News
News
X

Nayanthara's Connect Review - 'కనెక్ట్' రివ్యూ : 'కనెక్ట్' రివ్యూ : నయనతార సినిమా భయపెడుతుందా? బోర్ కొడుతుందా?

Connect Telugu Movie Review : నయనతార ప్రధాన పాత్రలో ఆమె భర్త విఘ్నేష్ శివన్ నిర్మించిన సినిమా 'కనెక్ట్'. నయన్‌కు హిట్స్ ఇచ్చిన హారర్ జానర్‌లో వస్తున్న చిత్రమిది. ఎలా ఉందంటే?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : కనెక్ట్
రేటింగ్ : 2.25/5
నటీనటులు : నయనతార, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియా నఫిసా తదితరులు
కథ : అశ్విన్ శరవణన్, కావ్యా రామ్ కుమార్
కూర్పు : రిచర్డ్ కెవిన్
ఛాయాగ్రహణం : మణికంఠన్ కృష్ణమాచారి 
సంగీతం : పృథ్వీ చంద్రశేఖర్
నిర్మాత : విఘ్నేష్ శివన్
విడుదల : యువి క్రియేషన్స్ (తెలుగులో) 
దర్శకత్వం : అశ్విన్ శరవణన్ 
విడుదల తేదీ: డిసెంబర్ 22, 2022

నయనతార (Nayanthara) ప్రధాన పాత్రలో ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ నిర్మించిన సినిమా 'కనెక్ట్'. ఇదొక హారర్ థ్రిల్లర్. గతంలో నయనతారతో 'మాయ' (తెలుగులో 'మయూరి'), తాప్సీ పన్నుతో 'గేమ్ ఓవర్' చిత్రాలు తీసిన అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్స్ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొచ్చింది. గురువారం (డిసెంబర్ 22న) తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ (Connect Telugu Review) చదివి తెలుసుకోండి. 

కథ (Nayanthara's Connect Movie Story) : జోసెఫ్ బెనాయ్ (వినయ్ రాయ్) డాక్టర్. కోవిడ్ బారిన పడిన ప్రజలకు చికిత్స అందిస్తున్న సమయంలో అతను వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతాడు. మరణించిన తండ్రితో మాట్లాడాలని జోసెఫ్ కుమార్తె అమ్ము అలియాస్ అనా జోసెఫ్ (హనియా నఫీసా) వుయ్ జా బోర్డుతో (Ouija Board) ట్రై చేస్తుంది. అది వికటించి ఆమెను దుష్టశక్తి ఆవహిస్తుంది. కుమార్తె శరీరంలో ఆత్మ ఉందని, అమ్మాయికి దెయ్యం పట్టిందని జోసెఫ్ భార్య సుసాన్ (నయనతార) కు ఎప్పుడు తెలిసింది? అప్పుడు ఆమె ఏం చేసింది? దుష్ట ఆత్మ నుంచి అమ్మును కాపాడటం కోసం సుసాన్, ఆమె తండ్రి ఆర్థర్ (సత్యరాజ్), ఫాదర్ అగస్టీన్ (అనుపమ్ ఖేర్) ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Connect Telugu Movie Review) : 'నాన్నా అదిగో పులి' కథ తెలుసుగా... మూడోసారి పులి నిజంగా వచ్చిందని పిల్లాడు చెబితే ఎవరూ నమ్మరు. అదేంటో? హారర్ సినిమాలకు వస్తే... అటువంటి ట్రిక్ ప్రతిసారీ వర్కవుట్ అవుతుంది. రొటీన్ ఫార్మాట్, టెంప్లేట్‌లో తీసినా సరే... సేమ్ టైప్ ఆఫ్ ట్రిక్ ఎన్నిసార్లు ట్రై చేసినా... ప్రేక్షకులు భయపడతారు. స్క్రీన్ మీద దర్శకుడు చూపించింది నమ్ముతారు. బహుశా... ఆ నమ్మకంతో దర్శకుడు అశ్విన్ శరవణన్ 'కనెక్ట్' తీసినట్టు ఉన్నారు. రొటీన్ ట్రిక్ ప్లే చేయడానికి అయినా కథ ఉండాలనే సంగతి మర్చిపోయారు. 

