News
News
X

18 Pages Movie Review - '18 పేజెస్' రివ్యూ : నిఖిల్, అనుపమ నటించిన సినిమా ఎలా ఉందంటే?

Nikhil's 18 Pages Review In Telugu : 'కార్తికేయ 2' హిట్ తర్వాత నిఖిల్, అనుపమ జోడీగా నటించిన సినిమా '18 పేజెస్'. సుకుమార్ కథ, జీఏ2 పిక్చర్స్ నిర్మాణం కావడంతో అంచనాలు పెరిగాయి. మరి, సినిమా ఎలా ఉంది?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : 18 పేజెస్
రేటింగ్ : 3/5
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్, సరయు, దినేష్ తేజ్, అజయ్, పోసాని కృష్ణమురళి తదితరులు
కథ : సుకుమార్
రచయిత : శ్రీకాంత్ విస్సా
కూర్పు : నవీన్ నూలి
ఛాయాగ్రహణం : వసంత్ 
సంగీతం : గోపి సుందర్
సమర్పణ : అల్లు అరవింద్
నిర్మాత : 'బన్నీ' వాస్ 
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పల్నాటి సూర్య ప్రతాప్
విడుదల తేదీ: డిసెంబర్ 23, 2022

'కార్తికేయ 2'తో నిఖిల్ (Nikhil) పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. అందులో నాయికగా నటించిన అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) తో ఆయన నటించిన రెండో సినిమా '18 పేజెస్'. దీనికి సుకుమార్ కథ అందించారు. 'కుమారి 21ఎఫ్'కు దర్శకత్వం వహించిన సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. జీఏ2 పిక్చర్స్ మీద 'బన్నీ' వాస్ నిర్మించారు. 'కార్తికేయ 2' విజయం తర్వాత నిఖిల్, అనుపమ జోడీ నటించిన సినిమా కావడం... సుకుమార్, అల్లు అరవింద్ పేర్లు యాడ్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, సినిమా ఎలా ఉంది (18 Pages Review)?

కథ (18 Pages Review) : సిద్ధూ అలియాస్ సిద్ధార్థ్ (నిఖిల్) యాప్ డెవలపర్. తనను ఒక అమ్మాయి ప్రేమ పేరుతో చేట్ చేసిందని బ్రేకప్ బాధలో... మందు కొడుతూ... రోడ్ల వెంట తిరుగుతున్న సమయంలో ఓ డైరీ దొరుకుతుంది. దానిని చదువుతూ... సోషల్ మీడియాకు దూరంగా, మనుషులకు దగ్గరగా జీవించే అమ్మాయి, ఆ డైరీ రాసిన నందిని (అనుపమా పరమేశ్వరన్) తో ప్రేమలో పడతాడు. డైరీలో పేజీలు చదవడం పూర్తయ్యాక... ఆమెను నేరుగా కలవాలని ఊరు వెళతాడు. కానీ, ఊరిలో ఆమె ఉండదు. హైదరాబాద్ తిరిగొచ్చిన సిద్ధూకి ఓ కవర్ కోసం నందిని మీద అటాక్స్ జరిగాయని, చంపడానికి చూశారని తెలుస్తుంది. పేపరులో నందిని మరణించిందని న్యూస్ ఉంటుంది. అసలు, ఆ కవర్ లో ఏముంది? నిజంగా నందిని మరణించిందా? లేదా? కనీసం ముఖం కూడా చూడకుండా డైరీ చదివి ప్రేమించిన సిద్ధూ పరిస్థితి ఏంటి? చివరకు ఏమైంది? అనేది వెండితెరపై చూడాలి.   

విశ్లేషణ : '18 పేజెస్' ట్రైలర్ చూస్తే, పాటలు వింటే... ఇదొక చక్కటి ప్రేమకథ అనే ఫీల్ కలిగించింది. కానీ, సినిమాలో ప్రేమకథకు మించి ట్విస్టులు ఉన్నాయని హీరో నిఖిల్ చెప్పారు. సినిమా చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇదొక ప్రేమకథ మాత్రమే కాదు... అంతకు మించి!

'ప్రేమించడానికి మనకి ఇక రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమిస్తున్నాం? అంటే దానికి ఆన్సర్ ఉండకూడదు' అని ట్రైలర్‌లో హీరోయిన్ ఓ డైలాగ్ చెబుతుంది. ఈ సినిమా చూశాక... డైరీ చదివి అమ్మాయిని ప్రేమించడం ఏంటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే... ఆన్సర్ వెంటనే చెప్పడం కష్టం. కానీ, కొంచెం లోతుగా ఆలోచిస్తే... డైరీలో అమ్మాయి రాసినది చదివిన హీరో, ఆమె ఫిలాసఫీకి పడిపోతాడు. ఆ పాయింట్ చాలా నావెల్‌గా ఉంది.

