Mahesh Babu Rajamouli Movie : మహేష్ బాబు రేంజ్‌కు ఇలాంటి లైన్ పడితే హాలీవుడ్ షేక్ అవ్వడం పక్కా!
మహేష్ బాబుతో తాను తీయబోతున్న సినిమా జానర్ గురించి రాజమౌళి చెప్పారో... అప్పటి నుంచి ఇంటర్నెట్ షేక్ అవుతోంది. బాబు రేంజ్‌కు ఇలాంటి లైన్ పడితే హాలీవుడ్ షేక్ అవ్వడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తో తాను తీయబోతున్న సినిమా ఈ లైన్ (Globe Trotting Action Adventure)లో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) చెప్పారో... అప్పటి నుంచి ఇంటర్నెట్ షేక్ అవుతోంది. గ్లోబ్ ట్రాటింగ్ అనే పదానికి అర్థం వెతకటం దగ్గర నుంచి ఆ లైన్ లో వచ్చిన సినిమాలు ఏంటి? హాలీవుడ్ లో ప్రస్తుతం ఆ లైన్ లో ఎలాంటి ట్రెండ్ కొనసాగుతోందని మహేష్, రాజమౌళి ఫ్యాన్స్ తో పాటు సినిమా అంటే పిచ్చ అభిమానం ప్రతీవాడు సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకూ అయితే జక్కన్న - మహేష్ బాబు సినిమా లైన్ ఏంటనేది సస్పెన్స్ కానీ రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ కు అవకాశం ఉన్న ట్రెండింగ్ సినిమా లైన్స్ ఏంటో ఓ సారి ఊహించే ప్రయత్నం చేద్దాం.
Mahesh Babu As Universal Cop : యూనివర్సల్ కాప్ అంటే లీగల్ గా ఎథికల్ గా ఓ సర్టైన్ కేసు కోసం ప్రపంచదేశాలకు తిరగాల్సి వచ్చే పోలీస్. మీరు 'సింగం 3' సినిమా చూస్తే... ఓ కేసు కోసం సూర్య ఆస్ట్రేలియా వెళ్తారు. అక్కడ ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫీషియల్స్ సూర్యను ఆపే ప్రయత్నం చేస్తారు. ఆ సీన్ గుర్తుంది కదా! ఇలా ఏదైనా ఓ కేసు కోసం విదేశాల్లో తిరిగే హీరో స్టోరీ అయ్యుండొచ్చు. మహేష్ 'పోకిరి'తో చేసిన మాస్ ఫారిన్ కంట్రీస్ లో చేస్తే ఓ రేంజ్ లో ఉంటుంది కదా!?
Mahesh Babu As James Bond : జేమ్స్ బాండ్ గురించి, జేమ్స్ బాండ్ సినిమాల కథల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీళ్లు కూడా ఓ దేశాన్ని లేదా ఓ పర్టిక్యులర్ అథారిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. బట్, అదంతా అండర్ కవర్. ఓ సారి ఊహించుకోండి... ఇండియన్ జేమ్స్ బాండ్ లా మహేష్... పోష్ కార్లు, ఆ లొకేషన్లు, అల్టిమేట్ అండ్ అడ్వాన్స్డ్ గన్స్ అండ్ వగైరా వగైరా... వామ్మో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి రాజమౌళి - మహేష్ కథ జేమ్స్ బాండ్ లైన్ లో ఉండనుందా? అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
Mahesh Babu As Sniper Bounty : ఇది కంప్లీట్ లీ ఇల్లీగల్. బట్, వీళ్లకు కొన్ని టాస్క్ లు ఉంటాయి. కొన్ని దేశాల గవర్నమెంట్స్ లీగల్ గా చేయాలేని పనులను ఇలాంటి స్నైపర్స్ ను అడ్డు పెట్టుకుని చేయిస్తూ ఉంటాయి. 'అతడు' సినిమా చూశారా? అందులో మహేష్ స్నైపరే. బాజిరెడ్డి, శివారెడ్డి లాంటి క్యారెక్టర్స్ చెప్పినట్లు ఎలా అయితే మహేష్ హత్యలకు ప్లాన్ చేస్తాడో... సేమ్ అలానే స్నైపర్స్ కూడా వేర్వేరు కంట్రీస్ తిరుగుతూ వారికి అప్పగించిన పనిని చక్కబెడుతూ ఉంటారు. క్వింటన్ టరంటినో తీసిన జాంగో అన్ చైన్డ్ లా బౌంటీ హంటర్స్ లేదా క్లింట్ ఈస్ట్ వుడ్ తీసిన అమెరికన్ స్నైపర్ లాంటి కథలు ఇప్పుడు ఎప్పుడూ హాలీవుడ్ లో అటెన్షన్ ను డ్రా చేస్తూనే ఉంటాయి. అమెరికన్ మిలటరీలో మార్క్స్ మెన్ అని ఉంటాయి. వీళ్లు స్నైపర్సే బట్ వీళ్లకు లీగల్ పవర్స్ ఉంటాయి. సో అలాంటి స్నైపర్, బౌంటీ హంటర్ లాంటి కథైనా కావచ్చు!?
Mahesh Babu As Treasure Hunter or Underworld Mafia Person : 'ఆర్ఆర్ఆర్' ప్రచార కార్యక్రమాల్లో రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆఫిక్రా నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ లైన్ మహేష్ బాబు సినిమా కోసం అనుకుంటున్నామని చెప్పారు. బహుశా... నిధుల వేట దగ్గర నుంచి ఇల్లీగల్ మైనింగ్, ఆర్కియాలజీ రిలేటెడ్ అడ్వెంచరెస్ కాన్సెప్ట్ ఏదైనా అయ్యిండొచ్చు. లియోనార్డో డికాప్రియో 'బ్లడ్ మైండ్' లేదా స్పీల్ బర్గ్ తీసిన 'ఇండియా జోన్స్' లేదా 'గాడ్ ఫాదర్' లాంటి అండర్ వరల్డ్ మాఫియా లైన్‌లో ఉండే సినిమా అయ్యిండొచ్చు. యాక్షన్ అండ్ అడ్వెంచరెస్ డ్రామా క్రియేట్ చేయాలని రాజమౌళి అనుకుంటే ఈ లైన్ లో ఏదైనా అనుకుని ఉండొచ్చు!?
Mahesh Babu As World Traveller : ఆల్రెడీ పైన చెప్పిన జానర్స్ అన్నీ ప్రేక్షకులు చూసేశారు కాబట్టి... కొత్తది ఏమైనా ట్రై చేయాలనుకుంటే... '96'లో ఇంట్రడక్షన్ సాంగ్‌లో విజయ్ సేతుపతి, 'ఓకే జాను'లో తొలి పాటలో శర్వానంద్ ప్రపంచాన్ని చుట్టేస్తారు కదా! అటువంటి పాత్ర నేపథ్యంలో తిరిగే కథ కూడా అయ్యి ఉండొచ్చు!? హాలీవుడ్ లో 'ఇన్ టూ ద వైల్డ్', 'నోమడ్ ల్యాండ్' తరహా సినిమాలు తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఈ సారి ఏకంగా గ్లోబల్ బాక్సాఫీస్ ను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి తీస్తున్న సినిమా కావడం... అదీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కావడంతో... ప్రజెంట్ హాలీవుడ్ ట్రెండ్ కు తగ్గట్లుగా అనుకన్నవే ఈ లైన్స్. సినిమా ప్రేక్షకులు మహేష్ - రాజమౌళి కాంబినేషన్ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ కాంబో కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Also Read : రామ్‌తో గౌతమ్ మీనన్ సినిమా - నాగ చైతన్య అడిగితే ఆ సినిమాకు సీక్వెల్