The Lord of The Rings: అదరగొడుతున్న ‘ది రింగ్స్ ఆఫ్ పవర్ 2‘ వెబ్ సిరీస్ టీజర్ - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
2022లో విడుదలై ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన వెబ్ సిరీస్ కు ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్‘. దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ రాబోతోంది. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.
The Lord of The Rings: The Rings of Power Teaser: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఎంతగానో కట్టుకున్న వెబ్ సిరీస్ ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్‘. 2022లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అద్భుత ఆదరణ దక్కించుకుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది. ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకుంది. త్వరలోనే స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు. విజువల్ వండర్ గా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మంత్రాలు, మాయలతో పాటు వార్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ సీజన్ 2ను చార్లోట్ బ్రాడ్ స్ట్రోమ్ తెరకెక్కిస్తుండగా, సింతియా అడాయ్ రాబిన్‍సన్, రాబర్ట్ అరమాయో, ఓవైన్ ఆర్థర్, చార్లీ వికెర్స్, మ్యాక్జిమ్ బాల్డ్రీ, మార్ఫిడ్ క్లార్క్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
‘సారన్‘ పాత్రలో ఆకట్టుకుంటున్న చార్లీ వికెర్స్
‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ వెబ్ సిరీస్ తొలి సీజన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంతో రెండో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. తాజాగా సారూన్ క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ విడుదలైన టీజర్ ఆహా అనిపిస్తోంది. చార్లీ వికెర్స్ ‘సారన్‘ పాత్రలో ఆకట్టుకున్నాడు. గలాడ్రియెల్, ఎల్‍రోన్డ్, ప్రిన్స్ డ్యూరిన్, అరోండిన్ పాత్రలు కూడా మెస్మరైజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లోని విజువల్స్, గ్రాఫిక్స్ తో నెక్ట్స్ లెవెల్ అన్నట్లుగా ఉన్నాయి. ఈ టీజర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ పై అంచనాలను మరింత పెంచేసింది.
ఆగష్టు 2024 నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్
‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్‍ను అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. 2024 ఆగష్టు 29 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలిపింది. 240లకు పైగా దేశాలలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళంతో పాటు కన్నడలోనూ విడుదల కానుంది. ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ తొలి సీజన్ కొద్ది రోజుల్లోనే అద్భుత ఆదరణ దక్కించుకుంది. కొద్ది రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. రెండవ సీజన్ మొదటి సీజన్ ను మించి వ్యూస్ అందుకునే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ రెండో సీజన్ సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
Read Also: 'అపరిచితుడు' రీ రిలీజ్... రెండు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి మరోసారి - బాక్సాఫీస్‌ను షేక్ చేసేనా?