KBC15: 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కోసం బిగ్ బీ భారీ రెమ్యునరేషన్, ఒక్కో ఎపిసోడ్ కు ఎంత తీసుకుంటున్నారంటే?
'కౌన్ బనేగా కరోడ్‌పతి' లేటెస్ట్ సీజన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బీ కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఒక్కో ఎపిసోడ్ కు ఎంత వసూళు చేస్తున్నారంటే?
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ హోస్టుగా వ్యహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇండియన్ టీవీ ఇండస్ట్రీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ షోగా గుర్తింపు తెచ్చుకుంది. 2000 సంవత్సరంలో మొదలైన ఈ షో ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి చేసుకుంది. ఎంతో మందిని కోటీశ్వరులను చేసింది. 15వ సీజన్ ఆగష్టు 14 నుంచి ప్రారంభం కానున్నట్లు సోనీ టీవీ అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రకటనతో బుల్లితెర అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Khel toh hai wahi par badal jayenge role, dekhne mein aayega maza jab contestants puchhenge #AmitabhBachchan ji se sawaal!🤭
— sonytv (@SonyTV) August 11, 2023
Dekhiye #KaunBanegaCrorepati 14th Aug se, Som-Shukr raat 9 baje, sirf #SonyEntertainmentTelevision par.#KBC15#KaunBanegaCrorepati #KBCOnSonyTV pic.twitter.com/1OLAxAh97q
ఒక్కో ఎపిసోడ్ కు రూ. 4 కోట్ల రెమ్యునరేషన్
ఎప్పటిలాగే ఈ సీజన్ కు కూడా ఆయనే హోస్టుగా వ్యవహిరంచనున్నారు. 14 సీజన్లను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన బిగ్ బీ, ఈ సీజన్ ను మరింత సక్సెస్ చేయాలని భావిస్తున్నారు. ఇక లేటెస్ట్ సీజన్ కోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ. 4 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
తొలి సీజన్ లో బిగ్ బీ రెమ్యునరేషన్ ఎంతంటే?
2000 సంవత్సరంలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' తొలి సీజన్ ప్రసారం అయ్యింది. ఈ షో అప్పట్లో అద్భుత ప్రజాదరణ దక్కించుకుంది. తొలి సీజన్ లో అమితాబ్ ఒక్కో ఎపిసోడ్ కు రూ. 1 కోటి రెమ్యునరేషన్ అందుకున్నారు. 2005లో రెండో సీజన్ ప్రసారం కాగా, ఒక్కో ఎపిసోడ్ కు రూ. 2 కోట్లు తీసుకున్నారు. మూడో సీజన్ కు సైతం అంతే తీసుకున్నారు. 2010లో 4వ సీజన్ ప్రేక్షకుల ముందుకు రాగా మళ్లీ ఎపిసోడ్ రెమ్యునరేషన్ రూ. 1 కోటికి తగ్గించారు. ఇక 6,7 సీజన్లలో రూ. 1.5 నుంచి 2 కోట్ల వరకు తీసుకున్నారు. 8వ సీజన్ లో అది కాస్త రూ.2 కోట్లకు చేరింది. ఎనిమిదవ సీజన్‌లో రాణి ముఖర్జీ, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్ దిగ్గజ నటులు బిగ్ బీ షోలో ఆకట్టుకున్నారు. 9వ సీజన్‌లో అమితాబ్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.2.6 కోట్లు తీసుకున్నారు. క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి విద్యాబాలన్ సైతం ఈ స్టేజిపై సందడి చేశారు. రు. 10వ సీజన్‌లో అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 కోట్లు తీసుకున్నారు. ఆ ఏడాది ఆయుష్మాన్ ఖురానా, అమీర్ ఖాన్ ఈ షోలో పాల్గొని ఆకట్టుకున్నారు. 11, 12, 13వ సీజన్లలో అమితాబ్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 3.5 కోట్లు తీసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 13వ సీజన్ లో భారత క్రికెటర్లు సౌరబ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ సహా పలువురు పాల్గొన్నారు. 14వ సీజన్ లో అంతే మొత్తంలో తీసుకున్నారు.
Read Also: బెస్ట్ మూవీగా 'సీతారామం', మృణాల్ కు స్పెషల్ అవార్డు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial