Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరికి నువ్వు కన్నతల్లివేనా? సహస్ర మీద విహారి ఫైర్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 4th: సిరికి జ్వరం రావడం సహస్ర పట్టించుకోకుండా పార్టీలకు వెళ్లడం విహారి సహస్రని కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(నవంబరు 4న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మహా అడ్డు వస్తుంది..
అంబిక సుభాష్‌కి కాల్ చేసి నాకు ఏం చెప్పావ్ ఏం అయింది అని అడుగుతుంది. మేం పక్కా ప్లాన్ చేసుకున్నాం కానీ మహా మొత్తం చెడగొట్టేసింది.. తనని కూడా డైవర్ట్ చేశాం కానీ వచ్చేసింది తన గురించి నీకు ముందే హెచ్చరించా అని సుభాష్ అంటాడు. దానికి అంబిక ముందు ఆ మహాకి స్కెచ్ వేయాలి అని అంటుంది. ఇంతలో పాత ఫోన్ మళ్లీ మోగుతుంది. అంబిక కంగారు పడి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు ఎవరు అని అడుగుతుంది. అటు నుంచి ఎవరూ మాట్లాడకపోవడంతో ఫోన్ కిందకి విసిరి పోగొడుతుంది. అందరూ వచ్చి ఫోన్ చూసి ఏమైంది అని అడుగుతారు.
బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు..
విహారి అంబికతో ఏమైంది అత్తయ్యా ఎందుకు ఆ ఫోన్ పగల గొట్టేశావ్,. అది ఇప్పటి ఫోన్ కూడా కాదు కదా అని అడుగుతాడు. దానికి అంబిక కవర్ చేస్తూ ఎవరో ఫోన్ చేసి తనని బెదిరించారని ఇప్పటి వరకు విహారి టార్గెట్ ఇక నుంచి నేను టార్గెట్ అని చెప్తున్నారు. కోపంలో ఇలా విసిరేశా అంటుంది. విహారి ఇదంతా చూసుకుంటా మీరేం టెన్షన్ పడొద్దు అని అంటాడు. ఇక అందరినీ పడుకోమని చెప్తాడు. సహస్ర ఇంకా రాలేదు అని పద్మాక్షి అంటే సహస్ర వచ్చే సరికి టైం పడుతుంది మీరు పడుకోండి అని విహారి అంటాడు. పద్మాక్షి సహస్రకి ఫోన్ చేస్తూనే ఉంటుంది కానీ సహస్ర లిఫ్ట్ చేయదు. విహారి దాని మీద కోపంగా ఉన్నాడు.. ఎంత చెప్పినా దానికి అర్థం కావడం లేదు అని పద్మాక్షి అనుకుంటుంది.
సిరికి ఫీవర్..
మహా, యమున, పండు భోజనాలు రెడీ చేస్తారు. మహా సిరి, క్రిష్‌ని పిలవడానికి వెళ్తూ సిరికి ఫీవర్ వచ్చిందని కంగారుగా తడి బట్ట పెట్టడానికి కిందకి వచ్చి మళ్లీ వెళ్తుంది. కింద అందరూ చూసి ఏమైందని అడిగితే సిరికి ఫీవర్ అని చెప్తుంది. సహస్ర ఎక్కడుంది ఇంకా రాలేదా అని విహారి అడుగుతాడు. లేదు అని పద్మాక్షి అంటుంది. మహా దగ్గరుండి సిరిని చూసుకుంటుంది. విహారి సహస్రకి చాలా సార్లు ఫోన్ చేస్తాడు. సహస్ర పార్టీలో ఫ్రెండ్స్‌తో మందు కొడుతూ ఫోన్ లిఫ్ట్ చేయదు. పార్టీలో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటుంది.
జ్వరమే కదా చావలేదు కదా..
అర్ధరాత్రి సహస్ర ఇంటికి వస్తుంది. ఫోన్ చూసి ఇన్ని మిస్సిడ్ కాల్స్ ఉన్నాయి ఎవరూ చూడకుండా వెళ్లిపోవాలి తెల్లారి చూసుకోవచ్చు అని గదిలోకి మెల్లగా వెళ్తుంది. గదిలోకి వెళ్లి సహస్ర లైట్ వేసే సరికి అక్కడ విహారి కూర్చొని ఉంటాడు. సహస్ర షాక్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్లావ్.. అర్థరాత్రి అయింది.. సిరికి ఫుల్ ఫీవర్ అని అంటే మా ఫ్రెండ్స్ పిలిచారుఅని అంటుంది. గుడిలో పూజలకు నీ కాలు నొప్పి పార్టీలకు వెళ్లడానికి ఏం నొప్పులు లేవా అని అరుస్తాడు. దాంతో యమున, మహా అక్కడికి వస్తారు. సిరిని చూసుకోకుండా వెళ్లాలా.. పాప కోసం ఒక్క రోజు కూడా ఉండవా., కన్న కూతురు ఇలా ఉంటే నీకు ఏ బాధ లేదా అని విహారి అంటే దానికి సహస్ర సిరికి ఇప్పుడేమైంది జ్వరమే కదా.. చావలేదు కదా అని సహస్ర అంటుంది. విహారి లాగి పెట్టి కొట్టి ఆ మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది.. నువ్వు తల్లి వేనా.. సిరి నీకు పుట్టిన బిడ్డేనా అని అడుగుతాడు. పద్మాక్షి కూడా ఆ మాటకి లాగిపెట్టి కొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు






















