By: ABP Desam | Updated at : 24 Dec 2022 08:50 AM (IST)
'18 పేజెస్', 'కనెక్ట్', 'లాఠీ', 'ధమాకా' సినిమా స్టిల్స్
తెలుగులో ఈ ఏడాది విడుదలైన కొన్ని తమిళ, కన్నడ డబ్బింగ్ సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి. 'కెజియఫ్ 2', 'విక్రమ్', 'కాంతార' వంటి చిత్రాలు మన తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాయి. ఇయర్ ఎండ్‌లోనూ డబ్బింగ్ చిత్రాలు వచ్చాయి. అయితే, తెలుగు సినిమాల ముందు అవి నిలబడలేదు.
థియేటర్లలో ఈ వారం విడుదలైన సినిమాల్లో నయనతార నటించిన 'కనెక్ట్' ఒకటి. ఇది హారర్ థ్రిల్లర్. విశాల్ 'లాఠీ' మరొకటి. ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ రెండు తమిళ డబ్బింగ్ సినిమాలకు విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. వీటి కంటే తెలుగు సినిమాల టాక్ బావుంది.
రెండు డిజాస్టర్ల తర్వాత ఊరట
మాస్ మహారాజ రవితేజ నటించిన 'ధమాకా' (Dhamaka) శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. 'రామారావు ఆన్ డ్యూటీ', 'ఖిలాడీ' - ఈ ఏడాది రవితేజ నుంచి వచ్చిన ముందు రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. వాటితో పోలిస్తే 'ధమాకా' హిట్. రవితేజ నుంచి ఆడియన్స్ ఆశించే కామెడీ ఉండటంతో సినిమా పాస్ అయిపొయింది. 'ఇంద్ర', 'అల వైకుంఠపురములో' స్పూఫ్ సీన్లను, పాటల్లో రవితేజతో శ్రీలీల వేసిన స్టెప్పులను మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read : ధమాకా రివ్యూ: 2022ని రవితేజ హిట్టుతో ముగించాడా? థియేటర్లో ధమాకా పేలిందా? తుస్సుమందా?
'కార్తికేయ 2' సక్సెస్ కంటిన్యూ...
నిఖిల్ (Nikhil Siddhartha), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కు 2022 బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. తొలుత 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు '18 పేజెస్' (18 Pages) తో డీసెంట్ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. శుక్రవారం విడుదలైన '18 పేజెస్'కు డిఫరెంట్ నావెల్ పాయింట్‌తో రూపొందిన లవ్ స్టోరీని పేరొచ్చింది. కాకపోతే మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేసే చిత్రమిది. మాస్ ఆడియన్స్ ఈ సినిమాకు ఎంత వరకు కనెక్ట్ అవుతారనేది చూడాలి. ప్రస్తుతం వస్తున్న టాక్ పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
Also Read : '18 పేజెస్' రివ్యూ : నిఖిల్, అనుపమ నటించిన సినిమా ఎలా ఉందంటే?
సారీ నయనతార... కనెక్ట్ కాలేదు
పెళ్ళి తర్వాత భర్త విఘ్నేష్ శివన్ నిర్మాణంలో నయనతార నటించడం, ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా సినిమా కోసం ఇంటర్వ్యూ ఇవ్వడం, తనతో ఇంతకు ముందు 'మయూరి' (తమిళంలో 'మాయ') వంటి హిట్ సినిమా తీసిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నటించిన సినిమా కావడంతో 'కనెక్ట్' (Connect Movie) మీద అంచనాలు నెలకొన్నాయి. ముందుగా ప్రీమియర్ షోలు వేశారు. కానీ, సినిమాకు సరైన స్పందన రాలేదు. విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి బిలో ఏవరేజ్ టాక్ వచ్చింది.
Also Read : 'కనెక్ట్' రివ్యూ : 'కనెక్ట్' రివ్యూ : నయనతార సినిమా భయపెడుతుందా? బోర్ కొడుతుందా?
ప్రేక్షకులకు 'లాఠీ' దెబ్బలు
విశాల్ 'లాఠీ'కి అయితే ఫ్లాప్ టాక్ వచ్చింది. కానిస్టేబుల్ రోల్ గురించి గొప్పగా చేయడంతో పాటు షూటింగ్ చేసేటప్పుడు హీరోకి గాయాలు అయ్యాయనే వార్తలు 'లాఠీ' మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. తీరా విడుదలైన తర్వాత చూస్తే రెగ్యులర్ రొటీన్ సినిమా విశాల్ చేశాడని అందరూ డిజప్పాయింట్ అయ్యారు. అదీ సంగతి! థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులు తమకు లాఠీ దెబ్బలు తగిలాయని కామెంట్ చేస్తున్నారు.
Also Read : 'లాఠీ' రివ్యూ : విశాల్ కుమ్మేశాడు, రౌడీలనే కాదు ప్రేక్షకులను కూడా!
Casting Couch: రాత్రికి కాఫీకి వెళ్దాం రమ్మంది, అనుమానం వచ్చి.. - క్యాస్టింగ్ కౌచ్‌పై ‘రేసు గుర్రం’ రవి కిషన్
Desamuduru Re-release: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!
BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్ తర్వాత మూడో కెప్టెన్!