News
News
వీడియోలు ఆటలు
X

Ajith Kumar: హీరో అజీత్ అస్సలు సెల్‌ఫోనే వాడరట - ఆయనతో మాట్లాడాలంటే ఏం చేయాలో తెలుసా?

తమిళ స్టార్ హీరో అజిత్ ఇప్పటికీ సెల్ ఫోన్ వినియోగించరు. ఏ విషయం అయినా, తన మేనేజర్ ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. అజిత్ కు ఏ విషయం చెప్పాలన్నా, ఆయన మేనేజర్ ద్వారా వెళ్లాల్సిందే!

FOLLOW US: 
Share:

కొద్ది రోజుల క్రితం అందాల తార ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో యాంకర్ ఓ ప్రశ్న అడుగుతుంది. హీరో అజిత్ ఫోన్ నెంబర్ మీ సెల్ ఫోన్ లో ఏమని సేవ్ చేసుకున్నారు? అని. దానికి త్రిష చెప్పిన సమాధానం విని యాంకర్ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే, ఆయనకు సెల్ ఫోన్ ఉపయోగించడం ఇష్టం ఉండదని త్రిష చెప్పింది. అందుకే తన ఫోన్ నెంబర్ నా సెల్ ఫోన్ లో సేవ్ చేసుకోలేదు అని పేర్కొంది.

సెల్ ఫోన్ వినియోగించని అజిత్, మరి సంప్రదింపులు?

అవును, త్రిష చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. అజిత్ కుమార్ సెల్ ఫోన్ ఉపయోగించరు. అయితే, ఆయన అభిమానులు, తోటి సినీ ప్రముఖులతో ఎలా టచ్ లో ఉంటారని అందరికీ ఓ ప్రశ్న తలెత్తే అవకాశం ఉంటుంది. నిజానికి ఆయన సెల్ ఫోన్ వినియోగించరు. కానీ, సినిమాలకు సంబంధించిన విషయాలు, తన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన మేనేజర్ ద్వారానే తెలుసుకుంటారు.  ఏ విషయం అయినా, అజిత్ కు మేనేజర్ మాత్రమే చెప్తారు. అంతేకాదు, ఆయన ఎవరితో సినిమా చేసినా, సినిమా ప్రారంభానికి ముందు సదరు నిర్మాణ సంస్థ నుంచి ఓ సిమ్ కార్డు తీసుకుంటారు. ఆ సిమ్ కార్డును సెల్ ఫోన్ లో వేసి తన మేనేజర్ దగ్గర ఉంచుతారు. దానిని ఆ సినిమా వరకు మాత్రమే  వినియోగిస్తారు. సినిమా విషయంలో ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సినిమా అయిపోయాక, ఆ సిమ్ కార్డును సెల్ ఫోన్ నుంచి తొలగిస్తారు.

సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు!

సోషల్ మీడియాలోనూ అజిత్ కుమార్ కు అఫీషియల్ అకౌంట్స్ లేవు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో ఖాతా కూడా లేదు. ఆయన ఏమైనా ముఖ్యమైన ప్రకటనలు చేయాలి అనుకున్నప్పుడు తన ప్రతినిధి సురేష్ చంద్ర ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తారు. ఆయన సంతకం చేసిన ప్రకటనను సురేష్ ట్విట్టర్ ద్వారా  అభిమానులతో పంచుకుంటారు. సూపర్ స్టార్ గా కొనసాగుతున్న అజిత్ సెల్ ఫోన్ వాడరు, సోషల్ మీడియా వినియోగించరు అని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఆయనలా ఈ రోజుల్లో ఉండటం చాలా మందికి సాధ్యం కాదని అంటున్నారు. ప్రస్తుతం అజీత్ భార్య షాలినీ మాత్రమే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అప్పుడప్పుడు ఆయన అప్‌డేట్స్ ఇస్తుంటారు.

లైకా ప్రొడక్షన్ లో అజిత్ తదుపరి మూవీ

ఇక అజిత్ కు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి, మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన 'తునివు' సినిమాతో అలరించాడు. అజిత్ తదుపరి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ లో చేయనున్నారు. ఈ మూవీ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేయాల్సి ఉండగా.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం మగిజ్ తిరుమేని డైరెక్షన్ లో AK62 మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.  

Read Also: లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు, అజిత్ లైఫ్ స్టైల్ చూస్తే ఆశ్యర్చపోవాల్సిందే!

Published at : 01 May 2023 05:49 PM (IST) Tags: Tamil Hero Ajith Kumar Ajith Kumar Mobile Phone Ajith Kumar Social Media

సంబంధిత కథనాలు

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్ 

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్

మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్

Samantha Workout Video : షాక్ ఇచ్చిన సమంత - వందకు తగ్గేదే లే!

Samantha Workout Video : షాక్ ఇచ్చిన సమంత - వందకు తగ్గేదే లే!

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Guppedanta Manasu June 7th: వసుధార మాట వినిపించి పరుగుతీసిన రిషి, కాలేజీలో వసుకి బెదిరింపులు!

Guppedanta Manasu June 7th:  వసుధార మాట వినిపించి పరుగుతీసిన రిషి, కాలేజీలో వసుకి బెదిరింపులు!

టాప్ స్టోరీస్

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్‌ షోకి కూడా ప్లాన్!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!

TTD News: నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ, అట్టహాసంగా జరిగిన వేడుక

TTD News: నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ, అట్టహాసంగా జరిగిన వేడుక

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్