ్ రిప్లై
ఈమధ్యకాలంలో సినిమా ఈవెంట్స్‌లో సెలబ్రిటీలను ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడం, దాన్ని అడ్డం పెట్టుకొని వైరల్ అయిపోవడం కామన్ అయిపోయింది. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడగడం కోసం, సమాచారం పంచుకోవడం కోసం ఈవెంట్స్‌ను ఏర్పాటు చేస్తే.. అది కాస్త పర్సనల్ ఇంటర్వ్యూలాగా మారిపోతుంది. ముఖ్యంగా ఓ సినీ జర్నలిస్ట్ ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నలు అడగడంలో ఆరితేరిపోయిన విషయం చాలామందికి తెలిసిందే. తాజాగా ‘బాయ్స్ హాస్టల్’ అనే సినిమాలో గెస్ట్ పాత్ర పోషించినందుకు మూవీ ఈవెంట్‌కు హాజరయ్యింది యాంకర్ రష్మీ. అక్కడ రష్మీని పలు ఇబ్బందికర ప్రశ్నలు అడిగినప్పటికీ తను మాత్రం తెలివిగా సమాధానం చెప్పింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘బ్రో’ వచ్చేస్తున్నాడు - ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే
మామూలుగా మల్టీ స్టారర్ సినిమాలంటేనే టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అది కూడా మెగా ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారంటే ఆ హైప్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడం కష్టం. ‘బ్రో’ విషయంలో కూడా అదే అయ్యింది. ‘వినోదాయ సితం’ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్ అయినా కూడా సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి మెగా హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కాబట్టి మూవీ మీద ముందు నుండే అంచనాలు ఉన్నాయి. ఒరిజినల్ వర్షన్‌కు, రీమేక్‌కు చాలా తేడా ఉంటుంది అని మేకర్స్ ముందు నుండే చెప్తున్నా.. రీమేక్స్ వల్ల విసిగిపోయిన కొందరు మెగా ఫ్యాన్స్ మాత్రం ‘బ్రో’పై పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'గుడుంబా శంకర్' రీ-రిలీజ్‌లో మార్పు - కలెక్షన్లపై ఎఫెక్ట్ పడనుందా?
2004లో విడుదలైన ‘గుడుంబా శంకర్’ ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 'గబ్బర్ సింగ్' ను కూడా రీరిలీజ్ చేస్తామని బండ్ల గణేష్ ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. కానీ ‘గుడుంబా శంకర్’ వసూళ్లను జనసేన పార్టీకి ఇవ్వాలని ఇప్పటికే మేకర్స్ నిర్ణయించినందున, బండ్ల గణేష్ ‘గబ్బర్ సింగ్’ రీరిలీజును నిలిపివేశాడు. ఇప్పుడు కథలో మరో ట్విస్ట్ వచ్చింది. ‘గుడుంబా శంకర్’ ముందుగా అనుకున్నట్లుగా ఆగస్ట్ 31న విడుదల చేస్తామని చెప్పిన దర్శకనిర్మాతలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న థియేటర్లలోకి రానున్నట్టు ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రష్మిక స్థానంలో శ్రీలీల - ఆ యంగ్ హీరోతో రెండోసారి రొమాన్స్‌కు రెడీ!
టాలీవుడ్‌లోకి ఒక హీరోయిన్ కొత్తగా ఎంటర్ అయ్యిందంటే చాలు.. తన మొదటి సినిమా థియేటర్లలో విడుదల అవ్వకముందే మరో రెండు, మూడు ఛాన్సులు తనకోసం ఎదురుచూస్తుంటాయి. ఒకవేళ తన డెబ్యూ మూవీ హిట్ అయ్యిందంటే అంతే.. తనకోసం నిర్మాతలు క్యూ కడతారు. శ్రీలీల విషయంలో కూడా అదే జరిగింది. అమ్మాయి క్యూట్‌గా ఉంది, డ్యాన్స్ ఇరగదీస్తుంది అన్న ఉద్దేశ్యంతో తనకు సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు ఇచ్చారు నిర్మాతలు. అందుకే హీరోయిన్‌గా ఎంటర్ అయ్యి కొంతకాలమే అయినా ప్రస్తుతం తన చేతిలో దాదాపు డజను సినిమాలు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్నా కూడా శ్రీలీల తన వద్దకు వస్తున్న ఆఫర్లను కాదనుకుండా యాక్సెప్ట్ చేస్తోంది. తాజాగా మరో సినిమాను ఓకే చేసిందట ఈ ముద్దుగుమ్మ. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)