Mohan Babu: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
తాజాగా మంచు విష్ణు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
'మా' ఎన్నికల్లో మంచు విష్ణు విజయం వెనుక ఓ రకంగా మోహన్ బాబు కూడా ఉన్నారనే చెప్పాలి. ఇండస్ట్రీ పెద్దల సపోర్ట్ విష్ణుకి దక్కేలా చూశారు మోహన్ బాబు. అలానే దాదాపు 700 మంది 'మా' మెంబర్స్ కి ఫోన్లు చేసి మరీ మాట్లాడారు. ఇప్పుడు తన కొడుకు అధ్యక్షుడిగా గెలవడంతో మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు.
Also Read: 'నన్ను ఎలెక్షన్స్ నుంచి సైడైపోమని చెప్పిందే చిరంజీవి అంకుల్..' మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..
''ఏదైనా భగవంతుడి నిర్ణయం.. కాలం నిర్ణయిస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో అధ్యక్షుడిగా 17 ఏళ్ల క్రితం అక్టోబర్ 10నే ఎన్నికయ్యాను. ఇది అందరి విజయం. నేను మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయ్ చెప్పడానికి.. సింహం నాలుగు అడుగులు వెనక్కు వేసింది అంటే ముందుకు దూకడానికే.. నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. మౌనంగా ఉన్నానని అసమర్దుడిని కాదు. ప్రతీదానికి మౌనంగా ఉండాలట.. ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే చెప్పాలి. ఇప్పుడు నా కొడుకు అందరి సహాయసహకారాలతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఒక ఈవెంట్ లో ఉన్నప్పుడు దాని గురించే మాట్లాడాలి. అంతేకానీ.. వేదిక దొరికింది కదా అని ఇష్టమొచ్చినట్లు నోరు జారడం కరెక్ట్ కాదు. రోజురోజుకి వయసొచ్చే సరికి ఆలోచనతో మాట్లాడాలి. మీడియా ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు..'' అంటూ పరోక్షంగా చిరంజీవిపై సెటైర్ వేశారు.
ముఖ్యమంత్రుల సహాయం, సహకారం లేకపోతే 'మా' ముందుకెళ్లడం కష్టమని.. కేసీఆర్, జగన్ ఇలా ముఖ్యమంత్రులను కనీసం పిలిచి గతంలో ఎప్పుడూ సన్మానించలేదు.. ముందు వాళ్లను గౌరవించి, సన్మానించడం నేర్చుకోవాలి. మనం సాయం కోరితే వాళ్లు చేయనంటారా..? అని ప్రశ్నించారు.
Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Also Read: మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా.. తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు!
Also Read: ‘మా’ మంచు విష్ణు విజయంపై సెలబ్రెటీల ట్వీట్స్.. అప్పుడు మాట్లాడలేదు.. ఇప్పుడు..
Also Read: అక్టోబరు 10 మంచు ఫ్యామిలీకి కలిసొచ్చిందా..అప్పుడు మోహన్ బాబు ఇప్పుడు మంచు విష్ణు..హిస్టరీ రిపీట్
Also Read: ‘మా’ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ రాంగ్ ఛాయిస్? చిరు - మోహన్ బాబు విభేదాలే రచ్చకు కారణమయ్యాయా?
Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి