News
News
X

Gautam Menon Upcoming Movies : రామ్‌తో గౌతమ్ మీనన్ సినిమా - నాగచైతన్య అడిగితే ఆ సినిమాకు సీక్వెల్

రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ సినిమా చేయనున్నారు. ఇంతకు ముందు ఒక సినిమా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశారు. అయితే, మళ్ళీ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

FOLLOW US: 

గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో గురువారం 'వెందు తనిందదు కాడు' (Vendhu Thanindhathu Kaadu) విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'గా శనివారం రానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా తెలుగు మీడియాతో మాట్లాడిన గౌతమ్ మీనన్... టాలీవుడ్ యంగ్‌స్టార్‌ రామ్ పోతినేనితో సినిమా చేయనున్నట్లు తెలిపారు. 'ఏ మాయ చేసావె 2' గురించి కూడా ఆయన మాట్లాడారు. 

రామ్‌తో నెక్స్ట్ ఇయర్ సినిమా ఉంటుంది - గౌతమ్ మీనన్
గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ఏటో వెళ్ళిపోయింది మనసు'లో నాని హీరోగా నటించారు. అయితే, ఆ సినిమా స్టార్ట్ చేసినప్పుడు హీరో నాని కాదు. గౌతమ్ మీనన్ ఫస్ట్ ఛాయిస్... రామ్ పోతినేని (Ram Pothineni). అవును... ఇది నిజం! రామ్‌తో కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి రామ్ తప్పుకోవడంతో నాని వచ్చారు. ఆ సినిమా ఆగిపోయినా రామ్, గౌతమ్ మీనన్ మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. 

రామ్, గౌతమ్ మీనన్ సినిమా 'స్రవంతి' రవికిశోర్ నిర్మించనున్నారు. ''వచ్చే ఏడాది వేసవి తర్వాత సినిమా ప్రారంభం కావచ్చు'' అని గౌతమ్ మీనన్ తెలిపారు. 

స్క్రిప్ట్ వ‌ర్క్‌లో కమల్ హాసన్ 'రాఘవన్ 2'
Gautham Menon Confirms Kamal Haasan's Raghavan 2 : లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా 'రాఘవన్ 2' (తమిళంలో Vettaiyaadu Villayadu 2) తప్పకుండా చేస్తానని గౌతమ్ మీనన్ తెలిపారు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ఆయన అన్నారు. రైటర్ జయమోహన్ వర్క్ చేస్తున్నారట. అయితే... ఆ సినిమా గురించి మరిన్ని వివరాలు ఇప్పుడే చెప్పలేనని అన్నారు. 

Also Read : చంపు లేదంటే చావు - ఇది కథ కాదు, గ్యాంగ్‌స్ట‌ర్‌గా ఎదిగిన సామాన్యుడి (ముత్తు) జీవితం

'ది లైఫ్ ఆఫ్ ముత్తు' సినిమా చూశాక... శింబు, తమిళంలో సినిమాను నిర్మించిన ఇషారి. కె. గణేష్ త్వరగా పార్ట్ 2 స్టార్ట్ చేయమని అడిగారని గౌతమ్ మీనన్ తెలిపారు. బహుశా... ఆ సినిమా వెంటనే స్టార్ట్ కావచ్చు. 

నాగచైతన్య అడిగితే 'ఏ మాయ చేసావె 2' చేస్తా!
అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన తొలి సినిమా 'ఏ మాయ చేసావె'. ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అని అడిగితే... ''నాగ చైతన్య అడిగితే తప్పకుండా చేస్తా'' అని గౌతమ్ మీనన్ తెలిపారు. తమిళంలో ఆ సినిమాకు వేరే క్లైమాక్స్ ఇచ్చామని, తెలుగులో క్లైమాక్స్ వేరుగా ఉంటుందని ఆయన అన్నారు. 'ఘర్షణ' సీక్వెల్ కూడా వెంకటేష్ చేతుల్లో ఉందన్నారు.

విక్రమ్ (Vikam) కథానాయకుడిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రారంభమైన 'ధ్రువ నక్షత్రం' సినిమా చాలా రోజులుగా షూటింగ్ దశలో ఉంది. ఎప్పుడు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. దానికి గౌతమ్ మీనన్ సమాధానం ఇచ్చారు. బహుశా... డిసెంబర్‌లో విడుదల కావచ్చని తెలిపారు (Dhruva Natchathiram Release On December?). షూటింగ్ పార్ట్ కొంత బ్యాలన్స్ ఉందని, దానిని పూర్తి చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

Also Read : కాషాయం జెండా కడుతున్న బాలీవుడ్ - సక్సెస్ కోసం హిందుత్వ సిద్ధాంతాన్నే నమ్ముకుంటోందా?

Published at : 14 Sep 2022 06:58 PM (IST) Tags: Kamal Haasan Gautam Menon Upcoming Movies Raghavan 2 Update Gautam Menon Ram Movie Dhruva Natchathiram On December Gautham Menon On Ye Maya Chesave 2

సంబంధిత కథనాలు

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలక్షన్స్, సూర్యకు హ్యాండిచ్చిన ఇనయా - యాంగ్రీ మ్యాన్ కి కెప్టెన్సీ?

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్ రీమేక్ చేయనున్నారా?

Bheeshma Parvam in Telugu: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్  రీమేక్ చేయనున్నారా?

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?

Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?