అన్వేషించండి

Vijay Rashmika Engagement: రష్మికతో ఎంగేజ్‌మెంట్, విజయ్ దేవరకొండ అంతమాట అనేశాడేంటి?

Vijay Rashmika Engagement: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై రౌడీ బాయ్ స్పందించారు.

Vijay Devarakonda Reacts To Engagement Rumours With Rashmika: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వీరిద్దరు కలిసి చేసింది రెండు సినిమాలే అయినా, వెండితెరపై హాట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, వీళ్లు రియల్ లైఫ్ కపుల్ మాదిరిగానే ఉన్నారంటూ ప్రేక్షకులు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. ఈ కాంప్లిమెంట్స్ కు నిజమే అనేలా ఇద్దరు కలిసి తరుచుగా హాలీడే ట్రిప్స్ కు వెళ్తూ కనిపించారు. పండుగలు, ఇతర ముఖ్యమైన వేడుకలకు రష్మిక, విజయ్ ఇంటికి కూడా వెళ్తోందనే వార్తలు వినిపించాయి. తాజాగా వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి.

త్వరలో ఎంగేజ్‌మెంట్ అంటూ వార్తలు

వాస్తవానికి రష్మిక, విజయ్ రిలేషన్ షిప్ లో ఉన్నారా? లేదా? అనే విషయం తెలియకపోయినా, పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వీరు పెట్టే ఫోటోలు ఒకే దగ్గర తీసినవి అంటూ నెటిజన్లు ఎప్పటికప్పుడు తేల్చి చెప్తూనే ఉన్నారు. వీరిద్దరి మధ్యన కచ్చితంగా ప్రేమ ఉందంటున్నారు. మరికొంత మంది ఏకంగా వీరిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని చెప్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రష్మిక, విజయ్ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారంటూ వార్తలు రాసేశాయి. ఫిబ్రవరిలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగే అవకాశం ఉందని వెల్లడించాయి.

ఎంగేజ్‌మెంట్ వార్తలపై స్పందించిన విజయ్ దేవరకొండ

తాజాగా తన ఎంగేజ్‌మెంట్ గురించి వస్తున్న వార్తలపై విజయ్ దేవరకొండ స్పందించాడు. నిశ్చితార్థం, పెళ్లి అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పాడు. ‘‘ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం జరగడం లేదు, పెళ్లి కూడా జరగడం లేదు. ప్రతి రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని పత్రికలు భావిస్తున్నట్లు అనిపిస్తుంది. నేను ప్రతి సంవత్సరం ఈ ఊహాగానాలను వింటూనే ఉన్నాను. మీడియా నన్ను పట్టుకుని ఎప్పుడు పెళ్లి చేద్దామా? అని ఎదురు చూస్తోంది” అని విజయ్ చెప్పాడు. రష్మిక, విజయ్ ఎంగేజ్‌మెంట్ వార్తల గురించి వారి సన్నిహితులు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వాళ్లు తమ కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టారని చెప్తున్నారు.  నిశ్చితార్థం, పెళ్లి విషయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు.  ప్రస్తుతం వాళ్లు రిలేషన్ షిప్ లో హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు.

వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

ఇక రీసెంట్ గా రష్మిక, విజయ్ పెళ్లి గురించి ఆస్ట్రాలజర్ వేణు స్వామి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు పెళ్లితో ఒక్కటవుతారని చెప్పారు. కానీ, వివాహం తర్వాత వీళ్లు విడిపోతారని చెప్పారు. ఈ విషయాన్ని గతంలోనే రష్మికకు చెప్పినట్లు వెల్లడించారు. విజయ్ ని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దని సూచించినట్లు వివరించారు. కానీ, తన మాటలు రష్మికకు అస్సలు నచ్చలేదన్నారు. ఈ విషయం చెప్పిన తర్వాత మాట్లాడ్డం మానేసిందన్నారు. రష్మిక, విజయ్ కలిసి ‘గీత గోవిందం’(2018), ‘డియర్ కామ్రేడ్’(2019) అనే సినిమాల్లో నటించారు. రష్మిక ఇటీవల ‘యానిమల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ అందుకుంది. ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’తో పాటు ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘ఛావ’ అనే సినిమాలు చేస్తోంది. విజయ్ దేవరకొండ   పరశురామ్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు.

Read Also: బాక్సాఫీస్ దగ్గర ‘నా సామిరంగ’ దూకుడు, 6 రోజుల్లో ఎంత వసూళు చేసిందంటే?

టాప్ హెడ్ లైన్స్

Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget