News
News
X

Tollywood: హీరోగా వి.వి.వినాయక్ సినిమా - మేర్లపాకతో మరోసారి నాని - RC15 అప్డేట్!

ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

FOLLOW US: 

హీరోగా వి.వి.వినాయక్ సినిమా:
టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వి.వి.వినాయక్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నిజానికి ఈపాటికే ఆయన హీరోగా ఓ సినిమా రిలీజ్ అవ్వాలి కానీ అది ఆదిలోనే ఆగిపోయింది. అయినా.. వినాయక్ మాత్రం తన ప్రయత్నాలు మానుకోవడం లేదు. ఆయన దర్శకత్వంలోనే హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి నిర్మాత కూడా ఆయనే. ఆకుల శివ ఈ సినిమాకి కథ, మాటలు అందిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం వినాయక్ దర్శకుడిగా బాలీవుడ్ లో 'ఛత్రపతి' రీమేక్ ను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మేర్లపాకతో మరోసారి నాని:  
'ఎక్స్‌ప్రెస్ రాజా', 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్' వంటి సినిమాలతో టాలీవుడ్ లో హిట్స్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ ఆ తరువాత నాని హీరోగా 'కృష్ణార్జున యుద్ధం' అనే సినిమా తీశారు. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నితిన్ తో తీసిన 'మ్యాస్ట్రో' కూడా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు సంతోష్ శోభన్ తో 'లైక్ షేర్ స‌బ్ స్క్రెబ్‌' అనే సినిమా తీశారు. ఇది త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు నానితో మరో సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు మేర్లపాక గాంధీ. ఇటీవల ఆయన నానికి ఓ స్టోరీ చెప్పారట. అది నచ్చడంతో నాని కూడా ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నాని 'దసరా' సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రామ్ చరణ్-శంకర్ సినిమా అనుకున్న టైంకి రాదా:

'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనేది శంకర్ ప్లాన్. కానీ సడెన్ గా ఆయన 'ఇండియన్ 2' సినిమాను రీస్టార్ట్ చేయడంతో చరణ్ సినిమాను పక్కన పెట్టినట్లు వార్తలొచ్చాయి. మొన్నామధ్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు శంకర్. 'ఇండియన్ 2', 'RC15' సినిమాలను సమాంతరంగా చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు. ఇలా రెండు సినిమాలను ఒకేసారి చిత్రీకరిస్తుండడంతో ఎంత ప్లాన్ చేసుకున్నా.. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని సమాచారం. 

రామ్ చరణ్ సినిమాను 2023 సమ్మర్ కి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్స్ ప్రకారం.. సినిమా అనుకున్న టైంకి వచ్చేలా లేదని టాక్. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

Also Read : ఈ వారం థియేట్రికల్ - ఓటీటీ రిలీజెస్ ఇవే!

Also Read : ‘జైలర్’ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం! నిజంగానే రజనీ మూవీ నుంచి తప్పుకుందా?

Published at : 19 Sep 2022 09:54 PM (IST) Tags: Tollywood nani VV Vinayak Ram Charan merlapaka gandhi

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా?

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా?

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

Zodiac Signs: జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Zodiac Signs:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి