BiggBoss6 Telugu: బిగ్‌బాస్ సీజన్ 6 ఫైనల్ లిస్టు ఇదే, కార్తీక దీపం హీరోయిన్ కూడా ఎంట్రీ?
బిగ్‌బాస్ సీజన్ 6 మరో నాలుగు రోజుల్లో మొదలవ్వబోతోంది.
బిగ్‌బాస్ సీజన్ 6 సెప్టెంబరు నాలుగు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈలోపే ఎవరెవరు ఈసారి హౌస్లోకి వెళ్లబోతున్నారనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ జాబితా ఇదేనంటూ చాలా పేర్లు బయటికి వచ్చాయి. వారిలో ఎంత మంది నిజంగా హౌస్ లోకి వెళ్లబోతున్నారో ఈ ఆదివారం తేలిపోతుంది. అయితే సమాచారం ప్రకారం ఇక్కడ మేము చెప్పిన వారంతా హౌస్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ జాబితా ఇదే...
1. బాలాదిత్య (హీరో)
2. అభినయ శ్రీ (నటి)
3. రోహిత్, మెరీనా (రియల్ కపుల్)
4. రేవంత్ (సింగర్)
5. నేహా (యాంకర్)
6. చలాకీ చంటి (కమెడియన్)
7. సుదీప (నటి, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్)
8. శ్రీ సత్య (సీరియల్ నటి)
9. ఇనయా సుల్తానా (నటి)
10. శ్రీహాన్ (యూట్యూబర్)
11. అరిహా రావ్
12. వాసంతి
13. అర్జున్
14. ఆర్జే సూర్య
15. కీర్తి భట్ (కార్తీకదీపం హీరోయిన్)
16. రాజశేఖర్
17. గీతూ (యూట్యూబర్)
18. ఫైమా (కమెడియన్)
19. తన్మయ్ (జబర్దస్త్ లేడి గెటప్)
20. ఆది రెడ్డి (యూట్యూబర్)
వీరంతా క్వారంటైన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆది రెడ్డి, ఫైమా తమ యూట్యూబ్ ఛానెళ్లలో కూడా రెండు వారాలుగా ఏమీ అప్ లోడ్ చేయలేదు. దీన్ని బట్టి వారు కచ్చితంగా హోస్ లోకి వెళుతున్నారని ఎంతో మందికి నమ్మకం కుదిరింది. అయితే ఫైమా ఇప్పుడిప్పుడే జబర్దస్త్ లో మంచి స్థాయికి చేరుకుంది, అలాగే ఆమెకు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఆమె ఈటీవీని వదిలి వెళుతుందా అనేది కూడా అనుమానమే.
ఇక వరుణ్, వితిక తరువాత ఇంతవరకు రియల్ జంట హౌస్ లోకి వెళ్లలేదు. ఇప్పుడు మెరీనా, రోహిత్ వెళ్లబోతున్నారు. వీరిద్దరూ సీరియల్ నటులు. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.
గత సీజన్లో సింగర్ శ్రీరామ్ పాల్గొన్నారు కాబట్టి ఈసారి సింగర్లలో రేవంత్ కు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక కార్తీక దీపం హీరోయిన్ కీర్తి భట్ రాక మాత్రం కాస్త అనుమానంగానే ఉంది. సీరియల్ జోరుమీద సాగుతున్నప్పుడు ఈమె ఎందుకు దాన్ని వదులుకుని మరీ జబర్దస్త్ కి వస్తుంది అనేది అనుమానం. బాలాదిత్య కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ అవకాశాల్లేక ఖాళీగా ఉంటున్నాడు. ఇక ఇనయా సుల్తానా ఆర్జీవీతో చేసిన డ్యాన్సు వైరల్ గా మారడంతో అందరికీ తెలిసింది. అరియానాలాగే ఆర్జీవీ ఈమెకు లైఫ్ ఇచ్చినట్టే చెప్పుకోవాలి. ఆ వీడియో వైరల్ అవ్వకముందు ఆమె పెద్దగా ఎవరికీ తెలియదు. ఇంతకుముందు సీరియల్ నటుడు అమర్ దీప్, యాంకర్ శివ కూడా ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ చివర్లో వారిద్దరూ లేనట్టు తెలుస్తోంది. ఈ జాబితా నిజమో కాదో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.
Also read: బిగ్‌బాస్6 షో కోసం నాగార్జున షాకింగ్ రెమ్యునరేషన్
Also read: బిగ్ బాస్6లో అల్లు అర్జున్ ఐటెం గర్ల్ - ఆర్జీవీ బ్యూటీకి ఛాన్స్!