అమ్మాయిని చూడకుండా ప్రేమించడం అనే కాన్సెప్ట్ 'ప్రేమలేఖ'లో ఉంది. ఈ మధ్య కాలంలో చూస్తే... 'గుండెజారి గల్లతయ్యిందే'లో కూడా ఉంటుంది. కానీ, ప్రేమకథకు సుకుమార్ అండ్ రైటింగ్ టీమ్ ఇచ్చిన ట్విస్టులు బావున్నాయి. ఒక వైపు ప్రేమను ఫీల్ అవుతూ... మరోవైపు చిన్న టెన్షన్‌తో నెక్స్ట్ ఏం జరుగుతుంది? అని ప్రేక్షకుడు ఫీలయ్యేలా కథను ముందుకు నడిపారు. కథ, సన్నివేశాలకు మంచి సంగీతం, సినిమాటోగ్రఫీ తోడు కావడంతో సరదాగా సినిమా సాగుతుంది. 

సినిమా ఫస్టాఫ్ హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్, పాటలు, సరదా సన్నివేశాలతో సాగింది. ఇంటర్వెల్ ట్విస్ట్ కొంచెం షాక్ ఇస్తుంది. ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ, క్లైమాక్స్ వరకు కథను నడిపిన తీరు బావుంది. లాజిక్కులు వెతుకుతూ కూర్చుంటే స్క్రీన్ మీద మేజిక్ ఎంజాయ్ చేయడం కష్టం. హీరోయిన్‌కు ఏమైందోనని హీరో వెతుకుతుంటే... చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అనిపించవచ్చు. 

'టైమ్ ఇవ్వు పిల్లా...' సాంగ్ క్యాచీగా ఉంది. 'నిదురన్నది లేదే ఓ పిల్లా నీ వల్ల...', 'నన్నయ్య రాసిన...' పాటల్లో సాహిత్యం సన్నివేశాలకు తగ్గట్టు ఉంది. కెమెరా వర్క్ చాలా నీట్‌గా ఉంది.  

నటీనటులు ఎలా చేశారంటే? : నిఖిల్ కొత్తగా కనిపించాడు. ఆయన క్యారెక్టర్ మన పక్కింటి కుర్రాడిలా, మన ఆఫీసులో పని చేసే కొలీగ్‌గా ఉంటుంది. సిద్ధూ పాత్రలో జీవించాడు. స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన ఈ తరం యువతకు  అనుపమా పరమేశ్వరన్‌ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. మనమూ అలా ఉంటే బావుంటుందని అనిపిస్తుంది. అంత చక్కగా ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు. అనుపమ కూడా చక్కగా నటించారు. హీరో స్నేహితురాలిగా సరయుకు పంచ్ డైలాగ్స్ వేసే ఛాన్స్ వచ్చింది. ఆమె కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తారు. పోసాని కృష్ణమురళి, అజయ్, దినేష్ తేజ్ పాత్రల పరిధి సినిమాలో తక్కువే. ఉన్నంతలో వాళ్ళు చక్కగా నటించారు. 

Also Read : 'లాఠీ' రివ్యూ : విశాల్ కుమ్మేశాడు, రౌడీలనే కాదు ప్రేక్షకులను కూడా!

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : ఈతరం ప్రేమకథలకు భిన్నమైన కథతో '18 పేజెస్' రూపొందింది. ప్రేమకథ, థ్రిల్లింగ్ నేరేషన్  మధ్య మిక్సింగ్ కరెక్టుగా కుదిరింది. సూర్యప్రతాప్ డైరెక్షన్ డీసెంట్‌గా ఉంది. నిఖిల్, అనుపమ జోడీకి తోడు గోపీసుందర్ హిట్ & క్యాచీ సాంగ్స్, నేపథ్య సంగీతం స్క్రీన్ మీద మేజిక్ చేశాయి. వీకెండ్ హ్యాపీగా టైమ్‌పాస్ చేయొచ్చు. సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్న యువతకు, వృద్ధులను విస్మరిస్తున్న తల్లిదండ్రులకు చక్కటి సందేశం ఇస్తుంది. సినిమాలో బ్యూటీ ఏంటంటే... హీరో హీరోయిన్లు ఎక్కడా కలవకపోయినా వాళ్ళ ప్రేమను మనం ఫీల్ అవుతాం. హృదయానికి హత్తుకునే చక్కటి సంగీత భరిత ప్రేమకథా చిత్రమిది. 

Also Read : 'కనెక్ట్' రివ్యూ : 'కనెక్ట్' రివ్యూ : నయనతార సినిమా భయపెడుతుందా? బోర్ కొడుతుందా?

Published at : 23 Dec 2022 11:50 AM (IST) Tags: tollywood movies Anupama Parameswaran 18 Pages ABPDesamReview Nikhil Siddhartha

సంబంధిత కథనాలు

Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?

Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?

Siri Hanmanth Emotional: షర్ట్‌పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్

Siri Hanmanth Emotional: షర్ట్‌పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..

సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

టాప్ స్టోరీస్

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్  !

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!

PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ

PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