Sonarika Bhadoria Wedding: ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్? వరుడు ఎవరంటే..
Sonarika Bhadoria: సోనారికా భాడోరియా.. అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ 'మహాదేవ్' సీరియల్ పార్వతి అంటే టక్కున్న చెప్పేస్తారు. బుల్లితెరపై పార్వతి దేవిగా ఎంతో పాపులర్ అయ్యింది ఆమె.
Sonarika Bhadoria Marriage with Fiance: సోనారికా భాడోరియా.. అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ 'మహాదేవ్' సీరియల్ పార్వతి అంటే టక్కున్న చెప్పేస్తారు. బుల్లితెరపై పార్వతి దేవిగా ఎంతో పాపులర్ అయిన ఆమె హిందీలో మరెన్నో సీరియల్స్‌లో నటించి అలరించింది. ఇక తెలుగులో నాగశౌర్య'జాదుగాడు' చిత్రంలో హీరోయిన్‌గా పరిచయమైన సోనారిక ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ 'స్పీడున్నోడు', మంచు విష్ణు సరసన 'ఈడో రకం ఆడో రకం' చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆఫర్స్ లేక టాలీవుడ్‌కు దూరమైన సోనారిక 2022లో ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్‌ను నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగి ఏడాదిన్నర అవుతున్న సోనారిక ఇంకా పెళ్లి కబురు చెప్పలేదు.
ఫిబ్రవరి 18న పెళ్లి?
అయితే తాజాగా ఆమె పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. ఎంగేజ్‌మెంట్ జరిగిన ఏడాదిన్నర తర్వాత వారిద్దరు పెళ్లికి సిద్ధమయ్యారట. అందుకే ఫిబ్రవరిలో పెళ్లి ముహుర్తం కూడా ఖరారైనట్టు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఫిబ్రవరి 18న రాజస్తాన్‌లో జరగనుందని తెలుస్తోంది. కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితులు ఇరు కుటుంబ సభ్యుల మధ్య రాజస్తాన్ రణతంబోర్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఘనంగా వీరి వివాహ వేడుక జరగనుందట. అయితే దీనిపై అధికారికి సమాచారం రావాల్సి ఉంది. కాగా 2022 మే 19న తనకు కాబోయే భర్త, ప్రియుడికి బర్త్‌డే విషెస్ చెబుతూ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించింది సోనారిక. ఈ సందర్భంగా మాల్దివుల్లో బీచ్ ఒడ్డున వికాస్ తన చేతికి రింగ్ తొడిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో అతడికి బర్త్‌డే విషెస్ చెబుతూ తనకు కాబోయే భర్త అని పేర్కొంది.
Also Read: రష్మికతో ఎంగేజ్‌మెంట్, విజయ్ దేవరకొండ అంతమాట అనేశాడేంటి?
2022లో నిశ్చితార్థం..
"వికాస్ తన మనసులో నాకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. అనుక్షణం నాకు అండగా నిలుస్తూ నా మైండ్‌ని, మనసుని, నన్ను కంటిరెప్పాలా చూసుకుంటాడు. ఎప్పుడూ నా పక్కను ఉండి, నా కోసమే నిలబడే వ్యక్తి. ప్రతి క్షణం, ప్రతి రోజూ నాతోనే ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న వ్యక్తి. ఈ గోల్డెన్ హార్ట్‌కి పుట్టిన రోజులు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే ఫియాన్సీ" అంటూ ఏడాదిన్నర క్రితం తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. కాగా దాదాపు ఎనిదేళ్లుగా సోనారిక అతడితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట తమ అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇక వారు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
గతంలో సోనారిక తన ఎంగేజ్‌మెంట్ గురించి ఓ ఇంటర్య్వూలో ప్రస్తావించింది. "మే 2022లో మాల్దీవులలో అనుకోకుండా నిశ్చితార్థం జరిగింది. మా ఇద్దరికి బీచ్ అంటే చాలా ఇష్టం. మేం మాల్దివులు వెళ్లినప్పుడు వికాస్ ప్రపోజ్ చేస్తూ రింగ్ తొడిగాడు. అప్పుడు కేవలం మేం ఇద్దరం మాత్రమే ఉన్నాం. ఈ విషయం మా ఇంట్లో చెప్పగా వారు కూడా సంతోషించారు. కానీ ఈ వేడుకలో వారు ఉంటే బాగుండని అనుకున్నారు. అయితే వికాస్ ప్రతిదీ గ్రాండ్‌గా ఇష్టపడతాడు అందుకే మా కుటుంబ సభ్యులతో కలిసి గోవా బీచ్‌లో రోకా వేడుక జరుపుకున్నాం" అని సొనారిక చెప్పుకొచ్చింది.
View this post on Instagram
View this post on Instagram