News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

'గుడుంబా శంకర్' రీ-రిలీజ్‌లో మార్పు - కలెక్షన్లపై ఎఫెక్ట్ పడనుందా?

వీరశంకర్ దర్శకత్వం వహించిన 'గుడుంబా శంకర్‌' మరోసారి థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతోంది. అయితే ఇంతకుముందు ప్రకటించినట్టు ఆగస్టు 19న కాకుండా సెప్టెంబర్ 2న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని తెలిపారు

FOLLOW US: 
Share:

Gudumba Shankar : 2004లో విడుదలైన ‘గుడుంబా శంకర్’ ఏ రేంజ్ లో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 'గబ్బర్ సింగ్' ను కూడా రీరిలీజ్ చేస్తామని బండ్ల గణేష్ ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. కానీ ‘గుడుంబా శంకర్’ వసూళ్లను జనసేన పార్టీకి ఇవ్వాలని ఇప్పటికే మేకర్స్ నిర్ణయించినందున, బండ్ల గణేష్ ‘గబ్బర్ సింగ్’ రీరిలీజును నిలిపివేశాడు. ఇప్పుడు కథలో మరో ట్విస్ట్ వచ్చింది. ‘గుడుంబా శంకర్’ ముందుగా అనుకున్నట్లుగా ఆగస్ట్ 31న విడుదల చేస్తామని చెప్పిన దర్శకనిర్మాతలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న థియేటర్లలోకి రానున్నట్టు ప్రకటించారు. 

సెప్టెంబర్ 2న 'గుడుంబా శంకర్’ సినిమాను రీరిలీజ్ చేస్తామని చెప్పడంతో ఇప్పుడు మరో చిక్కు వచ్చిపడింది. అదేంటంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత లవ్ ఎంటర్టైనింగ్ 'ఖుషి' మూవీ సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. అందువల్ల మరిన్ని షోలు, స్క్రీన్‌లను వేయడం కష్టం కావచ్చు. కాబట్టి ‘గుడుంబా శంకర్’ రీరిలీజ్ ని టీమ్ ఎలా ప్లాన్ చేస్తుందోనని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా పవర్ స్టార్ మూవీ రిలీజ్ అవుతుందంటే ఏ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ 'ఖుషి'కి ఎంతటి పాపులారిటీ వచ్చిందో ప్రత్యక్షంగా చూశాం. ఇప్పుడు 'గుడుంబా శంకర్’ రిలీజైనా అదే లెవల్ లో స్పందన వస్తుందని అందరూ భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఒకటైన 'ఖుషి' కూడా ఈ సమయంలోనే రిలీజ్ కానుండడంతో.. ఈ ప్రభావం 'గుడుంబా శంకర్’ వసూళ్లపైనా పడనుందని అనుకుంటున్నారు. 

వీరశంకర్ దర్శకత్వం వహించిన 'గుడుంబా శంకర్’లో పవన్ కళ్యాణ్ సరసన మీరా జాస్మిన్ నటించింది. మరోవైపు ఇటీవల రిలీజ్ అయిన 'గుడుంబా శంకర్’ రీరిలీజ్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా అప్పటి ఆడియన్స్ ని ఆకట్టుకున్న 'గుడుంబా శంకర్’ సాంగ్స్ కూడా మంచి ఆదరణ అందుకున్నాయి. మరి 'గుడుంబా శంకర్’ మూవీ ఇప్పటి ఆడియన్స్ ని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి. నాగ బాబు నిర్మించిన ఈ యాక్షన్-కామెడీ డ్రామాలో ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, సాయాజీ షిండే, సునీల్, ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. 

Read Also : Yogi Babu: కోలీవుడ్ ‘బ్రహ్మి’ యోగిబాబు - సీరియస్‌గానే కితకితలు పెట్టే ఈ కమెడియన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 20 Aug 2023 12:24 PM (IST) Tags: Bandla Ganesh Pawan Kalyan Janasena Gudumba Shankar Gudumba Shankar re-release Pawan Kalyan birthday Gabbar Singh

ఇవి కూడా చూడండి

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్

Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత