Thaman: నిద్రలేని రాత్రిళ్లు గడిపా, ‘గుంటూరు కారం’ మూవీపై క్లారిటీ ఇచ్చిన తమన్
ఇటీవల సంగీత దర్శకుడు తమన్ పై సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న వార్తలను ఓ ఇంటర్వ్యూలో ఖండించారాయన.
Thaman: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారో గానీ మూవీ గురించి రోజుకోవార్త బయటకు వస్తూనే ఉంది. మూవీ షూటింగ్ అనుకున్న విధంగా జరగకపోవడం, మేకర్స్ కు నచ్చినట్టు కొంతమంది నటీనటులు, సాంకేతిక సిబ్బంది పనిచేయకపోవడంతో వారిని తప్పించి కొత్తవారిని పెడుతున్నారనే వార్తలు ఈ మధ్య జోరుగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్ లో చాలా మార్పులు జరిగాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తమన్ గురించి వార్తలు వస్తున్నాయి. తమన్ సినిమాకు అనుకున్న విధంగా సంగీతం అందించలేకోతున్నారని అందుకే అతన్ని తీసేసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ను పెడుతున్నారనే టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ ‘గుంటూరు కారం’ సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు.
నేను సినిమాలో లేకపోతే వాళ్లే అనౌన్స్ చేస్తారు కదా: తమన్
గత కొద్ది రోజులుగా తమన్ పై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన్ను ‘గుంటూరు కారం’ సినిమా నుంచి తప్పించారని, ఆయన ప్లేస్ లో కొత్త మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్ అవన్నీ పుకార్లు అని తేల్చి చెప్పేశారు. తాను ఆ సినిమాకు పని చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తాను సినిమాలో లేకపోతే వాళ్లే అనౌన్స్ చేస్తారు కదా అని ప్రశ్నించిన తమన్ తాను ప్రశాంతంగా పని చేసుకుంటున్నానని, అందులో ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. అనవసరపు రాతలను తాను పట్టించుకోనని, ఎన్ని చెప్పినా చివరకు మనం చేసిన పనే వాటన్నిటికి సమాధానం చెబుతుందని అన్నారు.
నిద్రలేని రాత్రుళ్లు కూడా ఉన్నాయి..
ఒక సినిమాకు బెస్ట్ సంగీతం అందించడానికి తాము అహర్నిశలు పనిచేస్తామని అన్నారు తమన్. తాను ఈ మధ్య చేసిన కొత్త సినిమాల అన్ని టీజర్లు కూడా బాగా హిట్ అయ్యాయని అన్నారు. అయితే ఒక్కో సినిమా ఒక్కో జోనర్ లో ఉంటుందని, అందుకు తగ్గట్టుగానే తాము సంగీతం అందిస్తామని అన్నారు. తాను అయితే చేసిన సినిమాలకు వందశాతం ఇస్తానని, అన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చన్నారు. తాను మాత్రం ప్రతి సినిమాకు ఎంతో కష్టపడి పని చేస్తున్నానని, ఒక్కో సినిమాకు నిద్రలేని రాత్రుళ్లు కూడా గడిపానని అన్నారు. ఏదేమైనా ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభూతి ఇవ్వడం కోసమే తాము పనిచేస్తామని, తన పని పట్ల తాను సంతృప్తిగానే ఉన్నానని వ్యాఖ్యానించారు.
ఇక ‘గుంటూరు కారం’ సినిమా మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా. ఇప్పటికే వీరిద్దరి కాంబో నుంచి ‘అతడు’, ‘ఖలేజా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అందుకే ఈ మూవీ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ మేకర్స్. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ స్థాయిలో ఈ మూవీను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి లో ఈ మూవీను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ప్రకటించారు మేకర్స్.
Also Read: ఆ దర్శకుడితో క్లోజ్‌గా జ్యోతి రాయ్ - విమర్శలపై స్పందించిన ‘గుప్పెడంత మనసు’ నటి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial