MAA Election Result: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరెవరు గెలించారు? ఎవరెవరు ఓటమి చవి చూశారు? పెద్ద తారల పరిస్థితి ఏమిటీ?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు, ఆయన ప్యానల్‌కు చెందిన పలువురు సభ్యులు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘మా’లో మొత్తం 925 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 635 మంది ఓటేశారు. 52 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన మంచు విష్ణుకు 381 ఓట్లు లభించగా, ప్రకాష్ రాజ్‌కు 274 ఓట్లు లభించాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన జీవిత రాజశేఖర్‌కు 313 ఓట్లు లభించగా.. ఆమెపై మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీకి నిలిచిన రఘుబాబు 340 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీచేసిన శ్రీకాంత్ 375 ఓట్లతో గెలిచారు. ఆయన ప్రత్యర్థి మోహన్ బాబుకు 269 ఓట్లు లభించాయి. విష్ణు ప్యానల్ నుంచి ట్రెజరర్‌గా పోటీ చేసిన శివబాలాజీ 359 ఓట్లతో విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి నాగినీడుకు 292 ఓట్లు లభించాయి.
‘హేమా’హేమీలకు తప్పని ఓటమి: ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఉపాధ్యక్షులుగా పోటీ చేసిన హేమా, బెనర్జీలకు ఓటమి తప్పలేదు. విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేసిన కరాటే కళ్యాణికీ ఓటమి తప్పలేదు. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు చెందిన అనసూయ, కౌశిక్, శివారెడ్డి, సురేష్ కొండేటి, బ్రహ్మజీలు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా విజయం సాధించారు. సమయం మించి పోవడంతో ఆదివారం ప్రధాన పదవులకు పోలైన ఓట్లు మాత్రమే లెక్కించారు. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో ఎవరెవరు గెలిచారు? ఎవరెవరు ఓటమి చవిచూశారనేది ఈ కింది జాబితాలో చూడగలరు. ఫలితం రావాల్సిన అభ్యర్థులకు ‘పెండింగ్*’ అని సూచించాం.
మంచు విష్ణు ప్యానల్‌లో..:
⦿ మంచు విష్ణు - అధ్యక్షుడు (గెలుపు)
⦿ రఘుబాబు - జనరల్ సెక్రటరీ (గెలుపు)
⦿ బాబు మోహన్ - ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - (ఓటమి)
⦿ మాదాల రవి - వైస్ ప్రెసిడెంట్ (గెలుపు)
⦿ పృథ్వీరాజ్ బాలిరెడ్డి - వైస్ ప్రెసిడెంట్ (పెండింగ్*)
⦿ శివబాలాజీ - ట్రెజరర్ (గెలుపు)
⦿ కరాటే కల్యాణి -జాయింట్ సెక్రటరీ - (ఓటమి)
⦿ గౌతమ్ రాజు-జాయింట్ సెక్రటరీ(పెండింగ్*)
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అర్చన (ఓటమి), అశోక్ కుమార్(గెలుపు), గీతాసింగ్(గెలుపు), హరినాథ్ బాబు(గెలుపు), జయవాణి(ఓటమి), మలక్ పేట్ శైలజ(ఓటమి), మాణిక్(గెలుపు ), పూజిత(ఓటమి), రాజేశ్వరి రెడ్డి(ఓటమి), రేఖా(ఓటమి), సంపూర్ణేష్ బాబు(గెలుపు), శశాంక్(గెలుపు), శివనారాయణ(గెలుపు), శ్రీలక్ష్మి(గెలుపు), శ్రీనివాసులు(గెలుపు), స్వర్ణ మాధురి(ఓటమి), విష్ణు బొప్పన(గెలుపు), వడ్లపట్ల ఎమ్ఆర్సి(ఓటమి).
ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో..:
⦿ అధ్యక్షుడు: ప్రకాశ్‌రాజ్ (ఓటమి)
⦿ జనరల్ సెక్రటరీ: జీవితా రాజశేఖర్ (ఓటమి)
⦿ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్(గెలుపు)
⦿ ట్రెజరర్ : నాగినీడు (ఓటమి)
⦿ జాయింట్ సెక్రటరీ: అనితా చౌదరి(పెండింగ్*), ఉత్తేజ్ (గెలుపు)
⦿ ఉపాధ్యక్షుడు: బెనర్జీ(ఓటమి), హేమ (ఓటమి)
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అనసూయ (ఓటమి), అజయ్(ఓటమి), భూపాల్(ఓటమి), బ్రహ్మాజీ(గెలుపు), ప్రభాకర్(గెలుపు), గోవింద రావు(ఓటమి), ఖయూమ్(ఓటమి), కౌశిక్(గెలుపు), ప్రగతి(ఓటమి), రమణా రెడ్డి(ఓటమి), శివా రెడ్డి(గెలుపు), సమీర్(గెలుపు), సుడిగాలి సుధీర్(గెలుపు), సుబ్బరాజు. డి(ఓటమి), సురేష్ కొండేటి(గెలుపు), తనీష్(గెలుపు), టార్జాన్(ఓటమి).
Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. విష్ణు విజయానికి కారణాలివే.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..
Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే..
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి