'యానిమల్', 'అర్జున్ రెడ్డి' వంటి తన సినిమాల్లోని హింసాత్మక సన్నివేశాల వల్ల రాప్తాడు లాంటి ఘటనలు జరుగుతున్నాయని, యువతపై చెడు ప్రభావం పడుతోందని కొందరు సందీప్ రెడ్డి వంగాను విమర్శిస్తున్నారు.
Sandeep Reddy Vanga On Raptadu Case: రాప్తాడు ఘటనపై సందీప్ రెడ్డి వంగా రియాక్షన్... సినిమాలను టార్గెట్ చేయవద్దు
Sandeep Reddy Vanga Reacts To Rapthadu Crime: సినిమాలను బలిపశువును చేయవద్దని రాప్తాడు ఘటనపై సందీప్ రెడ్డి వంగా స్పందించారు. విమర్శలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

- అనంతపురం రాప్తాడు ఘటనపై వంగా సినిమాలపై విమర్శలు.
- నేరాలకు సినిమాలను బలిపశువు చేయవద్దని వంగా స్పష్టం.
- వ్యక్తిగత కక్షలకు విషాదాలను వాడుకుంటున్నారని వంగా ధ్వజం.
- సానుభూతి, అవకాశవాదం మధ్య తేడాను గుర్తించాలని వంగా సూచన.
ఏపీలోని అనంతపురం జిల్లాలో గల రాప్తాడు (Raptadu School Incident)లో చోటు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)ను కొందరు టార్గెట్ చేశారు. రణబీర్ కపూర్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'యానిమల్'లో కాలేజీకి గన్ తీసుకు వెళతాడు హీరో. ఆ సన్నివేశంలో రణబీర్ కపూర్ స్కూల్ స్టూడెంట్‌గా కనిపిస్తారు. 'అర్జున్ రెడ్డి'లో తన ప్రేయసిని కామెంట్ చేశారని కాలేజీలో ఇతర విద్యార్థులను హీరో విజయ్ దేవరకొండ కొడతారు.
సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు సినిమాల్లో చూపించే మితిమీరిన హింసాత్మక సన్నివేశాల వల్ల సమాజంలో రాప్తాడు వంటి అమానుష ఘటనలు, ఇంకా నేరాలు జరుగుతున్నాయని, యువతపై అటువంటి సినిమాలు ప్రభావం చూపుతున్నాయని కొందరు ట్రోలింగ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ అటువంటి ట్రోలింగ్ మీద ట్వీట్ చేశారు. ఇప్పుడు తనను, తన సినిమాలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ట్రోల్స్, విమర్శలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. విమర్శకులకు ఘాటుగా బదులు ఇచ్చారు.
సినిమాలను బలి పశువు చేయవద్దు
Sandeep Reddy Vanga X Post On Rapthadu Case: ఎక్కడైనా దారుణం లేదా నేరం జరిగినప్పుడు సమాజం స్పందించాల్సిన తీరు ఇది కాదని సందీప్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. ఎవరో ఒకరు భయంకరమైన నేరానికి పాల్పడినప్పుడు... ఒకరికి అన్యాయం జరిగినప్పుడు... బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడం, అసలు సమస్య మూలాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మన మొదటి కర్తవ్యం అవ్వాలని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు. అంతే గానీ ప్రతిసారీ సినిమాలను బలి పశువు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శలకు ఆయన హితవు పలికారు.
Also Read: Srinath Maganti - శ్రీనాథ్ మాగంటి బెటరా? సుశాంతే బాగా చేశాడా? 'ఈఎన్ఈ 2' ట్రైలర్‌తో డిస్కషన్ షురూ
విమర్శకుల ఆందోళన బాధితులు లేదా వారి కుటుంబాల గురించి కాదని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. విషాదాన్ని అడ్డు పెట్టుకుని తమ వ్యక్తిగత కక్షలను - పాత గొడవలను తీర్చుకోవడానికి కొందరు అవకాశంగా మలుచుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. చిత్ర పరిశ్రమలో సరైన పని పాట లేక, నిరాశ నిస్పృహల్లో ఉన్న కొందరు నటీనటులు, దర్శక నిర్మాతలు పరాన్నజీవులుగా మారారని సందీప్ రెడ్డి వంగా ఘాటుగా విరుచుకుపడ్డారు. ఇతరుల కష్టాన్ని కించపరచడానికి లేదా విమర్శించడానికి అవకాశం దొరుకుతుందేమోనని ఆ పరాన్నజీవులు వేచి చూస్తుంటారని ఆయన మండిపడ్డారు. సమాజంలో విషాదాలు జరిగినప్పుడు గొప్ప సామాజిక సంస్కర్తల తరహాలో నీతులు చెబుతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
When someone commits a heinous crime, the first response should be empathy & an attempt to understand the larger problem. Not finding a convenient scapegoat in cinema. It is becoming increasingly clear that your concern is not for the victims or their families, but that you're using a horrific tragedy as a dirty excuse to settle your personal scores. This is especially directed at those failed frustrated jobless male/female actors, few directors, producers & parasites, who suddenly appoint themselves as social reformers whenever an opportunity arises to take a dig at someone else's work. A tragedy deserves empathy 🙏, not opportunism. Learn the difference.
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 4, 2026
సానుభూతికి, అవకాశవాదానికి మధ్య తేడాను గుర్తించండి!
విషాదం జరిగినప్పుడు బాధితుల పట్ల సానుభూతి చూపించడం మానేసి... ఇలాంటి సంకుచిత అవకాశవాదాన్ని చూపించే వ్యక్తులు ఉంటారని... దయచేసి సానుభూతి - అవకాశవాదం మధ్య తేడాను గుర్తించాలని విమర్శకుల ద్వంద్వ వైఖరిని సందీప్ రెడ్డి వంగా ఎండగట్టారు. అదీ సంగతి.
Also Read: Ramayana Vs Scene - బుకింగ్స్‌లో 'రామాయణ' ఎదురీత... సూర్య 'సీన్' సేల్స్ ఎక్కువ
Frequently Asked Questions
సందీప్ రెడ్డి వంగాను ఎందుకు విమర్శిస్తున్నారు?
తనపై వచ్చిన విమర్శలకు సందీప్ రెడ్డి వంగా ఎలా స్పందించారు?
సందీప్ రెడ్డి వంగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, సినిమాలను బలి పశువు చేయవద్దని అన్నారు. బాధితుల పట్ల సానుభూతి చూపించి, సమస్య మూలాలను అర్థం చేసుకోవాలని ఆయన హితవు పలికారు.
విమర్శకుల ఉద్దేశాలపై సందీప్ రెడ్డి వంగా ఏమన్నారు?
కొందరు విషాదాలను తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి అవకాశంగా వాడుకుంటున్నారని సందీప్ రెడ్డి వంగా ఆరోపించారు. చిత్ర పరిశ్రమలోని పరాన్నజీవులు ఇతరుల కష్టాన్ని విమర్శించడానికి ఎదురు చూస్తారని ఆయన అన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















