‘ఉస్తాద్’ రివ్యూ, ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
'ఉస్తాద్' రివ్యూ : హీరోగా, నటుడిగా కీరవాణి కుమారుడు శ్రీ సింహా హిట్టు - మరి, సినిమా?
ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి రెండో కుమారుడు, యువ కథానాయకుడు శ్రీ సింహా కోడూరి (Sri Simha Koduri) నటించిన తాజా సినిమా 'ఉస్తాద్'. ఇందులో కావ్యా కళ్యాణ్ రామ్ కథానాయిక. శ్రీ సింహా కోడూరి తాను ఎంపిక చేసుకున్న ప్రతి కథలో ఏదో ఒక వైవిధ్యం ఉండేలా చూసుకున్నారు. 'ఉస్తాద్' ప్రచార చిత్రాలు చూసినప్పుడు... కొత్త అనుభూతి ఇచ్చింది. మరి, సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇంగ్లీష్ వెర్షన్ లోనూ ‘సలార్’ విడుదల- త్వరలో అధికారిక ప్రకటన!
పాన్ ఇండియన్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు భారతీయ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేశారు. ఈ టీజర్ అనుకున్న స్థాయిలో లేదనే విమర్శలు వచ్చినా, యూట్యూబ్ లో మాత్రం భారీగా వ్యూస్ అందుకుంది. 24 గంటల్లో ఏకంగా 83 మిలియన్ వ్యూస్ సాధించి.. ఆల్ టైం హైగా రికార్డును నమోదు చేసింది. ఇప్పటికే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టిన 'భోళా శంకర్' - మొదటి రోజు కలెక్షన్లు సంక్రాంతి హిట్‌లో సగమే?
'భోళా శంకర్' మీద ముందు నుంచి మెగా అభిమానుల్లో అంచనాలు లేవు. తమిళంలో ఎనిమిదేళ్ళ క్రితం వచ్చిన అజిత్ 'వేదాళం' రీమేక్ కావడం అందుకు ఓ కారణం అయితే... చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు కావడం ముఖ్యమైన కారణం అని చెప్పాలి. పాటలు, ప్రచార చిత్రాలు... ఏవీ సినిమాపై ఆసక్తి కలిగించలేదు. అయితే... అభిమానుల్లో ఏదో ఆశ. చిరంజీవి ఉన్నారని! ఆ ఆశలు మొదటి ఆటకు పరార్ అయ్యాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఏపీలో ‘భోళా శంకర్’కు తప్పని తిప్పలు- ప్రదర్శన నిలిపివేసిన పోలీసులు!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెరకెక్కింది. మిల్కీబ్యూటీ తమన్నా, ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్ గా రూపొందింది. భారీ అంచనాల నడుమ(ఆగష్టు11న) విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
పులిలా వేటకు సిద్ధమైన మాస్ మహారాజా - ఆ రోజే 'టైగర్ నాగేశ్వర రావు' టీజర్
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వర రావు' (Tiger Nageswara Rao Movie). వంశీ దర్శకుడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్ర సమర్పకులు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)