Thandel: భారత్ మాతాకీ జై - నాగచైతన్య గురి తప్పేదెలేదేస్, 'తండేల్' మాస్ గ్లింప్స్ చూశారా?
Thandel Glimpse Review: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 సంస్థ నిర్మిస్తున్న 'తండేల్' గ్లింప్స్ విడుదల చేశారు.
Thandel movie highlights glimpse review: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'తండేల్'. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఈ రోజు 'Essence of Thandel' పేరుతో వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
ఈపాలి యేట... గురి తప్పేదెలేదేస్
సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారునిగా 'తండేల్' సినిమాలో నాగ చైతన్య నటిస్తున్నారనేది తెలిసిన విషయమే. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు పాకిస్తాన్ నావికా దళానికి చెక్కి అక్కడ జైలులో ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితుల స్ఫూర్తితో ఈ సినిమా చేస్తున్నారు. కథపై చందూ మొండేటి బాగా రీసెర్చ్ చేశారు. ఆయనతో పాటు చైతూ కూడా శ్రీకాకుళం వెళ్లారు. వాస్తవంగా జరిగిన కథను ఏ విధంగా తెరకెక్కిస్తున్నామనేది 'తండేల్' గ్లింప్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
సముద్రంలో భారీ బోటు మీద నాగ చైతన్యను పరిచయం చేశారు. 'గుర్తెట్టుకో! ఈ పాలి యేట... గురి తప్పేదెలేదేస్... ఇక రాజులమ్మ జాతరే' అంటూ శ్రీకాకుళం యాసలో చైతూ డైలాగ్ చెప్పారు. పూర్తిస్థాయిలో యాస వచ్చిందని చెప్పలేం కానీ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. పాకిస్తాన్ జైలులో పోలీసులు మత్స్యకారులను ఏ విధంగా హింసించినదీ చూపించారు.
Also Read: దేవర ఆడియో @ బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్
ఈపాలి యేట..గురి తప్పేదెలేదేస్...ఇక రాజులమ్మ జాతరే 💥💥#EssenceofThandel out now ⚓
— Geetha Arts (@GeethaArts) January 6, 2024
- https://t.co/ziOu01tjV1#Thandel shoot in progress ⛵#Dhullakotteyala 🔥
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts #AlluAravind #BunnyVas… pic.twitter.com/BvCOFYp5H1
'మానుండి ఊడిపోయిన ఓ ముక్క. మీకే అంత ఉంటే... ఆ ముక్కను ముష్టి వేసిన మాకెంత ఉండాలి', 'నీ పాకిస్తానీ అడ్డాలో కూర్చుని చెబుతున్నా... భారత్ మాతాకీ' అంటూ చైతన్య చెప్పిన డైలాగుల్లో హీరోయిజం బావుంది. గ్లింప్స్ చివరలో హీరోయిన్ సాయి పల్లవిని కూడా చూపించారు. 'బుచ్చితల్లి... వచ్చేత్తన్నా కదే! నవ్వే' అంటూ చైతూ వాయిస్ ఓవర్ మీద ఆమె నవ్వును హైలైట్ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం బావుంది.
Also Read: లవర్‌కు హ్యాండ్ ఇస్తున్న 85 శాతం అమ్మాయిలు - రీసెంట్ రీసెర్చ్ గురించి 'బేబీ' హీరో విరాజ్ అశ్విన్ ఏమన్నారంటే?
హీరోగా నాగ చైతన్య 23వ చిత్రమిది. ఈ సినిమా కోసం జుట్టు ఎక్కువ పెంచారు. ఇంకా బాడీ పరంగా కొత్తదనం చూపించడం కోసం ఫిజికల్ ట్రాన్‌ఫర్మేషన్ మీద కాన్సంట్రేట్ చేశారట. అక్కినేని నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. వాళ్ళ కలయికలో ఇది రెండో సినిమా.
Also Read: కాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?