X
Super 12 - Match 17 - 25 Oct 2021, Mon up next
AFG
vs
SCO
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Arya 3 update: ‘ఆర్య 3’లో కొత్త లుక్‌లో అల్లు అర్జున్.. మరింత స్టైలిష్‌గా బన్నీ

ఆర్య-3లో అల్లు అర్జున్‌ను భిన్నంగా కనిపిస్తారట. సుకుమార్ ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రీప్ట్ తయారీలో బిజీగా ఉన్నారు. ‘పుష్ప-2’ షూటింగ్ పూర్తికాగానే.. ఈ ప్రాజెక్ట్ తెరపైకి ఎక్కుతుంది.

FOLLOW US: 

ల్లు అర్జున్, సుకుమార్ చిత్రమంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. వీరి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ కోసం బన్నీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నిడివి పెద్దది కావడంతో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప-1’ సినిమాను డిసెంబరు 17న విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇది పూర్తికాగానే సుకుమార్‌తో ‘ఆర్య-3’ కథను సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. ఇటీవల లైవ్ చాట్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధమవుతోందని, త్వరలోనే అప్‌డేట్ చెబుతానని సుకుమార్ తెలిపారు. 

‘పుష్ప’లో బన్నీ విభిన్న పాత్రలో ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్య-3’లో మాత్రం పూర్తి భిన్నంగా బన్నీ లుక్ ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ‘ఆర్య’ చిత్రానికి ‘ఆర్య-2’లో అల్లు అర్జున్‌కు చాలా తేడా ఉంటుంది. ‘ఆర్య-2’లో నెగటీవ్ షేడ్స్ ఉన్న హీరోగా చాలా భిన్నంగా అల్లు అర్జున్‌ను చూపించారు. హెయిర్ స్టైల్ కూడా చాలా కొత్తగా ఉండటంతో బన్నీ చాలా స్టైలిష్‌గా కనిపించారు. అయితే, ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోయినా.. బన్నీ నటన, పాటలు, డ్యాన్స్.. అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి. ‘ఆర్య-3’లో భిన్నంగా కనిపిస్తాడని తెలుస్తోంది. ‘పుష్ప-2’ షూట్ పూర్తికాగానే కాస్త గ్యాప్ ఇచ్చి ‘ఆర్య-3’ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. అయితే, ఈ చిత్రంలో బన్నీ సరసన ఎవరు నటిస్తారనే వివరాలేవీ తెలియరాలేదు. 

Pushpa Update: పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ‘పుష్ప’లో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత బన్నీ- సుకుమార్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'పుష్ప' పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేయబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించారు మేకర్స్. ఫస్టు పార్టుకు సంబంధించిన చిత్రీకరణ 90 శాతం వరకూ పూర్తి చేశారు. మిగతా 10 శాతం చిత్రీకరణలో ఈ సినిమా టీమ్ బిజీగా ఉంది. వాస్తవానికి సెప్టెంబర్లోనే అదికూడా పూర్తికావాల్సి ఉన్నప్పటికీ ఇటీవల వర్షాల కారణంగా ఆలస్యమైంది.  

Also read:  నా రాజీనా'మా' వెనుక లోతైన అర్థం ఉంది, త్వరలోనే చెబుతా అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్..
Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Allu Arjun Pushpa Sukumar అల్లు అర్జున్ Arya 3 Arya 3 update Pushpa 2 ఆర్య 3

సంబంధిత కథనాలు

Prabhas: ప్రభాస్-పూజాహెగ్డేల మధ్య గొడవ.. నిజమేనట.. 

Prabhas: ప్రభాస్-పూజాహెగ్డేల మధ్య గొడవ.. నిజమేనట.. 

Pushpa 3rd Song: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి

Pushpa 3rd Song: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి

Mani Sharma: సింగర్‌ను వివాహమాడిన మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్

Mani Sharma: సింగర్‌ను వివాహమాడిన మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్

67th National Film Awards Winners List: జాతీయ పురస్కార విజేతలు... బాధ్యత పెంచిందన్న 'మహర్షి' దర్శకుడు

67th National Film Awards Winners List: జాతీయ పురస్కార విజేతలు... బాధ్యత పెంచిందన్న 'మహర్షి' దర్శకుడు

Dadasaheb Phalke Award: బస్ డ్రైవర్ నుండి బాలచందర్ వరకూ... తమిళ ప్రజలనూ... రజనీకాంత్ ఎవ్వర్నీ మరువలేదు!

Dadasaheb Phalke Award: బస్ డ్రైవర్ నుండి బాలచందర్ వరకూ... తమిళ ప్రజలనూ... రజనీకాంత్ ఎవ్వర్నీ మరువలేదు!
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Disha Case : ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !

Disha Case :   ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !

ICC T20 WC 2021, IND vs PAK: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?

ICC T20 WC 2021, IND vs PAK: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?

Income Tax Notice: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!

Income Tax Notice: సామాన్యుడికి ఐటీ శాఖ భారీ షాక్... నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు, ఏం జరిగిందంటే!

Huzurabad KCR : ప్లీనరీ నుంచే కేసీఆర్ హుజురాబాద్ ప్రచారం ! ఎన్నికల సంఘంపై ఆగ్రహం వెనుక అసలు కారణం..

Huzurabad KCR : ప్లీనరీ నుంచే కేసీఆర్ హుజురాబాద్ ప్రచారం ! ఎన్నికల సంఘంపై ఆగ్రహం వెనుక అసలు కారణం..