'కనెక్ట్' చూసిన తర్వాత నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు ఈ కథకు ఎలా కనెక్ట్ అయ్యారు? అనే క్వశ్చన్ వస్తుంది. ఎక్కువ కష్టపడకుండా ఇండోర్ షూటింగ్ చేయవచ్చని నయనతార, బడ్జెట్ తక్కువ అవుతుందని నిర్మాతగా విఘ్నేష్ శివన్ ఓకే చేశారేమో!? ఎందుకంటే... సినిమాలో కథేమీ లేదు. టెక్నికల్ అవుట్‌పుట్ తప్ప! ఒక్క విషయంలో వాళ్ళిద్దరినీ మెచ్చుకోవాలి. సాధారణమైన సన్నివేశానికి స్టార్ హీరోయిన్, సూపర్ అనిపించే సినిమాటోగ్రఫీ, సంగీతం తోడైతే ప్రేక్షకులను భయపెట్టవచ్చని నిరూపించారు.

'కనెక్ట్'లో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేంత కథేమీ లేదు. ఆల్రెడీ హాలీవుడ్ సినిమాల్లో, ఆ మాటకు వస్తే కొన్ని తెలుగు సినిమాల్లో చూసేసిన హారర్ సీన్లు ఇందులో ఉన్నాయి. అయినా సరే ప్రేక్షకుల్లో కొందరు భయపడతారు. అందుకు కారణం సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ కట్స్. దెయ్యం ఎందుకు ఆవహించింది? అనే ప్రశ్నకు సినిమాలో సమాధానం దొరకదు. ఒక్క ముక్కలో, ఓ మాటలో చెప్పడం కంటే దానికి సరైన జస్టిఫికేషన్ ఇచ్చి ఉంటే... కథ మరోలా ఉండేది. తొలుత సాధారణంగా సినిమా మొదలైనా... చివరి అరగంట ఏం చేస్తారు? అని ఆసక్తిగా చూసేలా తీశారు. అనుపమ్ ఖేర్ వచ్చిన తర్వాత సినిమా గ్రాఫ్ పైకి లేచి నిలబడింది. అప్పటి వరకు పడుతూ లేస్తూ ముందుకు సాగింది.
 
నటీనటులు ఎలా చేశారంటే? : హారర్ థ్రిల్లర్ సినిమాల్లో, ముఖ్యంగా టెంప్లేట్‌లో  కథ, కథనం, సన్నివేశాలు ఉన్నప్పుడు ఆర్టిస్టులకు పెద్దగా నటించే అవకాశం ఉండదు. వాళ్ళ చుట్టూ పరిమితులు ఏర్పడతాయి. క్యారెక్టర్‌తో పాటు యాక్టింగ్ కూడా నాలుగు గోడల మధ్య బందీ అవుతుంది. 'కనెక్ట్' విషయంలో నయనతార నాలుగు గోడల మధ్య బందీ అయ్యారు. సన్నివేశాలకు అనుగుణంగా నటించారు. ఆ క్యారెక్టర్ నుంచి అంతకు మించి ఆశించడం అత్యాశే. సత్యరాజ్ ఎమోషనల్ సీన్స్‌కు పరిమితం అయ్యారు. ఆయన క్యారెక్టర్‌కు రాసిన డైలాగులు, ఆ సీన్లు మరీ రొటీన్. ఓల్డ్ కూడా! హనియా నఫీసా, అనుపమ్ ఖేర్ స్పేస్ తీసుకుని మరీ నటించారు. వాళ్ళిద్దరూ ఇంపాక్ట్ చూపించారు. 'వాన' ఫేమ్ వినయ్ రాయ్ తెరపై కనిపించేది కాసేపే!
   
Also Read : 'బీస్ట్ ఆఫ్ బెంగళూరు : ఇండియన్ ప్రిడేటర్' రివ్యూ - నెట్‌ఫ్లిక్స్‌లో బెంగళూరు కామపిశాచి ఉమేష్ రెడ్డి డాక్యుమెంటరీ

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : నయనతార డై హార్డ్ ఫ్యాన్స్ 'కనెక్ట్'కు బాగా కనెక్ట్ అవుతుంది. భయపడతామని తెలిసీ చిన్న చిన్న థ్రిల్స్ ఎంజాయ్ చేసేవారు 'కనెక్ట్' చూడటానికి థియేటర్లకు వెళ్లొచ్చు. టెక్నికల్ పరంగా చూస్తే... సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉన్నాయి. కనీసం నాలుగైదు సార్లు భయపెడతాయి. స్టోరీ, హారర్ థ్రిల్స్ పరంగా రొటీన్ హారర్ ఫార్మాట్ సినిమా 'కనెక్ట్'. 

Also Read : 'అవతార్ 2' రివ్యూ : జేమ్స్ కామెరూన్ డిజప్పాయింట్ చేశాడా? వావ్ అనిపించాడా?

Published at : 21 Dec 2022 06:33 PM (IST) Tags: ABPDesamReview Anupam Kher Sathyaraj Connect Review Telugu Nayanthara Connect Review Connect Movie Rating

సంబంధిత కథనాలు

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !