అన్వేషించండి

Sonakshi Sinha: ఆమెతో ఆ సీన్స్ ఎలా చేశానో అనిపించింది - వెంటనే మనీషాకు క్షమాపణలు చెప్పా: సోనాక్షి సిన్హా

‘హీరామండి’ సిరీస్ లో మనీషా కోయిరాలతో ప్రవర్తించిన తీరు బాధ కలిగించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా బాధపడింది. సిరీస్ చూడగానే ఆమెకు సారీ చెప్పినట్లు వెల్లడించింది.

Sonakshi Sinha Apologised To Manisha Koirala: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ అద్భుత ఆదరణ దక్కించుకుంటోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ సిరీస్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ నటి సోనాక్షి సిన్హా ఈ వెబ్ సిరీస్ గురించి కీలక విషయాలు వెల్లడించింది. దర్శకుడు భన్సాలీతో పాటు తన తోటి నటీనటుల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.

మనీషాతో నటించడం నా అదృష్టం- సోనాక్షి సిన్హా

‘హీరామండి’ వెబ్ సిరీస్ లో తనపాటు కలిసి నటించిన మనీషా కొయిరాలాకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా వెల్లడించింది. ఈ సిరీస్ లో ఆమెతో దురుసుగా ప్రవర్తించడం పట్ల బాధ కలిగిందని చెప్పింది. “నాకు మనీషా కొయిరాల అంటే చాలా ఇష్టం. ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అయితే, ‘హీరామండి’ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఆమెకు సారీ చెప్పాను. కొన్ని సన్నివేశాలలో ఆమెతో నేను చాలా దురుసుగా వ్యవహరించాను. నేను ఆమెతో అలా ఎలా ప్రవర్తించాను? అనిపించింది. మనీషా నిజంగా గొప్ప నటి. ఆమెతో కలిసి పని చేసే అవకాశం లభించడం నా అదృష్టం. మరోసారి ఆమెతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను” అని సోనాక్షి వెల్లడించింది.

భన్సాలీలతో సినిమా అంటే కష్టపడాల్సి అవసరం లేదు- సోనాక్షి

ఇక ‘హీరామండి’ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గురించి సోనాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఎవరైనా ఇష్టపడుతారు. ఆయనతో మూవీ చేస్తే కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఆయా సన్నివేశాల షూట్ కు ముందే అన్ని విషయాల గురించి చెప్తారు. ఈ సిరీస్ లో నా నటనకు ఆయన నుంచి ప్రశంసలు దక్కడం సంతోషం కలిగించింది. గొప్ప పాత్ర చేసే అవకాశం కల్పించినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని చెప్పుకొచ్చింది.    

‘హీరమండి’లో సోనాక్షి డ్యుయెల్ రోల్

‘హీరామండి’ వెబ్ సిరీస్ లో సోనాక్షి సిన్హా డ్యుయెల్ రోల్ పోషించింది. రహానా, ఫరీదన్ అనే క్యారెక్టర్లు చేసింది. నెగెటివ్ లక్షణాలున్న ఫరీదన్ క్యారెక్టర్ అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సిరీస్ లో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు సోనాక్షి ఏకంగా రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ లోని వేశ్యల జీవిత కథ ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. మల్లికా జాన్ పాత్రలో మనీషా కొయిరాల నటించారు. అదితిరావు హైదరి, రిచా చద్ధా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ కీలక పాత్రలు పోషించారు. 

Read Also: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్

టాప్ హెడ్ లైన్స్

Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget