అన్వేషించండి

అమ్మాయిలంటేనే అసహ్యించుకునే 'మన్మథుడు' మళ్లీ వచ్చేస్తున్నాడు - 4K ప్రోమో ఇదిగో!

దర్శకుడు విజయ భాస్కర్ తెరకెక్కించిన నాగార్జున నటించిన' మన్మథుడు' మరోసారి థియేటర్లలో కనువిందు చేయనుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ ప్రోమోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది

Manmadhudu : ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమాల కంటే ఎక్కువగా రీరిలీజ్ సినిమాలే థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. దీంతో చాలా మంది దర్శక నిర్మాతలు ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీస్ ను మళ్లీ రిలీజ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరోసారి కలెక్షన్లను సొంతం చేసుకుంటారు. ఇటీవలే మహేశ్ బాబు 'బిజినెస్ మేన్', ధనుష్ 'రఘువరన్ బి.టెక్' లు రిలీజై మరోసారి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు 'మన్మథుడు' సినిమాతో నాగార్జున మరోసారి కామెడీని పండించబోతున్నాడు. 2002లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు వెండి తెరపై మరోసారి కనువిందు చేయనున్న తరుణంలో.. మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఓ కామెడీ ప్రోమోను వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

"ఇతను మగాడు.. ఇతనికి వండిపెట్టే వాడూ మగాడే. ఇతని లాన్ లో పెరిగే మొక్కలూ మగవే. అందుకే వేటికీ పూలుండవు" అని ఫస్ట్ ఫస్టే కామెడీ అండ్ ఇంట్రస్టింగ్ డైలాగ్ తో ఈ ప్రోమో మొదలైంది. ఇక ‘మన్మథుడు’ సినిమాలో ఎక్కువ కామెడీ సీన్స్ బ్రహ్మానందంతోనే ఉంటాయి. దానికి సంబంధించిన ఓ చిన్న సీన్ ను కూడా ఈ ప్రోమోలో చేర్చారు. ఎస్కలేటర్ పై ఎలా నిలబడాలో హీరో, హీరోయిన్లకు బ్రహ్మానందం చెప్పే ఓ కామెడీ సీన్ మరోసారి నవ్వులు పూయిస్తోంది. "ఎలా దిగాలో తెలియక ఇలా దిగాము" అని నాగార్జున చెప్పే డైలాగ్.. దానికి బ్రహ్మానందం ఎక్స్ ప్రెషన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇలాంటి సీన్స్ ఈ మూవీలో చాలానే ఉంటాయి. వీటిని మరోసారి థియేటర్లలో వీక్షించి, ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండమని తెలుపుతూ చిత్ర యూనిట్ ఈ ప్రోమోను రిలీజ్ చేసింది. దాంతో పాటు టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలుసు కదా అంటూ ఓ ఫన్నీ క్యాప్షన్ ను కూడా వీడియోకు చేర్చింది.

కింగ్ నాగార్జునకు మామూలుగానే లేడీ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అలాంటిది లేడీస్ అంటే అసహ్యించుకునే థీమ్ తో రూపొందించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాదు నాగార్జున కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ లిస్ట్ గురించి మాట్లాడితే.. అందులో 'మన్మథుడు' సినిమా కూడా ఉంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. విజయ్ భాస్కర్ డైరెక్షన్, త్రివిక్రమ్ డైలాగ్స్ తో తెరకెక్కిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఈ చిత్రానికి ఉన్న పాపులారిటీ. ఇప్పటికే రీరిలీజ్ ల పేరుతో చాలా సినిమాలు కలెక్షన్లు కొల్లగొట్టగా.. ఆగస్టు 29న 4కె క్వాలిటీలో రీరిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ఎలా ఆదరిస్తారో, ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో వేచి చూడాల్సి ఉంది.

Read Also : Dhanush: శోభన, తిరుల స్నేహానికి ఏడాది - ధనుష్, నిత్యా మీనన్ ఆసక్తికర పోస్ట్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Embed widget