Prabhas: విమర్శలు, వివాదాలకు దూరంగా... తెలివైన నిర్ణయం తీసుకున్న ప్రభాస్!
ఒక్క నిర్ణయం... ప్రభాస్ అండ్ 'రాధే శ్యామ్' టీమ్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో విమర్శలు, వివాదాలు అన్నీ పక్కకు వెళ్లిపోయాయి. అదేంటి? ఏమైంది?
యంగ్ రెబల్ స్టార్... అభిమానుల గుండెల్లో బాహుబలి... పాన్ ఇండియా హీరో... ఇదీ ఇప్పటి ప్రభాస్ రేంజ్. కొన్నేళ్లుగా ఆయన ఇమేజ్ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరిలో ఆసక్తి ఉంటుంది. సాధారణంగా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే ఎవరో ఒకర్ని అతిథిగా పిలుస్తుంటారు. అతిథుల్ని ఆహ్వానించే విషయంలో హీరోలు, దర్శక - నిర్మాతలు ఎలా ఆలోచించినా... ప్రేక్షకుల ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఒకర్ని ఆహవించి, మరొకర్ని వదిలేస్తే... గుసగుసలు వినిపించడం కామన్. వీటికి దూరంగా ప్రభాస్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని నిర్ణయించారు.
ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిసెంబర్ 23న జరగనుంది. దీనికి అతిథులుగా సినిమా సెలబ్రిటీలు ఎవర్నీ ఆహ్వానించడం లేదు. అభిమానులే అతిథులుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తామని చిత్రబృందం వెల్లడించారు. ఇటీవల 'పుష్ప: ద రైజ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. దానికి రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా వచ్చారు. చిరంజీవి ఎందుకు రాలేదని కొందరు సోషల్ మీడియాలో డిస్కషన్స్ చేశారు. ముంబైలో 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. దానికి సల్మాన్ ఖాన్ అతిథిగా వస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభాస్‌ను పిలిస్తే బావుంటుందని కొందరు సూచించారు. ఈ నేపథ్యంలో 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్‌కు అతిథులు ఎవరూ లేకుండా, అభిమానులే అతిథులుగా యూనిట్ సభ్యుల మధ్య ఫంక్షన్ చేయాలని నిర్ణయించడంతో అటువంటి విమర్శలు, వివాదాలకు ఒక్కసారి చెక్ పెట్టినట్టు అయ్యింది. ప్రభాస్ పాన్ ఇండియా హీరో కావడంతో ఫంక్షన్‌లో అతడు స్పెషల్ అట్రాక్షన్ అవుతారని యూనిట్ సభ్యులు భావిస్తున్నట్టు సమాచారం.
ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన 'రాధే శ్యామ్'లో కృష్ణంరాజు కూడా నటించారు. సో... హీరోయిన్, ఇతర నటీనటుల సహా ఆయన కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా రామౌజీ ఫిల్మ్ సిటీలో భారీ గ్రౌండ్‌లో ఫంక్షన్ చేయాలని నిర్ణయించారు.
Also Read: 'బిగ్ బాస్' విన్నర్ ఎవరు? నాగార్జున ఏమన్నారంటే...
Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
Also Read: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?
Also Read: బన్నీ ఫ్యాన్స్ బీభత్సం.. పుష్ప థియేటర్లపై అల్లు అర్జున్ అభిమానుల రాళ్ల దాడులు
Also Read: 'అంతఃపురం'తో ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పనున్న రాశీ ఖన్నా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: దక్షిణాది భాషల్లో... రాజమౌళి సమర్పించు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి