Jyothi Rai: ఆ దర్శకుడితో క్లోజ్‌గా జ్యోతి రాయ్ - విమర్శలపై స్పందించిన ‘గుప్పెడంత మనసు’ నటి
‘గుప్పెడంత మనసు’ సీరియల్ యాక్టర్ జ్యోతి రాయ్ ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా దర్శకుడు సుకుపూర్వజ్ తో రిలేషన్షిప్ లో ఉందనే వార్తలపై ఆమె తనదైన శైలిలో స్పందించింది.
Jyothi Rai: సినిమా, టీవీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై అందరికీ చాలా ఆసక్తి ఉంటుంది. వాళ్ల లైఫ్ లో ఏం జరిగినా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఓ టీవీ చానల్ లో ప్రసారమవుతోన్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో జగతి పాత్రలో నటిస్తోన్న నటి జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న జ్యోతిరాయ్.. డైరెక్టర్ సుకు పూర్వజ్ తో సన్నిహితంగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వాటిపై రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు ఆమెను నేరుగా విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా తనపై వస్తోన్న నెగిటివ్ కామెంట్లకు ధీటుగా సమాధానం చెప్పింది జ్యోతి. అంతేకాదు ఆమె తన ప్రియుడితో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మీకు అర్థంకాని దానిపై విమర్శలు చేయకండి: జ్యోతి రాయ్
జ్యోతి రాయ్ గత కొన్ని రోజులుగా దర్శకుడు సుకుపూర్వజ్ తో రిలేషన్షిప్ లో ఉందనే పుకార్లు వస్తున్నాయి. దానికి కారణం ఆమె ఆ డైరెక్టర్ తో క్లోజ్ గా దిగిన ఫోటోలను నెట్టింట షేర్ చేయడమే. దీంతో ఆమె తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. భర్త ఉండగా మరొకరితో రిలేషన్ లో ఉండటం ఏంటీ, మళ్లీ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం ఏంటీి అని మండిపడుతున్నారు నెటిజన్లు. ఈ మధ్య కాలంలో ఈ విమర్శలు ఎక్కువైపోవడంతో ఆమె స్వయంగా ట్రోలర్స్ పై స్పందించింది. ‘‘మీకు అర్థం కాని దాని గురించి విమర్శలు చేయకండి. మీరు ఎప్పటికీ నా జీవితంలోకి వచ్చి చూడలేరు’’ అంటూ పోస్ట్ చేసింది. అంతే కాదు తన ప్రియుడు, కొడుకుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీంతో ఆమె చేసిన పోస్ట్ పై నెట్టింట చర్చ నడుస్తోంది. కొంతమంది ఆమె లైఫ్ ఆమెను బతకనివ్వండి అని పాజిటివ్ గా స్పందిస్తుంటే కొంతమంది మాత్రం ఆమె తీరుపై మండిపడుతున్నారు.
20 వ ఏటలోనే పెళ్లి..
జ్యోతి రాయ్ సీరియల్స్ లో కట్టుబొట్టుతో సంప్రదాయంగా కనిపించినా.. వ్యక్తిగత జీవితంలో చాలా మోడ్రన్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో ఫొటోలు చూస్తే.. ఆమె, ఈమేనా అనే సందేహం కలగక మానదు. వాస్తవానికి జ్యోతిరాయ్ కు తన 20 ఏటలోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం అయింది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ఆమె తన భర్తకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే సుకు పూర్వజ్ తో ఆమె పరిచయం ఏర్పడింది. ఇప్పుడు ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్టింట షేర్ చేయడంతో అవి కాస్తా వివాదంగా మారాయి.
రెండో పెళ్లి అయిపోయిందా?
నటి జ్యోతి రాయ్ కు దర్శకుడు సుకు పూర్వజ్ కు పెళ్లి అయిపోయిందనే వార్త కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనికి వెనుక ఓ లాజిక్ కూడా వెతుకుతున్నారు నెటిజన్లు. అదేంటంటే.. ఇటీవల ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ప్రొఫైల్ నేమ్ ను మార్చేసింది. పాత పేరు మార్చి దానికి జ్యోతి పూర్వజ్ అని పేరు పెట్టింది. దీంతో వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారు అంటూ కామెంట్లు వస్తున్నాయి. అయితే జ్యోతి మాత్రం తమ రిలేషన్షిప్, పెళ్లి గురించి ఏమీ క్లారిటీ ఇవ్వలేదు. మరి భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: వరుణ్ తేజ్ పాన్ ఇండియా సినిమాకు టైటిల్ ఫిక్స్ - అది ఏమిటో చూశారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial