By: ABP Desam | Updated at : 12 Aug 2023 01:10 PM (IST)
Photo Credit: Hombale Films/Instagram
పాన్ ఇండియన్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు భారతీయ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేశారు. ఈ టీజర్ అనుకున్న స్థాయిలో లేదనే విమర్శలు వచ్చినా, యూట్యూబ్ లో మాత్రం భారీగా వ్యూస్ అందుకుంది. 24 గంటల్లో ఏకంగా 83 మిలియన్ వ్యూస్ సాధించి.. ఆల్ టైం హైగా రికార్డును నమోదు చేసింది. ఇప్పటికే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ కొత్త న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ వెర్షన్‌లో కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. భారత్ లో లో ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుండగా, సుమారు రెండు వారాల తర్వాత ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అంటే ‘సలార్’ ఇంగ్లీష్ వెర్షన్ 13 అక్టోబర్, 2023న అభిమానులను అలరించనుంది. అయితే, ఇంగ్లీష్ వెర్షన్ విడుదలకు సంబంధించి మేకర్స్ నుంచి త్వరలో అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
#SalaarCeaseFire English version likely to be released on 13 October 2023.
— Manobala Vijayabalan (@ManobalaV) August 2, 2023
Other language versions of #Salaar to be OUT on the already decided release date.
Box Office BOMARDING from 28 September 2023.#Prabhas pic.twitter.com/QZYY3E4P7Z
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని మాఫియా, గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో శృతిహాసన్ 'ఆధ్య' అనే జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగంధూర్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు. రవి బాస్రూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా 'సలార్' మూవీ రాబోతుందని తాజాగా విడుదల చేసిన టీజర్ లో స్పష్టం చేశారు మేకర్స్. 'సలార్' పార్ట్ -1 ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. అటు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ ‘Kalki 2898 AD’ లోనూ నటిస్తున్నారు. మరోవైపు మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు.
Read Also: 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కోసం బిగ్ బీ భారీ రెమ్యునరేషన్, ఒక్కో ఎపిసోడ్ కు ఎంత తీసుకుంటున్నారంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>