By: ABP Desam | Updated at : 11 Oct 2021 10:34 AM (IST)
Edited By: RamaLakshmibai
మంచు విష్ణు
‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘనవిజయం సాధించారు. మంచు విష్ణుకు 381 ఓట్లు పోలవ్వగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పడ్డాయి. విజేతలను ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రకటించారు. ‘‘925 మంది సభ్యులున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో 883 ఓటర్లు ఉండగా 665 మంది ఓట్లు వేశారు (52 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు). ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ గెలుపొందారు. గెలుపొందిన మిగిలిన సభ్యుల వివరాలు కాసేపట్లో వెల్లడికానున్నాయి. ఘన విజయాన్ని అందించిన అందరికీ మంచు విష్ణు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశ్‌రాజ్‌గారు అంటే తనకి చాలా ఇష్టం అన్న విష్ణు..నరేశ్ సహా తనకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆ ప్యానల్, ఈ ప్యానల్ అంటూ లేదు. అందరం ఒకటే కుటుంబం. రెండు నెలలుగా నరకం అనుభవిస్తున్న ఫీలింగ్ కలిగింది. ‘మా’ లో ఇలాంటి పరిణామాలు ఇంకెప్పుడూ జరగకూడదు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘తెలుగు బిడ్డ గెలిచాడు. విష్ణు మంచుకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు ప్రకాశ్‌రాజ్. ఈ సందర్భంగా మంచు విష్ణుకి కంగ్రాట్స్ చెబుతూ సెలబ్రెటీలు ట్వీట్స్ చేస్తున్నారు. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి.
Hearty Congratulations to the new President of MAA @iVishnuManchu Exec.Vice President @actorsrikanth & each and every winner of the New Body of our MAA family# #movieartistsassociation pic.twitter.com/Nguq0sf5hp
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 10, 2021
‘‘మా’ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, ఇతర విజేతలందరికీ పేరు పేరునా అభినందనలు.. నా శుభాకాంక్షలు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. ‘మా’ ఇప్పటికీ, ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Your honesty and discipline got connected highly and this amazing victory is the result of it !!
Congratulations President garu..😀😀💐💐💐
Hearty congratulations to all other winners also💐💐@iVishnuManchu pic.twitter.com/qQV5a4MsjN— Sreenu Vaitla (@SreenuVaitla) October 10, 2021
మీ నిజాయితీ మరియు క్రమశిక్షణ బాగా కనెక్ట్ అయ్యాయి, ఈ అద్భుతమైన విజయం దాని ఫలితమే.అభినందనలు అధ్యక్షుడు గారూ అని ట్వీట్ చేశారు శ్రీను వైట్ల
Congratulations🎉 @iVishnuManchu @themohanbabu garu🤗✨ #MAAElections2021 #Hyderabad #VishnuManchu pic.twitter.com/uSFG92JF4B
— Malashree Ramu (@RamuMalashree) October 11, 2021
‘మా’ ఎన్నికల సమయంలో ఇరువురు సభ్యులు శత్రువుల్లా కొట్టుకుంటున్న సందర్భంలో ఒక్కరు కూడా ‘మా’ అంతా ఒకటే కుటుంబం.. ఎందుకీ గొడవలని పెద్దలు సర్ది చెప్పే ప్రయత్నమే చేయలేదు. కానీ, ఎన్నికల తర్వాత.. ‘మా’ అంతా ఒకటే కుటుంబం అని స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. ‘మీడియా’ను బూచిగా చూపిస్తున్నారు. ‘మా’లో నిప్పు ఉంది కాబట్టే.. మీడియా దానిపై చలిమంట కాసుకుంది. ఆ నిప్పును ముందే ఆపి ఉంటే పరువు నిలిచేది కదా అని పలువురు అంటున్నారు.
Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. విష్ణు విజయానికి కారణాలివే.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..
Also Read: మంచు Vs మోనార్క్.. వీరి ప్యానళ్లలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Also Read: విష్ణు విజయంపై మంచు లక్ష్మి, మనోజ్ ఏమన్నారంటే..
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Samudram Chittabbai: ఈ రాజ్యంలో రాణే రాజుని వదిలేస్తుంది - ఆసక్తికరంగా ‘సముద్రం చిట్టబ్బాయి’ ట్రైలర్
Jamuna Death: సీనియర్ నటి జమున మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళి
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
Tollywood Deaths, Shocks - 27th Jan : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!